3, ఫిబ్రవరి 2013, ఆదివారం

గద్వాల సంస్థానము (Gadwal Samsthanam)

గద్వాల సంస్థానపు కోట
సంస్థాన ప్రాంతంకృష్ణా-తుంగభద్ర డోబ్
తొలి రాజధానిపూడూరు
కోట నిర్మాతనలసోమనాద్రి
ప్రముఖ పాలకుడునలసోమనాద్రి
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సంస్థానాలలోనే కాకుండా తెలంగాణలోనే ముఖ్యమైనది గద్వాల సంస్థానము. ఇది తుంగభద్ర మరియు కృష్ణా నదుల మధ్య ప్రాంతములో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దములో కాకతీయ సామ్రాజ్య పతనము తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యము యొక్క సామంతులైనారు. వంశ చరిత్ర ప్రకారము వీరు గద్వాల సంస్థానాన్ని క్రీ.శ.1553 నుండి 1704 వరకు జనరంజకంగా పాలించారు.

1650 ప్రాంతములో ముష్టిపల్లి వీరారెడ్డి అయిజ, దరూరు మహళ్లకు నాడగౌడుగా ఉండేవారు. వీరారెడ్డికి పురుష సంతానము లేకపోవడం వల్ల తన ఏకైక కుమార్తెకు వివాహము చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికము తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయినాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఈయననే నల్ల సోమానాధ్రి, సోమన్నభూపాలుడని ప్రసిద్ధుడయ్యారు). పెద్దారెడ్డి తరువాత ఆయన రెండవ కొడుకు సోమన్న 1704 నుండి నాడగౌడికము చేశారు. ఈయనే కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణమున రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెళ్ల, నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు, అహోబిళం, కర్నూలు మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానము కింద 103 పెద్ద గ్రామాలు, 26 జాగీరులు ఉండేవి.

నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా-2 యొక్క పాలనా కాలములో, దక్కనులోని కొన్ని ప్రాంతములలో మరాఠుల ప్రాబల్యము పెరిగి 25 శాతము ఆదాయ పన్ను (చౌత్) వసూలు చేయడము ప్రారంభించారు. దీనిని దో-అమలీ (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ 1840 లో మరణించాడు. ఆ తరువాత ఆయన దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానమును పరిపాలించాడు. నిజాము VII ఈయనకు "మహారాజ" అనే పట్టమును ప్రధానము చేశాడు. 1924 లో మరణించే సమయానికి ఈయనకు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు కలరు. సీతారాంభూపాల్ మరణం తర్వాత మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ పాలించింది. ఈమె సంస్థాన చివరి పాలకురాలు. ఈమె హయంలోనే 1948లో సంస్థానం ప్రభుత్వంలో విలీనమైంది..



హోం
విభాగాలు: తెలంగాణ సంస్థానాలు, జోగులాంబ గద్వాల జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక