1, జూన్ 2013, శనివారం

మరికల్ (Marikal)

మరికల్ గ్రామము
గ్రామముమరికల్
మండలముమరికల్
జిల్లానారాయణపేట
జనాభా9508 (2001)
మరికల్ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది మండలంలో జనాభాలో పెద్ద గ్రామమే కాకుండా ప్రముఖ కూడలి. ఈ గ్రామం మహబూబ్‌నగర్ - రాయచూరు ప్రధాన రహదారి పై ఉంది. నారాయణపేట మరియు ఆత్మకూరు రహదారులు ఇక్కడే కలుస్తాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున నర్వ మండలం సరిహద్దులో ఉన్నది. గ్రామానికి ఉత్తరాన మాధ్వార్, తూర్పున తీలేర్, పశ్చిమాన పస్పుల, ఎలిగండ్ల గ్రామాలు సరిహద్దులో ఉండగా దక్షిణాన నర్వ మండలం సరిహద్దుగా ఉన్నది. రెవెన్యూ గ్రామ విస్తీర్ణం 2717 హెక్టార్లు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9508. ఇందులో పురుషులు 4700, మహిళలు 4808. గృహాల సంఖ్య 1738. మండలంలోనే ఇది అత్యధిక జనాభా కల గ్రామము.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 12010. ఇందులో పురుషులు 5556, మహిళలు 6454. గృహాల సంఖ్య 2269. అక్షరాస్యతశాతం 52.62%. గ్రామ కోడ్ సంఖ్య 575506.

రాజకీయాలు:
  • 2006లో మరికల్ సర్పంచిగా రాములు ఎన్నికైనారు. ఆయన హత్యతో ఉప ఎన్నిక నిర్వహించగా రాములు భార్య సరళ విజయం సాధించారు. 
  • 2013, జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా లక్ష్మి ఎన్నికయ్యారు.
  • 2014 ఎంపీటీసి ఎన్నికలలో మరికల్-1 స్థానం నుంచి వీరన్న (తెరాస), మరికల్-2 స్థానం నుంచి శశికళ (తెరాస), మరికల్-3 స్థానం నుంచి సౌభాగ్యలక్ష్మి (కాంగ్రెస్ పార్టీ) ఎన్నికయ్యారు.
విద్యాసంస్థలు:
గ్రామంలో రెండు జడ్పీ ఉన్నత పాఠశాలలు (అందులోఒకటి బాలికల), రెండు ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు (రవితేజ మరియు వెంకటసాయి), రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, ఒక ఉర్దూ మీడియం మం.ప.ప్రాథమికోన్నత పాఠశాల, రెండు ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలు (దయానంద్ విద్యామందిర్ మరియు శ్రీవాణి విద్యామందిర్) కలవు. శివారు గ్రామమైన పల్లగడ్డలో మం.ప.ప్రాథమిక పాఠశాల ఉంది.

కాలరేఖ:
  • 2013, నవంబరు 2: ద్విచక్ర వాహనం లారీ కిందపడి ముగ్గురు మరణించారు.
విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక