15, జూన్ 2013, శనివారం

పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం (Peddapalli Loksabha Constituency)

పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం
జిల్లాఆదిలాబాదు, కరీంనగర్
ప్రస్తుత ఎంపిబొర్లకుంట వెంకటేశ్ నేత
పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బొర్లకుంట వెంకటేశ్ నేత ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
3వ 1962-67 ఎం.ఆర్.కృష్ణ కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 ఎం.ఆర్.కృష్ణ కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 వి.తులసీరాం తెలంగాణ ప్రజాసమితి
6వ 1977-80 వి.తులసీరాం కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 జి.భూపతి తెలుగుదేశం పార్టీ
8వ 1984-89 జి.భూపతి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 జి.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 జి.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 జి.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 చెల్లమెల్ల సుగుణ కుమారి తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 చెల్లమెల్ల సుగుణ కుమారి తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 జి.వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 జి.వివేకానంద్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితి
17వ 2019- బొర్లకుంట వెంకటేశ్ నేత తెలంగాణ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వివేకానంద్ తన సమీపప్రత్యర్థి తెరాసకు చెందిన జి.శ్రీనివాస్‌పై 49,017 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వివేకానందకు 313748 ఓట్లు రాగా, శ్రీనివాస్‌కు 264731 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టి అభ్యర్థి ఎ.డేవిడ్ రాజు 3వ స్థానంలో, భాజపా అభ్యర్థి మాతంగి నర్సయ్య 4వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 21 అభ్యర్థులు నామినేషన్ వేయగా 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఇద్దరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 17 అభ్యర్థులు మిగిలారు. తెరాస అభ్యర్థి బాల్క సుమన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన జి.వివేకానందపై 289773 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెరాసకు చెందిన బొర్లకుంట వెంకటేశ్ నేత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ.చంద్రశేఖర్‌పై 95180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెరాస అభ్యర్థికి 4,41,321 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3,46,141  ఓట్లు లభించాయి. భాజపాకు చెందిన సోగల కుమార్ 92,606 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక