28, జులై 2019, ఆదివారం

సూదిని జైపాల్ రెడ్డి (S.Jaipal Reddy)

జననం16-01-1942
స్వస్థలంమాడ్గుల
పదవులు
కేంద్రమంత్రి, 4 సార్లు ఎంపి, 4 సార్లు ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు,
అవార్డులుబెస్ట్ పార్లమెంటేరియన్ (1998)
మరణంజూలై 28, 2019
సూదిని జైపాల్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. జిల్లాస్థాయిలోనే కాకుండా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో పేరుగాంచిన నాయకుడు. మహబూబ్ నగర్ జిల్లా మాడ్గులలో జన్మించిన జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పట్టా పొందారు. శాసనసభ్యుడుగా, లోకసభ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా పలు ఉన్నత పదవులు నిర్వహించారు. మహబూబ్ నగర జిల్లాలో జన్మించి కేంద్రమంత్రి పదవి నిర్వహించిన ఏకైక వ్యక్తి ఇతను. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా పొందినారు. 2009-14 కాలంలో చేవెళ్ళ లోకసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో మన్ మోహన్ సింగ్ కేబినేట్ లో మంత్రిపదవి నిర్వహిహించారు. జూలై 28, 2019న మరణించారు.

రాజకీయ జీవనం:
జైపాల్ రెడ్డి 1965-71 వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. 1969-84 వరకు పిసిసి కార్యదర్శిగా పనిచేశారు. 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. ప్రారంభంలో కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉండి అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. జైపాల్ రెడ్డి పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యునిగా 1990 మరియు 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డారు. 1991-92 లోరాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా  వ్యవహరించారు. 1997లో కేంద్ర సమాచార, ప్రసారశాఖా మంత్రిగా ఉంటూ ప్రసారభారతి బిల్లును ప్రవేశపెట్టిన ఘనత పొందారు.
సూదిని జైపాల్ రెడ్డి 
జనరల్ నాలెడ్జి

1998లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు పొందినారు. 1999, 2004లలో మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. 2004-0లో మరోసారి సమాచార శాఖ మంత్రిపదవి చేపట్టినారు. 2005లో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిపదవి లభించింది. 2009లో కొత్తగా ఏర్పాటుచేసిన చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2014 లోకసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థి జితేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.


హోం,
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, మాడ్గుల మండలము,  కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం,  మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం,  మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం, 
= = = = = 
సంప్రదించిన గ్రంథాలు, వెబ్ సైట్లు:


Tags: About jaipal Reddy, Biography of S.jaipal Reddy in Telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక