3, జూన్ 2013, సోమవారం

ఘట్టమనేని కృష్ణ (Ghattamaneni Krishna)

  సూపర్ స్టార్ కృష్ణ
జననం1942, మే 31
స్వగ్రామంబుర్రిపాలెం (గుంటూరు జిల్లా)
గుర్తింపులుపద్మ భూషణ్
సూపర్ స్టార్ కృష్ణగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లా తెనాలి మండలములోని బుర్రిపాలెం గ్రామములో జన్మించి బి.యస్.సి. వరకు అభ్యసించి, 1962లో సినీరంగంలో ప్రవేశించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఐదు దశాబ్దాలపాటు తెలుగు సినిమారంగంలో దాదాపు 350 చిత్రాలలో నటించారు. 2008 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందారు. 2009లో భారతదేశం ప్రభుత్వంచే పద్మ భూషణ్ అవార్డు స్వీకరించారు. రాజకీయ రంగ ప్రవేశం కూడ చేసి, 1989 లో 9వ లోక్‌సభ కు ఏలూరు నియోజకవర్గం నుండి కాంగ్రెసు  పార్టీ అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. 2012లో నటనకు మరియు రాజకీయాలకు విరమణ ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు రాజకీయ నాయకుడైన గల్లా జయదేవ్ ఈయన అల్లుడు (కూతురు పద్మావతి భార్య).

సినీ ప్రస్థానం:
తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్‌గా పేరుపొందిన కృష్ణ "పదండి ముందుకు", "కులగోత్రాలు", "పరువు ప్రతిష్ట" వంటి చిత్రాలలో చిన్న పాత్రలతో సినీ ప్రస్థానం ప్రారంభించారు. 1970లో కృష్ణ "పద్మాలయా పిక్చర్స్' పతాకంపై చిత్ర నిర్మాణం ప్రారంభించారు. 1976 లో తన సొంత బ్యానర్ లో నిర్మించిన పాడి పంటలు బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది. 1993 లో పచ్చని సంసారం ఊహించని సూపర్ విజయం సాధించింది. కృష్ణ దర్శకత్వంలో తెలుగులో తొలి 70 ఎం.ఎ.ఎం. చిత్రం "సింహాసనం".

రాజకీయాలు:
1989లో కృష్ణ ఏలూరు లోకసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు.

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు: తెలుగు సినిమా నటులు,  తెనాలి మండలము, గుంటూరు జిల్లా ప్రముఖులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక