27, నవంబర్ 2013, బుధవారం

వాడ్యాల్ (Wadyal)

 వాడ్యాల్ గ్రామము
గ్రామమువాడ్యాల్ 
మండలముమిడ్జిల్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1461 (2001)
1518 (2011)
వాడ్యాల్ మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ విస్తీర్ణం 1074 హెక్టార్లు. గ్రామ సమీపం నుంచి దుందుభీనది ప్రవహిస్తోంది. నది ప్రక్కనే పురాతనమైన శివాలయం ఉంది. గ్రామంలో పురాతనమైన బురుజు, హనుమాన్ దేవాలయం కూడా ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1518.గ్రామ పరిధిలో 151 ఎకరాల ఆయకట్టు ఉన్న కొత్తచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1461. ఇందులో పురుషులు 739, మహిళలు 722. గృహాలసంఖ్య 286.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1518. ఇందులో పురుషులు 757, మహిళలు 761. గృహాలసంఖ్య 372. అక్షరాస్యత శాతం 57.18%. అక్షరాస్యతలో ఇది మండలంలో ప్రథమ స్థానంలో ఉంది.

రాజకీయాలు:
2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా యాచమ్మ ఎన్నికయ్యారు.

వ్యవసాయం:
గ్రామంలో పండే ముఖ్య పంటలు ప్రత్తి, మొక్కజొన్న.

గ్రామపంచాయతి:
గ్రామపాలన గ్రామపంచాయతిచే నిర్వహించబడుతుంది. సుమారు 33 సంవత్సరాల క్రితం వాడ్యాల్ గ్రామపంచాయతి ఏర్పడింది. అంతకు క్రితం ఇది వేముల పంచాయతి పరిధిలో ఉండేది. ఈ పంచాయతి తొలి సర్పంచిగా రఘుపతి రావు పనిచేశారు. ఆ తర్వాత సీతాపతి సర్పంచిగా పనిచేశారు. బి.సుధాకర్ 1991 నుంచి 2001 వరకు, ఏ.అరుణ 2001-06 కాలంలో సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు. 2006-11 కాలంలో కె.వెంకటేష్ గౌడ్ కొనసాగినారు. ఆ తర్వాత రెండేళ్ళు ప్రత్యేక అధికారి పాలనలో ఉండగా జూలై 2013న జరిగిన ఎన్నికలలో ఎం.యాదమ్మ ఎన్నికైనారు. 2013 ఎన్నికల నాటికి గ్రామపంచాయతిలో 8 వార్డులు కలవు. వీధిదీపముల నిర్వహణ, పారిశుద్ధ్యం, నీటిసరఫరా నిర్వహణ తదితర విధులు సర్పంచి నేతృత్వంలోని గ్రామ పంచాయతి ద్వారా నిర్వహించబడుతుంది.

విభాగాలు: మిడ్జిల్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక