2, జనవరి 2014, గురువారం

క్రీడావార్తలు 2009 (Sports News 2009)

క్రీడావార్తలు 2009 (Sports News 2009)


ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2009అంతర్జాతీయ వార్తలు-2009, ఆంధ్రప్రదేశ్ వార్తలు-2009,

  • 2009, జనవరి 16: 2008-09 రంజీట్రోఫిని ముంబాయి జట్టు చేజిక్కించుకుంది.
  • 2009, జనవరి 31: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్‌కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
  • 2009, ఫిబ్రవరి 1:ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన మహేశ్ భూపతి, సానియా మీర్జా జంట విజయం సాధించింది.
  • 2009, ఫిబ్రవరి 1:ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల టెన్నిస్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు.
  • 2009, ఫిబ్రవరి 9: దులీప్ ట్రోఫి క్రికెట్‌లో వెస్ట్ జోన్ కైవసం చేసుకుంది.
  • 2009, ఫిబ్రవరి 9: చండీగఢ్ లో జరిగిన పంజాబ్ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంటు ఫైనల్లో నెదర్లాండ్స్ భారతజట్టుపై నెగ్గి ట్రోఫీ సాధించింది.
  • 2009, మార్చి 7: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.
  • 2009, మార్చి 11: వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.
  • 2009, మార్చి 18: కటక్‌లో జరిగిన దేవధర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటులో ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు ఈస్ట్ జోన్‌పై నెగ్గి 9వ సారి ట్రోఫి చేజిక్కించుకుంది.
  • 2009, ఏప్రిల్ 13: మలేషియాలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్మమెంటులో భారత్ 3-1 స్కోరుతో మలేషియాపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.
  • 2009, మే 23: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
  • 2009, జూన్ 15: సంతోష్ ట్రోఫి ఫుట్‌బాల్‌ను గోవా చేజిక్కించుకుంది.
  • 2009, జూన్ 21: ఇండోనేషియా బ్యాడ్మింతన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది.
  • 2009, ఆగష్టు 10: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి.
  • 2009, ఆగష్టు 30: చైనీస్ గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ జోడిగా దిజు, గుత్తాజ్వాలా రికార్డు సృష్టించారు.
  • 2009, ఆగష్టు 31: నెహ్రూ కప్ ఫుట్‌బాల్‌ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో సిరియాను 6-5 గోల్స్ తేడాతో ఓడించింది.
  • 2009, సెప్టెంబర్ 8: ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన పంకజ్ అద్వానీ కైవసం చేసుకున్నాడు.
  • 2009, అక్టోబరు 3: 2016 ఒలింపిక్ క్రీడలు నిర్వహించడానికి బ్రెజిల్ పట్టణం రియో-డిజనీరో హక్కులను పొందినది.
  • 2009, నవంబరు 27: భారత క్రికెట్ జట్టు 100వ టెస్టు విజయం సాధించింది.
  • 2009, డిసెంబరు 6: టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్‌లో భారత్ తొలిసారి మొదటి ర్యాంకు సాధించింది.
  • 2009, డిసెంబరు 12: 36వ మహిళల జాతీయ ప్రిమియర్ చదరంగం టైటిల్‌ను ద్రోణవల్లి హారిక సాధించింది.
  • 2009, డిసెంబరు 13: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ను భారత ఫుట్‌బాల్ జట్టు కైవసం చేసుకుంది.
  • 2009, డిసెంబరు 15: వన్డే క్రికెట్‌లో 414/7 పరుగులు చేసి భారత క్రికెట్ జట్టు అత్యధిక పరుగుల రికార్డును అధికమించింది.
  • 2009, డిసెంబరు 15: ప్రపంచ చదరంగం చాంపియన్‌షిప్‌ను రష్యాకు చెందిన బోరిస్ గెల్పాండ్ గెలుచుకున్నాడు.


ఇవి కూడా చూడండి: జాతీయ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 20082010, 2011, 2012, 2013,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక