4, మే 2013, శనివారం

పోతులమడుగు (Potulamadugu)

 పోతులమడుగు
గ్రామముపోతులమడుగు
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2686 (2011)
2423 (2001)
పోతులమడుగు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామములో గొర్రెల మార్కెట్ ఉంది. 2010 నవంబరు 14న అప్పటి పశుసంవర్థక శాఖ మంత్రి పార్థసారథి గొర్రెల మార్కెట్‌ను ప్రారంభించారు. పోతులమడుగు గ్రామంలో మండలంలోనే పెద్దదైన మొగుళ్ళచెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2686.

భౌగోళికం, సరిహద్దులు:
పోతులమడుగు గ్రామం మండలంలో భౌగోళికంగా మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున గోప్లాపూర్ ఖుర్ద్, దక్షిణాన రావిలపల్లి, కప్పెట, పశ్చిమాన హస్నాబాద్, ఉతరాన అమిస్తాపూర్ గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి. 

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2423. ఇందులో పురుషులు 1223, మహిళలు 1200. గృహాల సంఖ్య 476.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2686. ఇందులో పురుషులు 1350, మహిళలు 1336. గృహాల సంఖ్య 593. అక్షరాస్యత శాతం 45.90%. గ్రామ కోడ్ సంఖ్య 575549.

రవాణా సౌకర్యాలు:
గ్రామం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. అన్నాసాగర్, భూత్పూర్ మధ్యలో ఈ గ్రామం కలదు. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 16 కిమీ దూరంలో ఉన్నది.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో ఎం.సత్యనారాయణ (తెలుగుదేశం పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా హరియానాయక్ ముదావత్ ఎన్నికయ్యారు.

చరిత్ర:
గ్రామానికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. శాతవాహనుల, బాదామి చాళుక్యుల, గోనవంశీయుల పాలనలో గ్రామం భాగంగా ఉండేది. గ్రామంలో 13వ శతాబ్దికి చెందిన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది.

విద్యాసంస్థలు
గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల కలవు.అనుబంధ గ్రామైన గోపన్నపల్లిలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.

అధ్యాత్మికం:
పురాతనమైన వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, పోషమ్మ, కోటమైసమ్మ ఆలయాలు ఉన్నాయి.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు,  44వ నెంబరుజాతీయ రహదారిపై ఉన్న గ్రామాలు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

>

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక