30, జూన్ 2013, ఆదివారం

రాయప్రోలు సుబ్బారావు (Rayaprolu Subbarao)

రాయప్రోలు సుబ్బారావు
(1892-1984)
జననంమార్చి 17, 1892
స్వస్థలంగార్లపాడు (గుంటూరు జిల్లా)
రంగంసాహితీవేత్త
రచనలుతృణకంకణము,
మరణంజూన్ 30, 1984
భావ కవితా పితామహుడిగానూ, నవ్య కవితా పితామహుడిగానూ పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు మార్చి 17, 1892న గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశలోనే కవితలు, పద్యాలు వ్రాయడం ప్రారంభించి, తృణకంకణం లాంటి ప్రముఖ కవితా గ్రంథాలను తెలుగువారికి అందించిన రాయప్రోలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా, రీడర్‌గా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు. సహాయ సంపాదకుడిగా ఆంధ్రవిజ్ఞానసర్వస్వము రూపకల్పనలో తనవంతు పాత్ర పోష్ంచారు. మూడేళ్ళపాటు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన శాంతినికేతన్‌లో ఉండి సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. సికింద్రాబాదులో స్థిరపడి నవ్యసాహిత్య పరిషత్ అధ్యక్షునిగా, ఆంధ్రపండిత పరిషత్ అధ్యక్షునిగానూ బాధ్యతలు నిర్వహించారు. "ఏ దేశమేగినా ఎందుకాలిడిగా..." లాంటి జనాదరణ పొందిన కవితలు రచించిన రాయప్రోలు జూన్ 30, 1984న మరణించారు.

రచనలు:
తృణకంకణము, ఆంధ్రావళి, కష్టకమల, రమ్యలోకము, వనమాల, మిశ్రమంజరి, స్నేహలతా దేవి, స్వప్నకుమారము, తెలుగు తోట, మాధురీ దర్శనం.


విభాగాలు: గుంటూరు జిల్లా రచయితలు, 1892, 1984,


 = = = = =

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక