10, మే 2013, శుక్రవారం

పెద్దాపురం రంగారావు (Peddapuram Rangarao)

పాలమూరు జిల్లా రచయిలలో పేరుపొందిన మొల్గర రంగారావు ఉప్పునూతల మండలం పెద్దాపురం గ్రామానికి చెందినవారు. అసలు ఇంటిపేరు మొల్గర అయిననూ స్వగ్రామం పెద్దాపురంతోనే ప్రసిద్ధి చెందిన రంగారావు ఆగస్టు 30, 1915న జన్మించారు. జిల్లాలో ప్రముఖ విద్యావేత్తగా, కవిగా పేరుపొందారు, స్థానిక విద్యాభ్యాసం తెల్కపల్లి, నాగర్‌కర్నూల్‌లలో కొనసాగించి, ఉన్నత విద్యా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేశారు. ప్రారంభంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఉద్యోగం చేస్తూ అక్కడి అధికారుల నిరంకుశధోరణి నచ్చక రాజీనామా చేసి రెవెన్యూ శాఖలో ప్రవేశించారు. 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు భార్య మరణించడంతో (అప్పుడు ఆమెకు 23 సం.లు) క్రుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది స్వగ్రామం పెద్దాపురం సమీపంలో పర్ణశాల ఏర్పాటుచేసుకొని అధ్యాత్మిక జీవితం ప్రారంభించారు. ఆ సమయంలోఅనేక తార్కిక, అధ్యాత్మిక గ్రంథాలను పఠించారు. మరికొంత కాలానికి ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేపట్టి విద్యాశాఖాధికారి హోదాకూడా పొందారు. ఆ సమయంలో ఈయన మంచిపేరు సంపాదించారు. జిల్లాలో ప్రముఖ విద్యావేత్తగా కీర్తి పొందారు. 1973లో ఉద్యోగవిరమణ చేశారు. అనేక సామాజిక కార్యక్రమాలలోపాల్గొనడమే కాకుండా అనేక రచనలు చేసి కవిగానూ పేరుపొందారు. శ్రీరాజరాజేశ్వర శతకము, నృసింహశతకము, ఉమామహేశ్వర శతకము వంటి అనేక రచనలు చేశారు. మామిళ్ళపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 1992 నుంచి మరణించే వరకు అధ్యక్షులుగా వ్యవహరించారు. అక్టోబరు 24, 1993న రంగారావు మరణించారు.


విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు,  ఉప్పునూతల మండలము, 1915లో జన్మించినవారు, 1993లో మరణించినవారు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక