28, జనవరి 2013, సోమవారం

పులి వీరన్న (Puli Veeranna)

(1946 - 2009)
నిర్వహించిన పదవులురాష్ట్ర మంత్రి
నియోజకవర్గంమహబూబ్ నగర్
జన్మించిన తేదిజూలై 23, 1946
మరణించిన తేదిడిసెంబరు 11, 2009
పులి వీరన్న పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 2 సార్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పులి వీరన్న 1946, జూలై 23న దేవరకద్రలో జన్మించారు. న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించి, ఆ తర్వాత రాజకీయాలలో చేరి కోడంగల్ నుంచి 4 సార్లు పోటీచేసి పరాజయం పొందినారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి 3 సార్లు పోటీచేసి 2 సార్లు విజయం సాధించడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినారు.

రాజకీయ జీవనం
న్యాయశాస్త్రం విద్య అభ్యసించిన పులివీరన్న 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో భాగంగా రెండు సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళారు. తొలిసారిగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1972లో పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మరో 3 సార్లు పరాజయం పొందిన పిదప 1989లో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చేనేత జౌళి శాఖామంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీకి చెందిన పి.చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికలలో మళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగాలని ఆశించిననూ పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించడంతో కాంగ్రెస్ రెబెల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2009 ఎన్నికలలో పులివీరన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిననూ తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నారు. డిసెంబరు 11, 2009న మరణించారు. పులివీరన్న భార్య పులి అంజనమ్మ 2006-11 కాలంలో మహబూబ్ నగర్ పురపాలక సంఘపు వైస్ చైర్మెన్‌గా పనిచేశారు.
 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, పత్రికలు, వెబ్ సైట్లు:
  • Puliveranna.com.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),

విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రాజకీయ నాయకులు,   దేవరకద్ర మండలముమహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక