4, సెప్టెంబర్ 2013, బుధవారం

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం (Yellareddy Assembly Constituency)

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 6 మండలాలు కలవు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ జహీరాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2009 మరియు 2010 ఉప ఎన్నికలలో తెరాసకు చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 6 మండలాలు కలవు.
  • ఎల్లారెడ్డి, 
  • నాగిరెడ్డిపేట, 
  • లింగంపేట, 
  • గాంధారి, 
  • తాడ్వాయి, 
  • సదాశివనగర్,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952



1957



1962 టి.ఎన్.సదాలక్ష్మి కాంగ్రెస్ పార్టీ

1967 జె.ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ

1972 జె.ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ

1978 తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ పార్టీ

1983



1985



1989



1994



1999



2004



2009 ఏనుగు రవీందర్ రెడ్డితెరాస జనార్థన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
2010* ఏనుగు రవీందర్ రెడ్డి తెరాస షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ
2014 ఏనుగు రవీందర్ రెడ్డి తెరాస సురేందర్‌ కాంగ్రెస్ పార్టీ
2018 జాజల సురేందర్ కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి తెరాస

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచితెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే, ఏనుగు రవీందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే జనార్థన్ గౌడ్ పై 36770 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రవీందర్ రెడ్డి రాజీనామా సమర్పించగా ఫిబరవరి 15, 2010న స్పీకర్ ఆమోదించారు.

2010 ఉప ఎన్నికలు:
2009లో ఇక్కడి నుంచి గెలుపొందిన రవీందర్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ రవీందర్ రెడ్డి తెరాస తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, షబ్బిర్ అలీపై 37 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జాజల సురేందర్ డిపాజిట్ కోల్పోయారు. ఈ ఎన్నికలలో భాజపా తెరాసకు మద్దతు ప్రకటించింది.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి సిటింగ్ ఎమ్మెల్యే, తెరాసకు చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి, తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేందర్‌పై 23483 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున ఏనుగు రవీందర్ రెడ్డి, భాజపా తరఫున బి.లక్ష్మారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన జాజల సురేందర్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జాజల సురేందర్ తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి పై 35148 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



విభాగాలు: నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి  అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక