20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao)

అక్కినేని నాగేశ్వర రావు
(1923-2014)
జననంసెప్టెంబర్ 20, 1924
స్వస్థలంరామాపురం (కృష్ణా జిల్లా)
రంగంసినీ నటుడు,
అవార్డులుపద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే
మరణంజనవరి 22, 2014
ప్రముఖ తెలుగు సినీనటుడైన అక్కినేని నాగేశ్వర రావు సెప్టెంబర్ 20, 1923న కృష్ణా జిల్లా నందివాడ మండలం రామాపురం లో జన్మించారు. చిన్నవయస్సులోనే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో నాయిక పాత్రలను ధరించారు. 1940 లో విడుదలైన "ధర్మపత్ని" ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కధా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "శ్రీ సీతారామ జననం" (1944). దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్‌లతో సహా పలు అవార్డు పొందారు. 2014, జనవరి 22న మరణించారు.

సినీప్రస్థానం:
1940లో తొలిసారిగా ధర్మపత్ని సినిమాలో నటించారు. 1944లో విడుదలైన శ్రీరామజననంలో తొలిసారిగా కథానయకుడిగా నటించారు. ఆ తర్వాత బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, తోడికోడళ్ళు, బాటసారి, అనార్కలి, మూగమనసులు, మంచిమనసులు, ఆత్మబలం, అంతస్తులు, ఇద్దరు మిత్రులు, అమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం, సెక్రెటరీ, మహకవి క్షేత్రయ్య, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, కాలేజీ బుల్లోడు, శ్రీ రామదాసు మొదలైన చిత్రాల్లోని పాత్రలతో అప్రతిహతంగా కొనసాగింది. మట్టి మనుషులు, ఒకే ఒక్కడు టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటించారు.

గుడివాడలోని కళాశాలకు భూరి విరాళమిచ్చినందుకు ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ANR కళాశాల అని నామకరణం చేశారు. సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి "సుడిగుండాలు", "మరో ప్రపంచం" వంటి సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావుతో "చక్రవర్తి చిత్ర" పతాకంపై నిర్మించారు.
అక్కినేని నాగేశ్వర రావు
జనరల్ నాలెడ్జి

గుర్తింపులు:
ఉత్తమనటుడిగా 5 సార్లు బంగారునంది అవార్డు, 3 సార్లు ఫిలింఫేర్ అవార్డులు పొందినారు. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 1989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1995లో ఎన్టీయార్ అవార్డు, 2011లో పద్మవిభూషణ్ స్వీకరించారు.

ఇవి కూడా చూడండి:


విభాగాలు: తెలుగు సినిమా నటులు,  కృష్ణా జిల్లా ప్రముఖులు, నందివాడ మండలం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు, పద్మవిభూషణ్ గ్రహీతలు, 1923లో జన్మించినవారు,2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక