12, మే 2013, ఆదివారం

దేవరకద్ర (Devarkadra)

 దేవరకద్ర గ్రామము
గ్రామముదేవరకద్ర
మండలముదేవరకద్ర
జిల్లామహబూబ్‌నగర్
జనాభా7250 (2001)
దేవరకద్ర మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది జిల్లా కేంద్రం నుంచి 20 కిమీ దూరంలో రాయచూర్ వెళ్ళు రహదారిపై ఉన్నది. ఈ గ్రామానికి రైలుసౌకర్యం కూడా ఉంది. మేజర్ గ్రామపంచాయతి ద్వారా గ్రామపాలన నిర్వహించబడుతున్నది. ఇక్కడ వ్య్వసాయ మార్కెట్ కమిటికూడా ఉంది. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం ఆత్మకూరు తాలుకాలో భాగంగా ఉండేది.

రవాణా సౌకర్యాలు:
రోడ్డురవాణా: హైదరాబాదు-రాయచూరు ప్రధాన రహదారిపై ఉండుటచే ఈ గ్రామానికి మంచి రోడ్డురవాణా సౌకర్యాలున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 20 కిమీ దూరంలోనే ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు, నారాయణపేట వెళ్ళు బస్సులు ఈ గ్రామం గుండా వెళతాయి. ప్రైవేట్ వాహనాలు కూడా గ్రామస్థులకు విరివిగా అందుబాటులో కలవు.

రైలురవాణా: దేవరకద్ర రైల్వేస్టేషన్ సికింద్రాబాదు-డోన్ మార్గంలో ఉంది. మునీరాబాదు-మహబూబ్‌నగర్ కొత్త రైలుమార్గం కూడా ఇక్కడి నుంచే మొదలౌతుంది. దేవరకద్ర నుంచి కొత్తగా మరికల్ వరకు 20 కిమీ రైల్వేలైన్ కూడా నిర్మించబడింది.


జనాభా:
2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 7250. ఇందులో పురుషులు 3751, మహిళలు 3499. గృహాల సంఖ్య 1292. ఇది మండలంలో అత్యధిక జనాభా కల గ్రామము.

రాజకీయాలు:
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో శోభ (ఉమ్మడి అభ్యర్థి) సర్పంచిగా విజయం సాధించారు.

వ్యవసాయ మార్కెట్ కమిటి:
జిల్లాలోని 17 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఇది ఒకటి. మండలంలోని గ్రామాల రైతులే కాకుండా పరిసర మండలాలలోని రైతులుకూడా తమ పంటలను విక్రయించడానికి ఇది సౌకర్యంగా ఉన్నది. విశాలమైన స్థలం, గోదాములు, షెడ్డులు తదితరములు సౌకర్యంగా ఉన్నాయి.

విద్యాసంస్థలు:
ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.


గ్రామ ప్రముఖులు:
పులివీరన్న: మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసిన పులివీరన్న ఈ గ్రామానికి చెందినవారు. 2004లో ఇండిపెండెంౠగా పోటీచేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీతరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే మరణించారు.


విభాగాలు: దేవరకద్ర మండలంలోని గ్రామాలు, మహబూబ్‌నగర్ జిల్లా మేజర్ గ్రామపంచాయతీలు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక