13, జూన్ 2013, గురువారం

అరకు లోకసభ నియోజకవర్గం (Araku Loksabha Constituency)

 అరకు లోకసభ నియోజకవర్గం
జిల్లావిశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి
ప్రస్తుత ఎంపిగొద్దేటి మాధవి
పార్టీవైకాపా
ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోకసభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకి చెందిన గొద్దేటి మాధవి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  1. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ)
  2. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ)
  3. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  4. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం
  5. అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ)
  6. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ)
  7. చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ)
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
15వ 2009-2014 వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 కొత్తపల్లి గీత వైకాపా
17వ 2019- గొద్దేటి మాధవి వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి యం.బ్బూరావుపై 1,92,444 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి యు.వి.కృష్ణంరాజు 3వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన గొద్దేటి మాధవి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన కిశోర్ చంద్రదేవ్‌పై 2,24,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 5,62,190 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 3,38,101 ఓత్లు లభించాయి. జనసేనకు చెందిన గంగులయ్య వంపులు 42,794 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


హోం,
విభాగాలు: విశాఖపట్నం జిల్లా నియోజకవర్గాలు, విజయనగరం జిల్లా నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గాలు, తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గాలు, అరకు లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక