8, జూన్ 2013, శనివారం

జె.వి.రాఘవులు (J.V.Raghavulu)

జె.వి.రాఘవులు
(1931-2013)
జననం1931 (రామచంద్రాపురం)
జిల్లాతూర్పు గోదావరి
రంగంసంగీత దర్శకుడు
మరణంజూన్ 7, 2013
సంగీత స్వరకర్తగా, సంగీత దర్శకుడిగా ప్రసిద్ధి చెందిన జెట్టి వీర రాఘవులు 1931లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రాజమండ్రికి వచ్చి స్థిరపడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పి.యు.సి.ని మధ్యలోనే ఆపివేయవలసి వచ్చింది.

రాఘవులు చిన్నవయస్సు నుంచే పద్యాలు చదవడంలో ఆసక్తి కనబర్చినారు. ఘంటశాల పాల్గొన్న ఒక సంగీత కార్యక్రమంలో పద్యాలు చదివి ఘంటశాల దృష్టిని ఆకర్షించడం, ఘంటశాల ఆహ్వానంపై 1958లో మద్రాసు (చెన్నై) నగరానికి వెళ్ళడం జరిగింది. ఘంటశాల జీవించి ఉన్నంత కాలం ఆయన వెన్నంటియున్నారు. మొదట్లో ఘంటశాల వద్ద సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసిన రాఘవులు, లవకుశ సినిమా ఘనవిజయం అనంతరం సంగీత దర్శకుడిగా మారిన పిదప ఈయన సంగీత దర్శకత్వంలో ఘంటశాల పాడిన పాటలు ఆల్‌టైం హిట్స్‌గా పేరుపొందాయి. రాఘవులు అక్క కూతురు రమణమ్మను వివాహం చేసుకున్నారు.

1970లో డి.రామానాయుడు తీసిన "ద్రోహి" చిత్రానికి రాఘవులు తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. 1972లో "జీవన తరంగాలు" చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1974లో ఘంటశాల మరణించాక మద్రాసు ఉండలేక 1995లో రాజమండ్రి తిరిగివచ్చారు. రాఘవులు గాయకుడిగా 100 సినిమాలకు, సంగీత దర్శకుడిగా 172 సినిమాలకు పనిచేశారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. నటులు, నిర్మాతాల నుంచి ఆర్థిక సహాయంకై అర్థించారు. గోదావరి ముద్దుబిడ్డగా పేరుపొందిన రాఘవులు జూన్ 7, 2013న మరణించారు.



విభాగాలు: సంగీత దర్శకులు,  తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు,  రామచంద్రాపురం మండలం, 1931లో జన్మించినవారు,  2013లో మరణించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక