4, జూన్ 2013, మంగళవారం

సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)

 సబితా ఇంద్రారెడ్డి
జననంమే 5, 1963
కోటబాస్పల్లి
జిల్లా రంగారెడ్డి
పదవులురాష్ట్ర మంత్రి (2004-13)
నియోజకవర్గంచేవెళ్ళ (2000-09), మహేశ్వరం (2009 నుంచి)
సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాకు రాజకీయ నాయకురాలు. రంగారెడ్డి జిల్లా తాండూరు మండలము కోటబాస్పల్లి గ్రామంలో 1963, మే 5న సబిత జన్మించారు. భర్త, మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి మరణంలో జరిగిన ఉపఎన్నికలలో 2000లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి శాసనసభలో ప్రవేశించి, ఆ అనంతరం 2004లో కూడా చేవెళ్ళ నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ళ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009 శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. 2004-09 కాలంలో వైఎస్సార్ మంత్రివర్గంలో గనుల శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల అనంతరం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది హోంశాఖా మంత్రిపదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. వైఎస్సార్ మరణానంతరం రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలో కూడా హోంశాఖ లభించింది. దాల్మియా సిమెంటు కేసులో సబిత పేరును సీబీఐ చార్జిషీటులో ఏ4గా పేర్కొనడంతో రాజీనామా చేయగా మే 25, 2013న గవర్నర్ రాజీనామా ఆమోదించారు.

కుటుంబం:
సబిత భర్త ఇంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా, ఎన్టీరామారావు హయంలో మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభసమయంలో ఎన్టీయార్ వైపు ఉండి తర్వాత ఎన్టీయార్ తెలుగుదేశంలో కొన్నాళ్ళు ఉండి, తుదకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శాసనసభ్యుడిగా ఉంటూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సబిత తండ్రి తాండూరు మండల అధ్యక్షులుగా పనిచేశారు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు,  తాండూరు మండలము,  చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం,  ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ మంత్రులు

 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక