2, జనవరి 2014, గురువారం

అంతర్జాతీయ వార్తలు 2014 (International News 2014)

అంతర్జాతీయ వార్తలు 2014 (International News 2014)
 
ఇవి కూడా చూడండి:  తెలంగాణ వార్తలు-2014ఆంధ్రప్రదేశ్ వార్తలు-2014,   జాతీయ వార్తలు-2014క్రీడావార్తలు-2014

జనవరి 2014:
  •  2014, జనవరి 1: రష్యాలోని నొవాస్‌బిరిస్క్ ప్రాంతంలో 3500 ఏళ్ల క్రితం నాటి అస్థిపంజరాలు త్రవ్వకాలలో లభించాయి.
  • 2014, జనవరి 3: మడగాస్కర్‌ అధ్యక్ష ఎన్నికల్లో హేరి రాజోనారిమామ్‌పియానినా విజయం సాధించారు. 
  • 2014, జనవరి 5: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. 
  • 2014, జనవరి 11: ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఎరియల్ షెరాన్ మరణించారు. 
  • 2014, జనవరి 12: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా మూడవసారి ప్రమాణస్వీకారం చేసింది. 
  • 2014, జనవరి 27: గ్రామీ అవార్డులలో డాప్ట్‌పంక్‌గా పేరుపొందిన సంగీతజోడికి 5 అవార్డులు లభించాయి. 
ఫిబ్రవరి 2014:
  •  2014, ఫిబ్రవరి 2: ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర దీవులలో ఉన్న సినాబంగ్ అగ్నిపర్వతం పేలి 16 మంది మరణించారు. 
  • 2014, ఫిబ్రవరి 4: భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవి లభించింది. 
  • 2014, ఫిబ్రవరి 10: నేపాల్ ప్రధానమంత్రిగా సుశీల్ కొయిరాలా ఎన్నికయ్యారు. 
  • 2014, ఫిబ్రవరి 11: అల్జీరియాలో సైనిక విమానం కూలి 103 మంది మరణించారు. 
  • 2014, ఫిబ్రవరి 20: ప్రముఖ మొబైల్ మెసేజింగ్ సర్వీస్ వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది.
  • 2014, ఫిబ్రవరి 22: ఇటలీ ప్రధానమంత్రిగా మెటెయో రెంజీ పదవిబాధ్యతలు స్వీకరించారు.
మార్చి 2014:
  • 2014, మార్చి 1: ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్‌ను బ్రిటన్ కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ లిమిటెడ్ సంస్థ ఆవిష్కరించింది.
  • 2014, మార్చి 2: ప్రపంచంలోని కుబేరుల్లో బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలిచారు. 
  • 2014, మార్చి 3: ఉక్రేయిన్‌లోని క్రిమియా సమీపంలోని నౌకాస్థావరాన్ని రష్యా ఆక్రమించింది.
  • 2014,మార్చి 3:లాస్‌ఏంజిల్స్‌లో 2013 సంవత్సరపు ఆస్కార్ అవార్డులు ప్రకటించబడ్డాయి. (2013 ఆస్కార్ అవార్డుల జనరల్ నాలెడ్జి ప్రశ్నల కోసం ఇక్కడ చూడండి)
  • 2014, మార్చి 9: కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్ళాల్సిన మలేషియా విమానం అదృశ్యమైంది.
  • 2014, మార్చి 9: యేల్ విశ్వవిద్యాలయ సాహిత్య పురస్కారం పంకజ్ మిశ్రాకు లభించింది.
  • 2014, మార్చి 17: క్రిమియా స్వతంత్ర్య దేశంగా ప్రకటించుకుంది. 
ఏప్రిల్ 2014:
  • 2014, ఏప్రిల్ 2: చిలీలో భారీ భూకంపం సంభవించింది.
  • 2014, ఏప్రిల్ 3: పాకిస్తాన్ మాజీ పాలకుడు ముషారఫ్ బాంబుదాడి నుంచి తప్పించుకున్నారు. 
  • 2014, ఏప్రిల్ 7: లఫ్జరీ (ఫ్రాన్స్), హోల్సిం (స్విట్జర్లాండ్) సిమెంటు కంపెనీలు ఏకమై "లఫ్జరీహోల్సిం" పేరిటప్రపంచంలోనే అతిపెద్ద సిమెంటు కంపెనీగా అవతరించింది.
  • 2014, ఏప్రిల్ 10: చైనాలో అత్యంత ప్రభావవంతమైన బోవో ఫోరం ఫర్ ఆసియా బోర్డులో భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు సభ్యత్వం లభించింది.
  • 2014, ఏప్రిల్ 15: భారత సంతతికి చెందిన అమెరికన్ కవి విజయ్ శేషాద్రి పులిట్జర్ బహుమతికై ఎంపికయ్యారు. 
  • 2014, ఏప్రిల్ 15: బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఆసియా కంపెనీగా హిందూజా గ్రూపు తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
  • 2014, ఏప్రిల్ 16: దక్షిణ కొరియాలో 459 ప్రయాణీకులు ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయింది. 
  • 2014, ఏప్రిల్ 20: ప్రముఖ ఔషధ కంపెనీ ర్యాన్‌బాక్సీని సన్ ఫార్మాస్యూటికల్స్ విలీనం చేసుకుంది. 
  • 2014, ఏప్రిల్ 22: మిరప మెక్సిలో పుటిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశొధకులు కనుగొన్నారు.
  • 2014, ఏప్రిల్ 26: న్యూయార్క్‌లో ప్రపంచ హిందీ మహాసభలు ప్రారంభమయ్యాయి. 
  • 2014, ఏప్రిల్ 27: ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధుడు ఇటలీకి చెందిన అర్టురో లికాటా మరణించాడు.
మే 2014:
  • 2014, మే 1:ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో హైస్పీడ్ రైలు సొరంగాన్ని చైనా ప్రారంభించింది. 
  • 2014, మే 1: నోకియా కంపెనీ సీఈఓగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరీ నియమితులైనారు. 
  • 2014, మే 2: ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళగా జెన్నిఫర్ లారెన్స్ ఎంపికైంది.
  • 2014, మే 3: అఫ్ఘనిస్తాన్‌లో కొండచరియలు విరిగిపడి 2000లకు పైగా ప్రజలు మరణించారు. 
  • 2014, మే 4: లిబియా ప్రధానమంత్రిగా అహ్మద్ మతిక్ పదవి చేపట్టారు. 
  • 2014, మే 10: దక్షిణాఫ్రికా ఎన్నికలలో ఆఫ్హ్రికన్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది. 
  • 2014, మే 20: థాయిలాండ్‌లో సైనిక శాసనం విధించబడింది. 
  • 2014, మే 27: 560 కిలోల బరువుతో ప్రపంచంలోనే స్థూలకాయుడిగా గిన్నిస్ రికార్డులో స్థానం పొందిన మాన్యేల్ యురిబ్ (మెక్సికో) మరణించాడు. 
జూన్  2014:
  • 2014, జూన్ 1: లండన్ బరో ఆఫ్ సౌత్ వార్క్ మేయర్‌గా ప్రవాస భారతీయుడు సునీల్ చోప్రా ఎన్నికయ్యారు.
  • 2014, జూన్ 9: కరాచి విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడిచేశారు. 
  • 2014, జూన్ 16: ఇరాక్‌లో అంతర్యుద్ధం మొదలైంది. 
  • 2014, జూన్ 16: భారత ప్రధాని నరేంద్రమోడి భూటాన్ పర్యటించి థింపూలో ఖొలాంగ్సు జలవిద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. 
  • 2014, జూన్ 18: ఆసియా నోబెల్ ఫైజ్‌గా పరిగణించబడే "తాంగ్ ప్రైజ్" నార్వే మాజీ ప్రధానమంత్రి గ్రోహార్మెమ్‌ బ్రంట్‌లాండ్‌కు లభించింది. 
  • 2014, జూన్ 26: యెమెన్ విమానాశ్రయంపై మిలిటెంట్లు దాడిచేశారు. 
  • 2014, జూన్ 28: నమీబియాలో 54 కోట్ల సంవత్సరాల క్రితం నాటి పగడపు దిబ్బ లభించింది.

  • జూలై   2014:
  • 2014, జూలై 13: దక్షిణాఫ్రికాకు చెందిన సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత నాడినె గార్డెమెర్ మరణించారు.
  • 2014, జూలై 15: సిరియా అధ్యక్షుడిగా బషీర్ అల్ అస్సాద్ వరసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. 
  • 2014, జూలై 17: ఉక్రేయిన్-రష్యా సరిహద్దులో మలేషియాకు చెందిన బోయింగ్-777 విమానం కూలి 295 మంది మరణించారు. 
  • 2014, జూలై 18: సిరియాలో ఇస్లామిక్ తీవ్రవాదులతో జరిగిన పోరులో 100 మంది సైనికులు మరణించారు. 
  • 2014, జూలై 22: వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో భూమిలాంటి గ్రహాన్ని (కెప్లర్-421బి) ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
  • 2014, జూలై 24: దక్షిణ కొరియాలోని బుసాన్ నగరంలో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరించబడింది.
  • 2014, జూలై 24: తైవాన్‌లో విమానం కూలి 51 మంది మరణించారు. 
  • 2014, జూలై 24: అల్జీరియాకు చెందిన విమానం కూలి 54 మంది మరణించారు. 
  • 2014, జూలై 28: ఫిలిప్పీన్స్ జనాభా 100 మిలియన్లు దాటింది. 
ఆగస్టు 2014:
  • 2014, ఆగస్టు 4: చైనాలో యున్నాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించి 400 మంది మరణించారు.
  • 2014, ఆగస్టు 10: టెహరాన్ వద్ద విమానం కూలి 50 మంది మరణించారు. 
  • 2014, ఆగస్టు 13: ఫీల్డ్స్ మెడల్ పొందిన తొలి మహిళగా మరియం మిర్‌జఫానీ అవతరించింది. 
  • 2014, ఆగస్టు 14: పిట్స్‌బర్గ్ శాస్త్రవేత్తలు లోహపు గాజును తయారుచేశారు. 
  • 2014, ఆగస్టు 15: పాకిస్తాన్‌లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. 
  • 2014, ఆగస్టు 20: ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా జపాన్‌కు చెందిన సకారీ మొమోయి (111 ఏళ్ళు) గిన్నిస్‌బుక్‌లో నమోదయ్యారు. 
  • 2014, ఆగస్టు 24: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో మరణించారు. 
సెప్టెంబరు 2014:
  • 2014, సెప్టెంబరు 7: అంతర్జాతీయ విజ్ఞానశాస్త్ర మండలి అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి దయారెడ్డి ఎన్నికయ్యారు.
  • 2014, సెప్టెంబరు 9: భారతీయ సంతతికి చెందిన రచయిత నీల్ ముఖర్జీ రచించిన "ది లైవ్స్ ఆఫ్ అదర్స్: నవల మ్య్న్ బుకర్ బహుమతి (2014) తుది జాబితాలో చేరింది. 
  • 2014, సెప్టెంబరు 11: జేమ్స్ బాండ్ విలన్ రిచర్డ్ కైల్ మరణించాడు. 
  • 2014, సెప్టెంబరు 19: స్కాట్లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణలో బ్రిటన్‌తో కలిసి ఉండేందుకు ప్రజలు మద్దతు పలికారు. 
  • 2014, సెప్టెంబరు 21: అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా అష్రఫ్ అహ్మద్ జైన్ ఎన్నికయ్యారు. 
  • 2014, సెప్టెంబరు 25: ప్రపంచంలో ఖరీదైన నగరంగా లండన్ నిలిచింది. 
  • 2014, సెప్టెంబరు 30: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఆర్కుట్ మూతపడింది. 
అక్టోబరు 2014:
  • 2014, అక్టోబరు 1: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం విడుదల చేసింది.
  • 2014, అక్టోబరు 1: ప్రపంచంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రారంభమై 50 పూర్తయింది. (1964 అక్టోబరు 1న జపాన్‌లో ప్రారంభమైంది).
  • 2014, అక్టోబరు 6: వైద్యశాస్త్రంలో 2014 సం.పు నోబెల్ బహుమతిని జాన్ ఒ కీఫే (బ్రిటన్-అమెరికన్), ఎడ్వర్డ్ మోసర్ (నార్వే), మేబిట్ మోసర్ (నార్వే)లకు లభించింది. 
  • 2014, అక్టోబరు 7: ఇసాము అకసాకి (జపాన్), హిరోషి అమానో (జపాన్), ఘజి నకమురా (జపాన్‌లో పుట్టిపెరిగి అమెరికాలో స్థిరపడ్డారు) లకు 2014 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతులు ప్రకటించారు. 
  • 2014, అక్టోబరు 8: రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎరిక్ బెట్‌జిగ్ (అమెరికా), విలియం మోర్నర్ (అమెరికా), స్టోఫెన్ హెల్ (జర్మనీ)లకు ప్రకటించారు. 
  • 2014, అక్టోబరు 10: ఓ ఏడాది నోబెల్ శాంతిబహుమతి కైలాస్ సత్యర్థి (భారత్), మలాలా యూసుఫ్ జాయ్ (పాకిస్తాన్)లకు ప్రకటించారు. 
  • 2014, అక్టోబరు 13: 2014 సంవత్సరపు ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి ఫ్రాన్సుకు చెందిన జీన్ టిరోల్‌కు లభించింది. 
  • 2014, అక్టోబరు 15: ఈ ఏడాది మ్యాన్ బుకర్ బహుమతి ఆస్ట్రేలియాకు చెందిన రిచర్డ్ ఫ్లానగాన్‌కు లభించింది. 
  • 2014, అక్టోబరు 17: ఈ సంవత్సరపు ప్రపంచ ఆహార పురస్కారం భారత్‌లో జన్మించిన మెక్సికో శాస్త్రవేత్త సంజయ్ రాజారాంకు ప్రకటించారు. 
  • 2014, అక్టోబరు 18: ఇరాక్‌లో కారుబాంబు పేలి 23 మంది మరణించారు. 
  • 2014, అక్టోబరు 21: ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి గాఫ్ వైట్ లామ్ మరణించారు. 
  • 2014, అక్టోబరు 22: అఈతలోలోని ఒక ల్యాబ్‌లో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత (-273.144)ను సృష్టించి రికార్డు నెలకొల్పారు.
  • 2014, అక్టోబరు 22: అట్టావాలో పార్లమెంటు ఆవరణలో కాల్పులు జరిగాయి. 
  • 2014, అక్టోబరు 26: బ్రెజిల్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. 
  • 2014, అక్టోబరు 30: శ్రీలంకలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 200 మంది సజీవసమాధి అయ్యారు.
    నవంబరు  2014:
  • 2014, నవంబరు 2: పాకిస్తాన్‌లోని వాఘా వద్ద బాంబుపేలుడులో 55 మంది మరణించారు.
  • 2014, నవంబరు 5: అమెరికన్ సెనేట్ ఎన్నికలలో రిపబ్లిక పార్టీ మంచి ఫలితాలు సాధించింది.
  • 2014, నవంబరు 8: ఉక్రేయిన పార్లమెంటు ఎన్నికలలో అధికార పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధించింది. 
  • 2014, నవంబరు 15: బ్రిస్బేన్‌లో జి-20 సదస్సు ప్రారంభమైంది. 
  • 2014, నవంబరు 25: అఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 52 మంది మరణించారు. 
  • 2014, నవంబరు 26: 18వ సార్క్ సదస్సు ఖాట్మండులో ప్రారంభమైంది. 
  • 2014, నవంబరు 26: పాకిస్తాన్ నటి వీణామాలిక్‌కు 26 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. 
  • 2014, నవంబరు 29: మిస్ ఎర్త్‌గా పిలిప్పీన్స్‌కు చెందిన జమీ హెరెల్ ఎన్నికైంది. 
డిసెంబరు   2014:
  • 2014, డిసెంబరు 3: జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ హయబుస-2ను విజయవంతంగా ప్రయోగించింది.
  • 2014, డిసెంబరు 7: ఎర్రసముద్రంలో పడవ మునిగి 70 మంది మరణించారు.
  • 2014, డిసెంబరు 10: భారత్‌లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్‌ వర్మ ఎంపికైనారు.
  • 2014, డిసెంబరు 10: టైం పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా ఎబోలా ఫైటర్స్ ఎంపికైంది. 
  • 2014, డిసెంబరు 11: ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించింది. 
  • 2014, డిసెంబరు 11: చైనా శాంతి బహుమతి క్యూబా కమ్యూనిస్టు నాయకుడైన ఫిడేల్ కాస్ట్రోకు ప్రకటించబడింది. 
  • 2014, డిసెంబరు 14: జపాన్ పార్లమెంటు ఎన్నికలలో ప్రస్తుత ప్రధానమంత్రి షింబో అజే నేతృత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది. 
  • 2014, డిసెంబరు 14: ప్రపంచ సుందరి కిరీటం దక్షిణాఫ్రికాకు చెందిన రోలీన్ స్ట్రాస్‌కు దక్కింది. రెండోస్థానంలో ఎడినా కుల్క్‌సార్ (హంగేరి), మూడోస్థానంలో ఎలిజబెత్ సాఫ్రిత్ (అమెరికా) నిలిచారు.
  • 2014, డిసెంబరు 16: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో తాలిబన్ల నరమేధంలో 141 మంది మరణించారు.
  • 2014, డిసెంబరు 28: ఇండోనేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలి 155 మంది మరణించారు.

ఇవి కూడా చూడండి: అంతర్జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2009, 20082010, 2011, 2012, 2013, 2015,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక