6, జులై 2013, శనివారం

బషీరాబాదు మండలము (Basheerabad Mandal)

జిల్లా వికారాబాదు జిల్లా
రెవెన్యూ డివిజన్తాండూరు
అసెంబ్లీ నియోజకవర్గంతాండూరు
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
జనాభా 40711 (2001), 43687 (2011)
మండల ప్రముఖులుఎం.మాణిక్ రావు, ఎం.చంద్రశేఖర్
బషీరాబాదు మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఇది వికారాబాదులో పశ్చిమాన కర్ణాటక సరిహద్దులో ఉన్నది. ఈ మండలము తాండూరు రెవెన్యూ డివిజన్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఈ మండలము గుండా హైదరాబాదు- వాడి సెక్షన్ రైలుమార్గము వెళ్ళుచున్నది. నవాంద్గీ పేరుతో మండల కేంద్రంలో మరియు మంతట్టిలలో రైల్వే స్టేషన్లు కలవు. మంత్రులుగా పనిచేసిన ఎం.మాణిక్ రావు, ఎం.చంద్రశేఖర్, ఎమ్మెల్యే ఎం.నారాయణరావులు ఈ గ్రామానికి చెందినవారు. మండలంలో నాపరాతి గనులు మరియి పాలిషింగ్ పరిశ్రమలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43687. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉండేది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలము వికారాబాదు జిల్లాలో పశ్చిమాన ఉన్నది. ఈ మండలమునకు తూర్పున తాండూరు, యాలాల మండలాలు, పశ్చిమాన మరియు వాయువ్యాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నవి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43687. ఇందులో పురుషులు 21587, మహిళలు 22100. అక్షరాస్యుల సంఖ్య 21672. పట్టణ జనాభా 6743, గ్రామీణ జనాభా 36944. స్త్రీపురుష నిష్పత్తిలో (1024/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో రెండవ స్థానంలో ఉంది.

చరిత్ర:
1948 సెప్టెంబరు 17 వరకు ఈ మండల ప్రాంతం నిజాం పాలనలో హైదరాబాదు సంస్థానంలో భాగంగా గుల్బర్గా జిల్లాలో ఉండేది. నిజాం పాలన అంతం కావడంతో హైదరాబాదు రాష్ట్రంలో చేరింది. 1953 అక్టోబరులో భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణ సందర్భంగా కర్ణాటక (అప్పటి మైసూరు రాష్ట్రం) వేరుకాగా ఈ ప్రాంతం హైదరాబాదు జిల్లాలో భాగమైంది. 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండింది. 1978లో హైదరాబాదు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలను వేరుచేసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడంతో ఇది ఈ జిల్లాలో భాగమైంది. 1986 వరకు తాండూరు తాలుకాలో భాగంగా ఉండేది. మండల వ్యవస్థ అనంతరం ప్రత్యేకంగా మండలం ఏర్పడింది. 2009-14 కాలంలో తెలంగాణ ఉద్యమం నడిచింది. 42 రోజులపాటు సకల జనుల సమ్మె జయప్రదమైంది. జూన్ 2, 2014లో తెలంగాణలో భాగమైన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన వికారాబాదు జిల్లాలో భాగంగా మారింది.

రవాణా సౌకర్యాలు:
దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా హైదరాబాదు - వాడి సెక్షన్ మండలం గుండా వెళ్ళుచున్నది. నవాంద్గీ పేరుతో మండల కేంద్రంలో మరియు మంతట్టిలో రైల్వేస్టేషన్లు కలవు. తాండూరు నుంచి బషీరాబాదు, మైల్వార్‌లకు బస్సు సౌకర్యం ఉంది.

రాజకీయాలు:
ఈ మండలము తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009కు ముందు హైదరాబాదు లోకసభ నియోజకవర్గంలో ఉండేది. మంత్రులుగా పనిచేసిన ఎం.మాణిక్ రావు, ఎం.చంద్రశేఖర్, ఎమ్మెల్యే ఎం.నారాయణరావు ఈ మండలమునకు చెందినవారు. మండల కేంద్రానికి చెందిన వీరు ముగ్గురూ సొదరులే. 1972 నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వీరి కుటుంబమే పోటీ చేస్తోంది. మాణిక్ రావు 4 సార్లు పోటీచేసి 3 సార్లు విజయం సాధించగా, చంద్రశేఖర్ 2 సార్లు గెలుపొందారు. నారాయణరావు 2 సార్లు పోటీచేఇ ఒక సారి ఎమెల్యే అయ్యారు. మాణిక్ రావు కుమారుడు రమేష్ 2009లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా తెరాసకు చెందిన కరుణ ఎన్నికయ్యారు.
అక్టోబరు 11, 2016కు ముందు రంగారెడ్డి జిల్లాలో
బషీరాబాదు మండల స్థానం

విభాగాలు: వికారాబాదు జిల్లా మండలాలు, తాండూరు రెవెన్యూ డివిజన్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, బషీరాబాదు మండలము, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక