1, జూన్ 2013, శనివారం

ఎలిగండ్ల (Yeligandla)

 ఎలిగండ్ల గ్రామము
గ్రామముఎలిగండ్ల
మండలముధన్వాడ
జిల్లానారాయణపేట
జనాభా1554 (2001),
1796 (2011),
ఎలిగండ్ల నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. రెవెన్యూ గ్రామ విస్తీర్ణం 817 హెక్టార్లు. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1796. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో దక్షిణాన నారాయణపేట, మక్తల్ మండలాల సరిహద్దులో ఉన్నది. గ్రామానికి ఉత్తరాన పస్పుల, తూర్పున మరికల్, పశ్చిమాన మందిపల్లి శివారు గ్రామాలుండగా దక్షిణాన మక్తల్ మరియు నారాయణపేట మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1554. ఇందులో పురుషులు 744, మహిళలు 810. గృహాల సంఖ్య 304.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1796. ఇందులో పురుషులు 890, మహిళలు 906. గృహాల సంఖ్య 388. అక్షరాస్యత శాతం 47.16%. గ్రామకోడ్ సంఖ్య 575504.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మహబూబ్‌నగర్-రాయచూర్ ప్రధాన రహదారిపై ఉంది. ప్రధాన కూడలి అయిన మరికల్ ఈ గ్రామానికి తూర్పున కొద్దిదూరంలో ఉంది.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా పద్మమ్మ ఎన్నికైనారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. సరిహద్దు గ్రామమైన మరికల్‌లో రెండు జడ్పీ ఉన్నత పాఠశాలలు, రెండు ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు కలవు.

విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక