5, సెప్టెంబర్ 2013, గురువారం

నిజామాబాదు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గం (Nizamabad Urban Assembly Constituency)

నిజామాబాదు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఇది నూతనంగా ఏర్పాటైంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నిజామాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
  • నిజామాబాదు,

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 యెండెల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ
2010* యెండెల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ
2014 గణేశ్ గుప్తా తెరాస మీర్ మజాజ్ అలీ ఎంఐఎం
2018 బీగల గణేష్ తెరాస తాహెర్ బిన్ హందాన్ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి భాజాపాకు చెందిన యెండెల లక్ష్మీనారాయణ తన సమీప ప్రత్యర్థి పిసిసి అధ్యక్షుడు అయిన ధర్మపురి శ్రీనివాస్ పై 11వేలకు పైగా ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఈ ఎన్నికలలో తెరాస భాజపాకు మద్దతు ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఫిబ్రవరి 15, 2010న యెండెల లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.

2010 ఉప ఎన్నికలు:
2009లో విజయం సాధించిన యెండెల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో భాజపాకు చెందిన యెండెల లక్ష్మీనారాయణ మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.శ్రీనివాస్ పై మరోసారి విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన గణేశ్ గుప్తా తన సమీప ప్రత్యర్థి, ఎంఐఎం కు చెందిన మీర్ మజాజ్ అలీపై 9693 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున గణేశ్ బిగాల, భాజపా తరఫున యెండెల లక్ష్మీనారాయణ, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన తాహెర్ బిన్ హందూన్ చేశారు. తెరాసకు చెందిన బీగల గణేష్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన తాహెర్ బిన్ హందాన్ పై 25841 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

విభాగాలు: నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, నిజామాబాదు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక