16, జూన్ 2013, ఆదివారం

మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం (Mahabubabad Loksabha Constituency)

మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం
జిల్లావరంగల్, ఖమ్మం
ప్రస్తుత ఎంపిమాలోత్ కవిత
పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2008 నాటి నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. దీన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారు.  2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాలోత్ కవిత  ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
15వ 2009-14 పి.బలరాం నాయక్   కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 సీతారాం నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి
17వ 2019- మాలోత్ కవిత తెలంగాణ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.బలరాం తన సమీప ప్రత్యర్థి మహాకూటమి తరఫున పోటీచేసిన సీపీఐ అభ్యర్థి కె.శ్రీనివాసరావుపై 68,957 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బలరాంకు 394447 ఓట్లు రాగా, శ్రీనివాసరావుకు 325490 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి డిటి నాయక్ 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 23 అభ్యర్థులు నామినేషన్లు వేయగా 3 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ముగ్గురు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 17 అభ్యర్థులు మిగిలారు.తెరాస తరఫున పోటీచేసిన సీతారాం నాయక్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన బలరాం నాయక్ పై 35653 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస అభ్యర్థి మాలోత్ కవిత తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బలరాం నాయక్‌పై 146663 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తెరాస అభ్యర్థికి 462109 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 315446 ఓట్లు లభించాయి. సీపీఐ తరఫున కల్లూరి వెంకటేశ్వరరావు, జనసేన తరఫున భుక్యా భాస్కర్ నాయక్ పోటీచేశారు.



విభాగాలు: వరంగల్ జిల్లా నియోజకవర్గాలు, ఖమ్మం జిల్లా నియోజకవర్గాలు, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక