22, మే 2013, బుధవారం

కొత్త రామచంద్రారావు (Kotha Ramachandra Rao)

 కొత్త రామచంద్రారావు
స్వస్థలంసింగాయపల్లి (కోడేరు మండలం)
జిల్లా మహబూబ్‌నగర్
పదవులుపంచాయతి సమితి అధ్యక్షులు (1981-86), ఎమ్మెల్యే (1989-94),
నియోజకవర్గంకొల్లాపూర్
కొత్త రామచంద్రారావు పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. కోడేరు మండలం సింగాయపల్లిలో జన్మించిన రామచంద్రారావు అభ్యసనదశలోనే విద్యార్థి సంఘం నాయకులుగా పనిచేశారు. 1981-86కాలంలో కొల్లాపూర్ పంచాయతి సమితి అధ్యక్షులుగా ఉన్నారు. సింగాయపల్లి గ్రామ సర్పంచిగా, వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్-చైర్మెన్‌గా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా (1989), డిసిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1989లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఇతను విద్యుత్ బోర్డు డైరెక్తరుగానూ, సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు డైరెక్టరుగానూ విధులు నిర్వహించారు. 1994లో కూడా కొల్లాపూర్ నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడీపోయారు. ఇతని సోదరుడు కొత్త వెంకటేశ్వరరావు ఇదే నియోజకవర్గం నుంచి 1978, 1983, 1985లలో హాట్రిక్ విజయం సాధించారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, కోడేరు మండలము, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక