28, ఏప్రిల్ 2020, మంగళవారం

మంథని మండలం (Manthani Mandal)

మంథని మండలం
జిల్లా పెద్దపల్లి జిల్లా
రెవెన్యూ డివిజన్ పెద్దపల్లి
అసెంబ్లీ నియోజకవర్గంమంథని
లోకసభ నియోజకవర్గంపెద్దపల్లి
మంథని పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 34 గ్రామపంచాయతీలు, 35 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలపు ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది, తూర్పు మరియు ఆగ్నేయ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తున్నాయి. ఇది మంథని రెవెన్యూ డివిజన్, మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మంథెన రామాయణ కర్త మంథనిలో జన్మించాడు. రచయిత అల్లం రాజయ్య, రామగుండం ఎమ్మెల్యె సోమారపు సత్యనారాయణ ఈ మండలానికి చెందినవారు. సిరిపురం వద్ద సుందిళ్ళ బ్యారేజీ నిర్మిస్తున్నారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో తూర్పున జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన ముత్తారం మండలం, పశ్చిమాన రామగిరి మండలం, ఉత్తరాన మంచిర్యాల జిల్లా, తూర్పున మరియు ఆగ్నేయాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలపు ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది, తూర్పు మరియు ఆగ్నేయ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తున్నాయి.

రాజకీయాలు:
ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కొండా శంకర్, జడ్పీటీసిగా తెరాసకు చెందిన తగరం సుమలత ఎన్నికయ్యారు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54695. ఇందులో పురుషులు 27103, మహిళలు 27592.




మంథని మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Adavisomanpalli, Adrial, Akkepalli, Ammagaripalli, Angulur(D), Arenda, Bhatpalli, Bitpalli(K), Chinnaodela, Eklaspur, Gaddalapalli, Gopalpur, Gumnoor, Gunjapadugu, Kannala, Kasipeta, Khanapur, Khansaipeta, Kuchirajpalli, Lakkapur, Maidipalli, Mallaram, Mallepalli, Manthani, Nagaram, Nagepalli, Pandulapalli, Peddaodela, Puttapaka, Rachepalli, Sarnepalli, Siripuram, Uppatla, Venkatapur, Vilochavaram

ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

గాజులపల్లి (Gajulapally):
గాజులపల్లి పెద్దపల్లి జిల్లా మంథని మండలమునకు చెందిన గ్రామము. రచయిత, పత్రికా సంపాదకుడు అల్లంరాజయ్య స్వగ్రామం.
మంథని (Manthani):
మంథని పెద్దపల్లి జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము, రెవెన్యూ డివిజన్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రస్థానము. హైదరాబాదు నుంచి 225 కిమీ దూరంలో ఉన్నది. మంథనికి ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన బొక్కలవాగు ప్రవహిస్తున్నాయి. తూర్పున సురక్షిత అడవి, పడమరన రాయల చెరువు ఉన్నాయి. మంథని పూర్వనామం మంత్రపురం. గ్రామానికి 3 కిమీ దూరంలో గోదావరి నది ఉంది. నదీతీరాన గౌతమేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించబడింది.


ఇవి కూడా చూడండి:
  • పెద్దపల్లి జిల్లా,
  • గౌతమేశ్వరాలయం,
  • అల్లం రాజయ్య, 
  • సోమారపు సత్యనారాయణ,
  • గోదావరి నది,
  • మానేరు నది, 
  • సుందిళ్ళ బ్యారేజీ,


ఫోటో గ్యాలరీ
అక్టోబరు 11, 2016కు ముందు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
మంథని మండల స్థానం

c
c c


హోం
విభాగాలు: పెద్దపల్లి జిల్లా మండలాలు,  మంథని మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Karimnagar Dist, 2014,
  • Handbook of Census Statistics, Karimnagar District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 227 తేది: 11-10-2016 
  • కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • http://peddapalle.telangana.gov.in/ (Official Website of Peddapalli Dist),


Manthani Mandal in Telugu, Peddapalli Dist (district) Mandals in telugu, Peddapalle Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక