5, మే 2013, ఆదివారం

హస్నాపూర్ (Husnapur)

 హస్నాపూర్ గ్రామము
గ్రామముహస్నాపూర్
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2024 (2011)
1821 (2001)
హస్నాపూర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2024. మండలంలో ఇది 10వ పెద్ద గ్రామము.

భౌగోళికం, సరిహద్దులు:
హస్నాపూర్ గ్రామం మండలంలో భౌగోళికంగా వాయువ్యాన మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున అమిస్తాపూర్, దక్షిణాన అన్నాసాగర్, పశ్చిమాన తాడిపర్తి గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, ఉత్తరాన మహబూబ్‌నగర్ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1821. ఇందులో పురుషులు 922, మహిళలు 899. గృహాల సంఖ్య 346. ఈ గ్రామము మండలంలోనే 10వ పెద్ద గ్రామము.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2024. ఇందులో పురుషులు 1031, మహిళలు 993. గృహాల సంఖ్య 407. అక్షరాస్యత శాతం 45.26%. గ్రామ కోడ్ సంఖ్య 575541.

రవాణా సౌకర్యాలు:
గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారులు లేకున్ననూ 44వ నెంబరు జాతీయ రహదారి సమీపంలో ఉన్నది. సరిహద్దు గ్రామం అన్నాసాగర్ మీదుగా జాతీయ రహదారి వెళ్ళుచున్నది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 8 కిమీ దూరంలో ఉన్నది.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో తిరుపతయ్య (కాంగ్రెస్ పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా కొండయ్య ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు
గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, అనుబంధ గ్రామమైన సేరిపల్లిలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక