2, జనవరి 2014, గురువారం

జాతీయ వార్తలు 2014 (National News 2014)

జాతీయ వార్తలు 2014 (National News 2014)

ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2014ఆంధ్రప్రదేశ్ వార్తలు-2014అంతర్జాతీయ వార్తలు-2014క్రీడావార్తలు-2014

జనవరి 2014:
  • 2014, జనవరి 3: కేరళలోని ట్రావన్‌కోర్ రాజసంస్థానం కొత్త అధిపతిగా మూళం తిరునాళ్ రామవర్మ నియమితులైనారు.
  • 2014, జనవరి 5: భారత్ స్వంత క్రయోజెనిక్స్ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ-డి5 ప్రయోగించింది.
  • 2014, జనవరి 8: మహారాష్ట్రలోని థానే జిల్లాలో బాంద్రా-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి 9 మంది మరణించారు.
  • 2014, జనవరి 9: ప్రముఖ సామాజిక కార్యకర్త అరుణారాయ్ హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటి నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
  • 2014, జనవరి 13: గోరఖ్‌పూర్ (హర్యానా)లో అణువిద్యుత్ కేంద్రం నిర్మాణాణికి ప్రధానమంత్రిచే శంకుస్థాపన జరిగింది. 
  • 2014 జనవరి 13: పశ్చిమ బెంగాల్‌లోని గంగసాగర్‌లో కుంభమేళ ప్రారంభమైంది.
  • 2014, జనవరి 15: ప్రముఖ కవి, దళిత ఉద్యమ నాయకుడు నాందేవ్ ఢసాల్ మరణించారు.
  • 2014, జనవరి 15: పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం సమీపంలో మరో విశ్వవిద్యాలయ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. 
  • 2014, జనవరి 16: వచ్చే లోకసభ ఎన్నికలకై కాంగ్రెస్ పార్టీ ప్రచార సారథిగా రాహుల్ గాంధీని ఏఐసిసి నియమించింది.
  • 2014, జనవరి 17: ప్రముఖ బెంగాలీ నటి సుచిత్రాసేన్ మరణించారు. 
  • 2014, జనవరి 18: ముంబాయిలో బురహానుద్దీన్ అంత్యక్రియలలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. 
  • 2014, జనవరి 20: సర్దార్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమి డైరెక్టరుగా అరుణా బహుగుణ నియమితులైనారు. 
  • 2014, జనవరి 22: భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్ "గరుడ వసుధ" జాతికి అంకితం చేయబడిండి.
  • 2014 జనవరి 23: బెంగుళూరులో దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా స్తంభాన్ని ఏర్పాటుచేశారు. 
  • 2014 జనవరి 23: చత్తీస్‌గఢ్‌లో ఆసియాలోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నారు. 
  • 2014, జనవరి 25: 2014 సంవత్సరాబికి పద్మ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరికి పద్మవిభూషణ్, 24 మందికి పద్మభూషణ్, 101 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. 
  • 2014, జనవరి 25: 59వ ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా "భాగ్ మిల్కా భాగ్" ఎంపికైనది. ఉత్తమ నటుడిగా ఫర్హాన్ అక్తర్, ఉత్తమ నటిగా దీపికా పదుకునే ఎంపికైనారు. 
  • 2014, జనవరి 26: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో పడవ మునిగి 21మంది మరణించారు. 
  • 2014, జనవరి 27: జైనులకు మైనార్టీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. 
  • 2014, జనవరి 31: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా.
ఫిబ్రవరి 2014:
  • 2014, ఫిబ్రవరి 1: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ ప్రమాణస్వీకారం చేశారు. (ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల జాబితా చూడండి).
  • 2014, ఫిబ్రవరి 1: దేశంలోనే తొలిసారిగా మోనోరైలు ముంబాయిలో ప్రారంభమైంది. 
  • 2014, జనవరి 5: ప్రముఖ హిందీ రచయిత విశ్వనాథ్ త్రిపాఠికి 2013 సం.పు వ్యాస్ సమ్మాన్ అవార్డు లభించింది. 
  • 2014, ఫిబ్రవరి 6: అలనాటి గాయని జుతికా రాయ్ మరణించారు. 
  • 2014, ఫిబ్రవరి 13: బీసిసిసి (ప్రసారాంశాల ఫిర్యాదుల మండలి) అధ్యక్షుడిగా ముకుల్ ముద్గల్ బాధ్యతలు స్వీకరించారు. 
  • 2014, ఫిబ్రవరి 13: ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణించారు. 
  • 2014, ఫిబ్రవరి 14: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. 
  • 2014, ఫిబ్రవరి 15: ఢిల్లీలో రాష్ట్రపతిపాలన విధించబడింది. 
  • 2014, ఫిబ్రవరి 18: రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులు ముగ్గురి శిక్షను సుప్రీకోర్టు మరణశిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా మార్చింది. 
  • 2014, ఫిబ్రవరి 19: ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వై-ఫై జోన్‌ను బీహార్ (పాట్నా-దానాపూర్) లో ప్రారంభించారు.
  • 2014, ఫిబ్రవరి 22: 2013 సంవత్సరానికి నాయుడమ్మ పురస్కారంకై జయంత్ విష్ణు నార్లికర్ ఎంపికయ్యారు. 
  • 2014, ఫిబ్రవరి 26: భారత నావికాదళం చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి రాజీనామా చేశారు. 
  • 2014, ఫిబ్రవరి 26: శివథాను (బ్రహ్మోస్ క్షిపణి రూపశిల్పి)కు రష్యా విదేశీయులకిచ్చే అత్యున్నత పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్"తో గౌరవించింది. 
  • 2014, ఫిబ్రవరి 26: దేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రాన్ని భగవాన్‌పూర్ (మధ్యప్రదేశ్)లో నరేంద్రమోడి జాతికి అంకితం చేశారు.
  • 2014, ఫిబ్రవరి 28: ప్రముఖ గాంధేయవాది, పర్యావరణవేత్త చాందీప్రసాద్ భట్‌కు 2013 సం.పు గాంధీ శాంతిబహుమతి ప్రకటించబడింది. 
మార్చి 2014:

  • 2014, మార్చి 5: ఉత్తరప్రదేశ్ గవర్నరుగా బీఎల్ జోషి పదవి అధిష్టించారు. 
  • 2014, మార్చి 6: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ రద్దు చేయబడింది. 
  • 2014, మార్చి 7: దేశంలోనే అతి ఎత్తయిన జెండా స్తంభాన్ని ఢిల్లోలోని సెంట్రల్ పార్కులో ఆవిష్కరించబడింది. 
  • 2014, మార్చి 9: భారతీయ రచయిత పంకజ్ మిశ్రాకు యేల్ విశ్వవిద్యాలయపు సాహితీ పురస్కారం లభించింది.
  • 2014, మార్చి 11: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కేరళ గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు.
  • 2014, మార్చి 12: ఇండియా-ఏవియేషన్ సదస్సు-2014 హైదరాబాదులో ప్రారంభమైంది. 
  • 2014, మార్చి 13: ఆధార్ చైర్మెన్ పదవికి నందన్ నీలేకరి రాజీనామా చేశారు.  
  • 2014, మార్చి 19: దేశంలో ఆర్థిక స్వేచ్ఛగల రాష్ట్రాలలో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది.
  • 2014, మార్చి 20: ప్రముఖ జర్నలిస్టు కుష్వంత్ సింగ్ మరణించారు. 
  • 2014, మార్చి 21: 2013 సంవత్సరపు జిడి బిర్లా పురస్కారం భౌతిక శాస్త్రవేత్త రాజేశ్ గోపకుమార్‌కు లభించింది. 
  • 2014, మార్చి 22: కాస్టెలిన్, అభిలాష్ టోమి, మహేష్ కుమార్‌లకు కీర్తిచక్ర అవార్డూలు ప్రధానం చేయబడింది. 
  • 2014, మార్చి 25: బాలువుడ్ నటి నందా మరణించారు. 
  • 2014, మార్చి 27: భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది.
  • 2014, మార్చి 28: భారత పరిశ్రమల సమాఖ్య చైర్మెన్‌గా అజయ్ శ్రీరామ్‌ ఎన్నికయ్యారు. 
ఏప్రిల్ 2014:
  • 2014, ఏప్రిల్ 6: ఫెమినా మిస్ ఇండియాగా జైపూర్‌కు చెందిన కోయల్‌రాణా ఎంపికైనది. 
  • 2014, ఏప్రిల్ 7: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ ఛాయాగ్రాహకుడు వీకే మూర్తి మరణించారు.
  • 2014, ఏప్రిల్ 11: ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రోహిణి నియమితులైనారు. 
  • 2014, ఏప్రిల్ 11: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజేంద్రమాల్ లోధా నియమితులైనారు. 
  • 2014, ఏప్రిల్ 12: 2013 సంవత్సరపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గుల్జార్‌కు లభించింది. 
  • 2014, ఏప్రిల్ 15: భారత సంతతికి చెందిన అమెరికన్ కవి విజయ్ శేషాద్రి పులిట్జర్ బహుమతికై ఎంపికయ్యారు. 
  • 2014, ఏప్రిల్ 16: 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా "షిప్ ఆఫ్ థిసియస్" ఎంపికైంది. 
  • 2014, ఏప్రిల్ 16: ఉత్తర ప్రదేశ్ లోని బృందావనంలో 70 అంతస్థుల కృష్ణమందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 
  • 2014, ఏప్రిల్ 17: భారత 22వ నౌకాదళాధిపతిగా రాబిన్ ధోవన్ బాధ్యతలు స్వీకరించారు.
  • 2014, ఏప్రిల్ 18: ఎన్‌ఎండిఐ చైర్మెన్‌గా నరేంద్ర కొఠారి నియమితులైనారు. 
  • 2014, ఏప్రిల్ 29: నార్వేలో భారత రాయబారిగా అనిల్ కుమార్ బ్రౌన్ నియమించబడ్డారు.
  • 2014, ఏప్రిల్ 30: ఢిల్లీ కార్పోరేషన్ పరిధిలోని 3 మేయర్ పదవులను భారతీయ జనతాపార్టీ కైవసం చేసుకుంది. 
మే 2014:
  • 2014, మే 1: చెన్నైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో పేలుళ్ళు జరిగాయి. 
  • 2014, మే 1: నల్లధనం కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ చైర్మెన్‌గా ఎం.బి.షా నియమించబడ్డారు. 
  • 2014, మే 4: మధ్యప్రదేశ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా నిది గ్రామ సమీపంలో రైలు పట్టాలు తప్పి 20 మందికిపైగా మరణించారు.
  • 2014, మే 5: రతన్ టాటాకు బ్రిటన్ అత్యున్నత పౌరపురస్కారం "నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్" లభించింది. 
  • 2014, మే 16: లోకసభ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ పూర్తి మెజారిటి సాధించింది. 
  • 2014, మే 17: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. 
  • 2014, మే 17: TISCO మాజీ చైర్మెన్ రూసీ మోడి మరణించారు.
  • 2014, మే 18: 15వ లోకసభను రాష్ట్రపతి రద్దు చేశారు. 
  • 2014, మే 20: బీహార్ ముఖ్యమంత్రిగా జీతన్‌రాం మంఝీ పదవీభాధ్యతలు చేపట్టారు. 
  • 2014, మే 21: అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీనామా చేశారు.
  • 2014, మే 21: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి నరేంద్రమోడి రాజీనామా చేశారు. 
  • 2014, మే 21: సిక్కిం ముఖ్యమంత్రిగా 5వ సారి పవన్ చామ్లింగ్ ప్రమాణస్వీకారం చేశారు.
  • 2014, మే 22: గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. 
  • 2014, మే 25: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టి.ఆర్.జెలియాంగ్ ప్రమాణస్వీకారం చేశారు. (రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రులు, గవర్నర్ల జాబితా)
  • 2014, మే 26: భారతదేశ 15వ ప్రధానమంత్రిగ నరేంద్ర మోడి ప్రమాణస్వీకారం చేశారు. (ప్రధానమంత్రుల పట్టిక)
  • 2014, మే 26: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌ధామ్‌ సమీపంలో ఘోరరైలుప్రమాదం- 28 మంది మరణించారు. 
  • 2014, మే 27: విదేశాలలో దాచిన నల్లధనం వెనక్కి తీసుకురావడం కోసం కేంద్రం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఎం.బి.షా నేతృత్వంలో ఏర్పాటుచేసింది. 
జూన్ 2014:
  • 2014, జూన్ 1: దేశంలో తొలి పొగాకు రహిత గ్రామంగా నాగాలాండ్‌లోని గరిపెమ గ్రామం ప్రకటించబడింది.
  • 2014, జూన్ 2: భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
  • 2014, జూన్ 2: మాజీ కేంద్రమంత్రి, భాజపా నేత తపన్ సిక్దర్ మరణించారు.
  • 2014, జూన్ 3: కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించారు. 
  • 2014, జూన్ 6: లోకసభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. (లోకసభ స్పీకర్ల జాబితా)
  • 2014, జూన్ 7: భారత సోలిసిటర్ జనరల్‌గా రంజిత్ కుమార్ నియమితులైనారు.
  • 2014, జూన్ 10: భగీరథి నదిలో బస్సు పడి 13 మంది రష్యన్లు మరణించారు. 
  • 2014, జూన్ 12: భిలాయ్ ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకై ఐదుగురు మరణించారు. 
  • 2014, జూన్ 10: భారత్‌లో "ఎయిర్ ఏషియా ఇండియా" కార్యకలాపాలు మొదలయ్యాయి.
  • 2014, జూన్ 10: ఇన్ఫోసిసి సీఈఓగా విశాల్ సిక్కా నియమితులైనారు.
  • 2014, జూన్ 14: భారత అతి పెద్ద యుద్ధనౌక "విక్రమాదిత్య" ప్రధానమంత్రి నరేంద్రమోడిచే జాతికి అంకితం ఇవ్వబడింది. 
  • 2014, జూన్ 17: ఉత్తరప్రదేశ్ గవర్నర్ బి.ఎల్.జోషి రాజీనామా చేశారు. 
  • 2014, జూన్ 19: వరల్డ్ ఫుడ్ ప్రైజ్ భారత సంతతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త సంజయ్‌ రాజారాంకు లభించింది.
  • 2014, జూన్ 19: యమునా నది పుష్కరాలు ప్రారంభమైనాయి. 
  • 2014, జూన్ 19: హోమీ-జె-బాబా నివశించిన భవనం "మెహ్రంగిర్" వేలంపాటలో రూ.372 కోట్లు పలికింది. 
  • 2014, జూన్ 20: కేంద్ర ప్రభుత్వం రైలుచార్జీలను పెంచింది- ప్రయాణీకుల చార్జీలు 14.2%, సరకు రవాణా చార్జీలు 6.5% పెరిగాయి. 
  • 2014, జూన్ 20: జ్ఞాన్‌పీఠ్ అవార్డు (2013 సంవత్సరపు) హిందీకవి కేదార్‌నాథ్ సింగ్‌కు లభించింది. ఈ పురస్కారం పొందిన 10వ హిందీకవి. (జ్ఞాన్‌పీఠ అవార్డు గ్రహీతల పట్టిక)
  • 2014, జూన్ 23: హిమాచల్ ప్రదేశ్‌లోని గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది. 
  • 2014, జూన్ 25: నాగాలాండ్ గవర్నర్ అశ్వినీకుమార్ రాజీనామా చేశారు. 
  • 2014, జూన్ 24: జలాంతర్గాములను వేటాడే తొలి దేశీయ యుద్ధనౌక "ఐఎన్‌ఎస్ కమోర్తా"ను కోల్‌కతలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ సంస్థ రూపొందించింది. 
  • 2014, జూన్ 27: కర్ణాటక గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్, త్రిపుర గవర్నర్ దేవానంద్ కొంవర్ పదవీవిరమణ చేశారు. (రాష్ట్రాల వారీగా గవర్నర్ల జాబితా
  • 2014, జూన్ 28: కర్ణాటక గవర్నరుగా కొణిజేటి రోశయ్య అదనపు బాధ్యతలు స్వీకరించారు.  
  • 2014, జూన్ 30: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎం.కె.నారాయణన్ రాజీనామా చేశారు. 
  • 2014, జూన్ 30: షార్ నుంచి పీఎస్‌ఎల్‌వి సి-23 విజయవంతంగా ప్రయోగించబడింది. 
జూలై 2014:
  • 2014, జూలై 5: గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణేపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అవినీతి కేసు నమోదు చేసింది.
  • 2014, జూలై 6: గుజరాత్ గవర్నరుగా ఉన్న కమలా బేణీవాల్‌ను మిజోరాం గవర్నరుగా, రాజస్థాన్ గవర్నరు మార్గరెట్ ఆల్వాను గుజరాత్ గవర్నరుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 
  • 2014, జూలై 8: సదానందగౌడ లోకసభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు.
  • 2014, జూలై 9: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఎన్నికయ్యారు. 
  • 2014, జూలై 10: బాలీవుడ్ నటి జోహ్రా సెహగల్ మరణించారు. 
  • 2014, జూలై 10: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో 2014-15 సంవత్సరపు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 
  • 2014, జూలై 11: భారతదేశానికి చెందిన గణిత మేధావి నిఖిల్ శ్రీ వాస్తవకు "జార్జి పోల్యా బహుమతి" లభించింది. 
  • 2014, జూలై 13: విశ్వహిందూ పరిషత్తు సీనియర్ నాయకుడు గిరిరాజ్ కిశోర్ మరణించారు. 
  • 2014, జూలై 14: 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులైనారు. ఉత్తరప్రదేశ్ - రాంనాయక్, గుజరాత్ - ఈం ప్రకాశ్ కోహ్లీ, పశ్చిమబెంగాల్ - కేసరినాథ్ త్రిపాఠి, ఛత్తీస్‌గఢ్ - బలరాందాస్ టాండన్, నాగాలాండ్ - పద్మనాభా ఆచార్య. 
  • 2014, జూలై 14: మధ్యప్రదేశ్‌లోని నర్మదాలోయలో సుమారు 6కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ అవశేషాలు లభ్యమయ్యాయి. 
  • 2014, జూలై 23: మార్కెట్ విలువ రూ.5లక్షల కోట్లు దాటిన తొలి భారతీయ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అవతరించింది.
  • 2014, జూలై 24: సర్దార్ పటేల్ జీవిత చరిత్రను బ్రెయిలీ లిపిలో ప్రధానమంత్రి నరేంద్రమోడి విడుదల చేశారు. 
  •  2014, జూలై 25: హర్యానా గవర్నరుగా కప్తాన్ సింగ్ సోలంకి నియమితులైనారు. 
  • 2014, జూలై 28: ఒకే రోజు 362 రిటైల్ ఔట్‌లెట్లు ప్రారంభించి యూనినార్ గిన్నిస్ రికార్డు సృష్టించింది.
  • 2014, జూలై 29: ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణ పనులు మణిపూర్‌లో ప్రారంభమయ్యాయి. 
  • 2014, జూలై 30: కొండచరియలు విరిగిపడటంతో మహారాష్ట్రలో మాళిణ్ గ్రామం సమాధి అయింది. 
ఆగస్టు 2014:
  • 2014, ఆగస్టు 1: 22వ రాజీవ్‌గాంధీ జాతీయ సద్భావన పురస్కారం ముజఫర్ అలీకి ప్రకటించబడింది. 
  • 2014, ఆగస్టు 7: ప్రముఖ కార్టూనిస్టు ప్రాణ్ కుమార్ శర్మ మరణించారు. 
  • 2014, ఆగస్టు 7: దేశంలో అత్యంత విలువైన బ్రాండుగా టాటాగ్రూపు అగ్రస్థానం నిలబెట్టుకుంది.
  • 2014, ఆగస్టు 7: మిజోరాం గవర్నర్ కమలా బేనివాల్‌ను పదవి నుంచి తొలగించారు. 
  • 2014, ఆగస్టు 11: 2010 సంవత్సరపు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు అరుణ్ జైట్లీ, 2011 సంవత్సరానికి కరణ్ సింగ్, 2012 సంవత్సరానికి గాను శరద్ యాదవ్ ఎంపికయ్యారు. 
  • 2014, ఆగస్టు 13: లోకసభ డిప్యూటి స్పీకర్‌గా తంబిదురై ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
  • 2014, ఆగస్టు 13: భారత సంతతి గణితమేధావి మంజుల్ భార్గవకు పీల్డ్స్ మెడల్ లభించింది.
  • 2014, ఆగస్టు 14: ఉన్నత న్యాయస్థానాలలో కొలీజియం వ్యవస్థను రద్దుచేసే బిల్లుకు లోకసభ ఆమోదించింది. 
  • 2014, ఆగస్టు 14: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సునీల్ కుమార్ గ్లోబర్ సౌత్ అవార్డుకు ఎంపికైనారు. 
  • 2014, ఆగస్టు 14: యూపీఎస్సీ కొత్త చైర్మెన్‌గా రజని రాజ్‌దాస్ ఎంపికయ్యారు. 
  • 2014, ఆగస్టు 19: ప్రముఖ యోగా గురువు బి.కె.ఎస్.అయ్యంగార్ మరణించారు. 
  • 2014, ఆగస్టు 20: పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.వి.థామస్ నియమితులైనారు. 
  • 2014, ఆగస్టు 22: సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి మరణించారు. 
  • 2014, ఆగస్టు 23: జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐ.ఎన్.ఎస్.కమోర్టాను విశాఖపట్టణం వద్ద జాతికి అంకితం చేశారు. 
  • 2014, ఆగస్టు 25: 1993 నుంచి బొగ్గుగనుల కేటాయింపులన్నీ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 
  • 2014, ఆగస్టు 26: భాజపా పార్లమెంటరీ బోర్డు చైర్మెన్‌గా అమిత్‌షా ఎన్నికయ్యారు.
  • 2014, ఆగస్టు 26: మహారాష్ట్ర గవర్నరుగా సీహెచ్ విద్యాసాగర్ రావు, కర్ణాటక గవర్నరుగా వాజుభాయ్ వాలా, రాజస్థాన్ గవర్నరుగా కళ్యాణ్ సింగ్, గోవా గవర్నరుగా మృదులా సిన్హా నియమితులైనారు.
  • 2014, ఆగస్టు 28: ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
  • 2014, ఆగస్టు 30: ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర మరణించారు. 
 సెప్టెంబరు 2014:
  • 2014, సెప్టెంబరు 1: 821 సంవత్సరాల అనంతరం నలంద విశ్వవిద్యాలయం పునఃప్రారంభమైంది.
  • 2014, సెప్టెంబరు 3: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దత్తు నియమితులైనారు.
  • 2014, సెప్టెంబరు 3: కేరళ గవర్నరుగా పి.సదాశివం నియమితులైనారు. 
  • 2014, సెప్టెంబరు 4: జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో బస్సు నదిలో పడి 40+ మరణించారు. 
  • 2014, సెప్టెంబరు 4: అతి పెద్ద తీరప్రాంత గస్తీనౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను నౌకాదళంలో ప్రవేశపెట్టారు. 
  • 2014, సెప్టెంబరు 9: ముంబాయి మేయరుగా శివసేన పార్టీకి చెందిన స్నేహల్ అంబేకర్ ఎన్నికయ్యారు. 
  • 2014, సెప్టెంబరు 19: ప్రముఖ మాండలిన్ విధ్వాంసుడు యు.శ్రీనివాస్ మరణించారు. 
  • 2014, సెప్టెంబరు 24: మామ్‌ (మార్స్ ఆర్బిటర్ మిషన్) అంగారక గ్రహ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. 
  • 2014, సెప్టెంబరు 25: మహారాష్ట్రలో భాజపా-శివసేన మరియు కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు విచ్ఛిన్నమైంది. 
  • 2014, సెప్టెంబరు 27: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ రాజీనామా చేశారు. 
  • 2014, సెప్టెంబరు 27: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను బెంగుళూరు కోర్టు దోషిగా తీర్పు ఇచ్చింది. 
  • 2014, సెప్టెంబరు 28: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించబడింది. 
  • 2014, సెప్టెంబరు 29: తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం చేశారు. 
  • 2014, సెప్టెంబరు 30: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఢీకొనడంతో 9 మంది మరణించారు. 
 అక్టోబరు 2014:
  •  2014, అక్టోబరు 3: పాట్నాలో రావణదహనం అనంతరం జరిగిన తొక్కిసలాటలో 33 మంది మరణించారు.
  • 2014, అక్టోబరు 4: అలీఘఢ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఎన్డీఎం-4 అనే కొత్త వైరస్ కనుగొన్నారు. 
  • 2014, అక్టోబరు 4: స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత సంతతి ప్రొఫెసర్ థామస్ కైలాస్‌కు అమెరికన్ నేషనల్ మెడల్ పాహ్ సైన్స్ పురస్కారం లభించింది.
  • 2014, అక్టోబరు 7: ప్రముఖ రక్షణ పరిశోధకుడు ఇవథాను పిళ్ళైకు లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు లభించింది. 
  • 2014, అక్టోబరు 8: దేశీయ పర్యాటకంలో తమిళనాడు ప్రథమస్థానంలో నిలిచింది. 
  • 2014, అక్టోబరు 8: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా ములాయంసింగ్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. 
  • 2014, అక్టోబరు 10: భారత్‌కు చెందిన కైలాస్ సత్యర్థి పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసుఫ్ జాయ్‌తో కలిసి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైనారు. 
  • 2014, అక్టోబరు 13: డిఎల్‌ఎఫ్‌పై సెబి మూడేళ్లు నిషేధం విధించింది. 
  • 2014, అక్టోబరు 17: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పర్చిన సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి "నిర్భయ్"ను ఒరిస్సాలోని బాలాసోర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. 
  • 2014, అక్టోబరు 19: హర్యానా శాసనసభ ఎన్నికలలో ఫలితాలలో భారతీయ జనతాపార్టీ పూర్తి మెజారిటి సాధించగా, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
  • 2014, అక్టోబరు 19: హర్యానా ముఖ్యమంత్రి పదవికి భూపిందర్ సింగ్ హుడా రాజీనామా చేశారు. 
  • 2014, అక్టోబరు 21: హర్యానాలోని ఫరీదాబాదులో అగ్నిప్రమాదంలో 200 బాణాసంచా దుకాణాలు దగ్దమైనాయి. 
  • 2014, అక్టోబరు 24: సినిమా దర్శకుడు అశోక్ కుమార్ మరణించారు. 
  • 2014, అక్టోబరు 25: హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేశారు. 
  • 2014, అక్టోబరు 28: ప్రసారభారతి చైర్మెన్‌గా ప్రముఖ పాత్రికేయుడు ఎ.సూర్యప్రకాశ్ నియమితులైనారు. 
  • 2014, అక్టోబరు 28: త్రిపురనేని గోపీచంద్ అవార్డు ఉర్దూ రచయిత్రి జీలాని బానోకు లభించింది. 
  • 2014, అక్టోబరు 31: దేవేంద్ర ఫడ్నావీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 
నవంబరు  2014:
  • 2014, నవంబరు 3: బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ మరణించారు.
  • 2014, నవంబరు 4: భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సింధూకీర్తి విశాఖపట్నం వద్ద జలప్రవేశం చేసింది. 
  • 2014, నవంబరు 5: ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. 
  • 2014, నవంబరు 5: మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్‌కు జపాన్ ప్రభుత్వం "గ్రాండ్ కార్డన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌలోవినియా ఫ్లవర్స్" అవార్డు ప్రకటించింది. 
  • 2014, నవంబరు 7: వారణాసి లోకసభ నియొజకవర్గంలో జయపూర్ గ్రామాన్ని నరేంద్రమోడి దత్తత తీసుకున్నారు. 
  • 2014, నవంబరు 8: గోవా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. 
  • 2014, నవంబరు 8: గోవా ముఖ్యమంత్రిగ లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణస్వీకారం చేశారు. 
  • 2014, నవంబరు 9: కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా 21 గురికి చోటు కల్పించబడింది. మొత్తం మంత్రివర్గం సంఖ్య 66కి పెరిగింది. 
  • నవంబరు 12: మహారాష్ట్రలో ఫడ్నావీస్ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గింది. 
  • నవంబరు 12: హిందీ సినిమా దర్శకుడు రచిచోప్రా మరణించారు. 
  • నవంబరు 12: మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేతగా శివసేనకు చెందినఏక్‌నాథ్ శిందే నియమితులైనారు. 
  • 2014, నవంబరు 19: ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇస్రోకు లభించింది. 
  • 2014, నవంబరు 23: కేరళకు చెందిన ఇద్దరు క్రీస్తు మతబోధకులకు "సెయింట్ హుడ్" లభించింది. (ఫాదర్ కురియకోస్ ఇలియాస్ ఛవారా, సిస్టర్ యూఫ్రేసియా).
  • 2014, నవంబరు 23: యూపీఎస్సీ చైర్మెన్‌గా దీపక్ గుప్తా నియమితులైనారు. 
  • 2014, నవంబరు 24: కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా మరణించారు.
  • 2014, నవంబరు 25: కథక్ నృత్యకారిణి సితార దేవి మరణించింది.
  • 2014, నవంబరు 25: ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్‌లలో తొలిదశ పోలింగ్ జరిగింది. 
  •  
డిసెంబరు  2014:
  • 2014, డిసెంబరు 1: ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడిలో 14 మంది జవాన్లు మరణించారు.
  • 2014, డిసెంబరు 2: బాలీవుడ్ నటుడు దేవేన్‌వర్మ మరణించారు. 
  • 2014, డిసెంబరు 2: సీబీసి కొత్త డైరెక్టరుగా అనిల్ కుమార్ సిన్హా నియమితులైనారు. 
  • 2014, డీసెంబరు 2: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏ.ఆర్.అంతూలే మరణించారు. 
  • 2014, డిసెంబరు 4: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ మరణించారు.
  • 2014, డిసెంబరు 5:జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 11 మంది సైనికులు మరణించారు.
  • 2014, డిసెంబరు 5: సింగపుర్‌కు చెందిన "ది స్ట్రెఉఇట్ టైమ్స్" పత్రిక నరేంద్రమోదిని ఆసియాన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపిక చేసింది. 
  • 2014, డిసెంబరు 5: మహారాష్ట్ర మంత్రిమండలిలో శివసేన చేరింది. 
  • 2014, డిసెంబరు 10: కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి పురస్కారం స్వీకరించారు. 
  • 2014, డిసెంబరు 13: ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా దినేశ్వర్ శర్మ నియమితులైనారు. 
  • 2014, డిసెంబరు 14: భారతదేశంలో అతిపెద్ద సంస్థగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అవతరించింది. 
  • 2014, డిసెంబరు 16: ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాద సంస్థను భారత ప్రభుత్వం నిషేధించింది. 
  • 2014, డిసెంబరు 21: కేంద్రమాజీ మంత్రి, డిఎంకె నాయకుడు నెపోలియన్ భారతీయ జనతాపార్టీలో చేరారు. 
  • 2014, డిసెంబరు 20: భారత గూఢచార్య సంస్థ "రా" అధిపతిగా రాజిందర్ ఖన్నా నియమితులైనారు. 
  • 2014, డిసెంబరు 23: ఝార్ఖండ్‌లో భారతీయ జనతాపార్టీ పూర్తి మెజారిటి సాధించగా, జమ్మూకశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది.
  • 2014, డిసెంబరు 23: ప్రముఖ దర్శక నిర్మాత కె.బాలచందర్ మరణించారు. 
  • 2014, డిసెంబరు 23: అసోంలో బోడో మిలిటెంట్ల దాడిలో 35 మంది మరణించారు. 
  • 2014, డిసెంబరు 23: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. 
  • 2014, డిసెంబరు 24: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాజీనామా చేశారు.
  • 2014, డిసెంబరు 24: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి, స్వాతంత్ర్యసమరయోధుడు మదన్ మోహన్ మాలవీయలకు భారతరత్న అవార్డులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిందింది. 
  • 2014, డిసెంబరు 27: కేరళలోని త్రిస్సూర్‌లో 18112 మంది శాంటాక్లాజ్ వేషధారులు ఒకే ప్రాంగణంలో చేరి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
  • 2014, డిసెంబరు 28: అమితాబ్ బచ్చన్ అక్కినేణి జాతీయ పురస్కారం అందుకున్నారు.
  • 2014, డిసెంబరు 28: ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రఘువర్‌దాస్ పదవి చేపట్టారు. 
  • 2014, డిసెంబరు 30: ఉత్తరాఖండ్ గవర్నరుగా కృష్ణకాంత్ పాల్ నియమితులైనారు. ఉత్తరాఖండ్ గవర్నరుగా ఉన్న అజీజ్ ఖురేషి మిజోరాంకు బదిలీ అయ్యారు. (అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల, గవర్నర్ల జాబితా)
  • 2014, డిసెంబరు 30: ప్రముఖ జర్నలిస్టు బి.జి.వర్ఘీస్ మరణించారు.

ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2015,


2 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక