28, ఏప్రిల్ 2013, ఆదివారం

కోటకదిర (Kotakadira)

కోటకదిర గ్రామము
గ్రామముకోటకదిర
మండలముమహబూబ్‌నగర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3278 (2001)
4277 (2011)
కోటకదిర మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2011 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4277. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 18 కిమీ దూరంలో ఉంది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం గ్రామం మీదుగా వెళుతున్నది. గ్రామంలో రైల్వేస్టేషన్ కూడా ఉంది. గ్రామశివారులో అప్పిరెడ్డి చెరువు ఉంది. ఇది ఎంపీటిసి నియోజకవర్గం కేంద్రం. ప్రముఖ వాగ్గేయకారుడు మన్నెంకొండ హనుమద్దాసు ఈ గ్రామానికి చెందినవారు. గ్రామంలో చంద్రమౌళిస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా జాతర నిర్వహిస్తారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో పశ్చిమం వైపున దేవరకద్ర మరియు కోయిలకొండ మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున మాచన్‌పల్లి గ్రామం ఉండగా, దక్షిణాన ఓబ్లాయిపల్లి గ్రామం, పశ్చిమాన దేవరకద్ర మండలం, ఉత్తరమున కోయిలకొండ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. 

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3278. ఇందులో పురుషులు 1595, మహిళలు 1683. గృహాల సంఖ్య 734.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4277. ఇందులో పురుషులు 2124, మహిళలు 2153. గృహాల సంఖ్య 908. అక్షరాస్యత శాతం 40.59%

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా మల్లు లలితమ్మ ఎన్నికయ్యారు.

చంద్రమౌళిస్వామి ఆలయం:
సుమారు వందేళ్ళ క్రితం జీవసమాధి అయిన చంద్రమౌళిస్వామి ఈ గ్రామప్రజలకు ఇష్టదైవం. ఏటా జూలై మాసంలో జాతర నిర్వహించి రథోత్సవం కూడా జరుపుతారు. ఆయన సమాధినే ఆలయంగా నిర్మించి నిత్యపూజలు జరుపుతున్నారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ మండలములోని గ్రామాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక