13, జూన్ 2013, గురువారం

ఒంగోలు లోకసభ నియోజకవర్గం (Ongole Loksabha Constituency)

ఒంగోలు లోకసభ నియోజకవర్గం
జిల్లాప్రకాశం జిల్లా
ప్రస్తుత ఎంపిమాగుంట శ్రీనివాసులురెడ్డి
పార్టీవైకాపా


ఒంగోలు లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  2. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం,
  3. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం,
  4. కొండపి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  5. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం,
  6. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం,
  7. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం,
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 పీసపాటి వెంకట రాఘవయ్య
ఎమ్.నానాదాస్
ఇండిపెండెంట్
ఇండిపెండెంట్
2వ 1957-62 రొండ నారపరెడ్డి కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 మాదాల నారాయణస్వామి భారత కమ్యూనిష్టు పార్టీ
4వ 1967-71 కొంగర జగ్గయ్య కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 పి.అంకినీడు ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 పులి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 పులి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 బెజవాడ పాపిరెడ్డి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 మేకపాటి రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 మాగుంట సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 మాగుంట పార్వతమ్మ కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 కరణం బలరామకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 వై.వి.సుబ్బారెడ్డి వైకాపా
17వ 2019- మాగుంట శ్రీనివాసులురెడ్డి వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.మాలకొండయ్య యాదవ్‌పై 78,523 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. శ్రీనివాసులు రెడ్డికి 450442 ఓట్లు రాగా, మాలకొండయ్యకు 371919 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి 3వ స్థానంలో, భాజపా అభ్యర్థి ఎం.వాసుదేవ 4వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన సిద్ధా రాఘవరావుపై 2,14,851 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 7,39,202 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 5,24,351 ఓట్లు లభించాయి. జనసేన పార్టీకి చెందిన బెల్లంకొండ సాయిబాబు 29,379 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: ప్రకాశం జిల్లా నియోజకవర్గాలు, ఒంగోలు లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక