14, జూన్ 2013, శుక్రవారం

కర్నూలు లోకసభ నియోజకవర్గం (Kurnool Loksabha Constituency)

కర్నూలు లోకసభ నియోజకవర్గం
జిల్లాకర్నూలు
ప్రస్తుత ఎంపిడాక్టర్ సంజీవకుమార్
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో కర్నూలు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గసెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకి చెందిన డాక్టర్ సంజీవకుమార్ ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

  1. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం,
  2. పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం,
  3. కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం, (ఎస్సీ)
  4. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం,
  5. మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం,
  6. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం,
నియోజకవర్గ చరిత్ర:
ఈ నియోజకవర్గం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు ఎన్నికయ్యారు. ముగ్గురు ప్రధానుల హయంలో ఈయన మంత్రివర్గంలో చోటు సంపాదించారు.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 గడిలింగన్న గౌడ్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
2వ 1957-62 ఉస్మాన్ ఆలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 యశోధారెడ్డి కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 గడిలింగన్న గౌడ్ స్వతంత్ర పార్టీ
5వ 1971-77 కోదండ రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 కోట్ల విజయభాస్కరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 కోట్ల విజయభాస్కరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 ఇ.అయ్యపురెడ్డి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 కోట్ల విజయభాస్కరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 కోట్ల విజయభాస్కరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 కోట్ల విజయభాస్కరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 కోట్ల విజయభాస్కరరెడ్డి కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 కంబలపాడు కృష్ణముర్తి తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 బుట్టా రేణుక వైకాపా
17వ 2019- డాక్టర్ సంజీవకుమార్ వైకాపా

2009 ఎన్నికలు
2009లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన బి.టి.నాయుడుపై 73,773 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సూర్యప్రకాష్ రెడ్డికి 382668 ఓట్లు రాగా, నాయుడుకు 308895 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి డి.ఖాజాపీర్ 3వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన డాక్టర్ సంజీవకుమార్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డీపై 1,48,889 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 6,02,554 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 4,53,665 ఓట్లు లభించాయి. కాళ్గ్రెస్ పార్టీకి చెందిన అలీ అహ్మద్ ఖాన్ 36,258 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: కర్నూలు జిల్లా నియోజకవర్గాలు, కర్నూలు లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక