3, ఫిబ్రవరి 2013, ఆదివారం

వనపర్తి సంస్థానము (Wanaparthy Samsthanam)

సంస్థాన కేంద్రం
సూగురు, వనపర్తి
సంస్థాన కాలం
క్రీ.శ.17-20 శతాబ్ది

చివరి పాలకుడు
రాజా రామేశ్వర్ రావు


ఉమ్మడి పాలమూరు జిల్లాలో విలసిల్లిన సంస్థానాలలో వనపర్తి సంస్థానము ఒకటి. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ సంస్థానములోని 124 గ్రామాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యొక్క నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కల్వకుర్తి మరియు అమ్రాబాద్ తాలూకాలలో విస్తరించి ఉండేవి. ఈ సంస్థానము 450 చ.కి.మీ.లలో విస్తరించి, 62,197 జనాభాతో (1901 నాటికి), 1.5 లక్షల వార్షిక ఆదాయంతో ఉండేది. అందులో 76,883 రూపాయలు నిజాముకు కప్పముగా కట్టేవారు

చరిత్ర
ఈ సంస్థానపు రాజులు కుతుబ్ షాహీ రాజులకు సన్నహితముగా ఉండేవారు. తొలిదశలోని వనపర్తి రాజులు 2000 మంది పదాతి దళము మరియు 2000 మంది అశ్విక దళాలు కల సైన్యమును నిర్వహించేవారు. 1727 వరకు సంస్థానానికి సూగూరు రాజధానిగా పాలించేవారు. దాని పేరు మీదుగా సంస్థానాన్ని సూగూరు సంస్థానము అని పిలిచేవారు. కానీ తర్వాత కాలంలో రాజధానిని వనపర్తికి మార్చారు. పరిపాలనా సౌలభ్యము కొరకు సంస్థానమును "సూగూరు" మరియు "కేశంపేట్‌‌" అను రెండు ప్రాంతాలుగా విభజించి, ఇద్దరు తహసీల్దారులను నియమించారు.

1823లో రాజా రామకృష్ణరావు తరువాత ఆయన దత్తపుత్రుడు మొదటి రామేశ్వరరావు సంస్థానాధీశుడయ్యాడు. ఆధునిక భావాలున్న రామేశ్వరరావు మంచి పరిపాలనదక్షుడు. తన రాజ్యపు చుట్టుపక్కల అమలులో ఉన్న బ్రిటీషు పాలనా విధానాలను అనుసరించే ప్రయత్నాలు చేశాడు. 1843 మార్చి 17న నిజాం సికందర్‌ ఝా, మొదటి రాజా రామేశ్వర రావుకు గౌరవ చిహ్నముగా "బల్వంత్" అను బిరుదునిచ్చి గౌరవించారు. నిజాం తన సైన్యానికి రాజా రామేశ్వర రావును పరిశీలకుడుగా నియమించాడు. మొదటి రాజా రామేశ్వర రావు, హైదరాబాదీ బెటాలియన్‌ 1853 నవంబర్ 5 న సృష్టించాడు. 1866లో ఆయన మరణము తర్వాత, ఈ బెటాలియన్‌ నిజాం సైన్యములో కలపబడి ఆ సైన్యానికి కేంద్రబిందువు అయ్యింది. మొదటి రామేశ్వర రావు తర్వాత ఆయన కుమారుడు రాజా కృష్ణ ప్రసాదరావు సంస్థానాధీశుడయ్యాడు. 1910లో రెండవ రాజా రామేశ్వరరావు, అబిస్సీనియులు, సొమాలీలు మరియు ఐరోపా అధికారులతో కూడుకొన్న అశ్విక దళాన్ని నిజామ్‌ VI కి బహుకరించాడు. "మహారాజ" రెండవ రాజా రామేశ్వరరావు, 1922 నవంబర్ 22 వ తేదీన మరణించాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, కృష్ణదేవరావు మరియు రామదేవరావు. భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చిన తర్వాత ఈ కుటుంబము దేశ రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొన్నది.

సాహిత్యం
వనపర్తి సంస్థానంలో ఒక కవి అక్షింతల సింగర శాస్త్రి. ఇతను అక్షింతల సుబ్బాశాస్త్రి రెండవ కుమారుడు. ఇతని స్వస్థలం రేపర్ల అనీ, జటప్రోలు కాని అయ్యవారిపల్లె కాని అయిఉండవచ్చని చరిత్రకారుల భావన. ఇతను వనపర్తి సంస్థానాధీశుల ఆశ్రయంలో ఉండేవారు. ఇతని రచనలు - అన్నపూర్ణాష్టకము, భాస్కర ఖండము, ద్వాదశ మంజరి, శ్రీశైల మల్లికార్జున పంచరత్నము మొదలగునవి. ఇతడు తర్క వేదాంత పండితుడు. వెంకటగిరి, గద్వాల, అనంతగిరి, ఆత్మకూరు ఆస్థానాలలో కూడా సన్మానాలు పొందారు.
 
 


హోం
విభాగాలు: వనపర్తి, తెలంగాణ సంస్థానాలు,  


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక