24, జనవరి 2013, గురువారం

పానగల్ మండలము (Pangal Mandal)

జిల్లా వనపర్తి
రెవెన్యూ డివిజన్ వనపర్తి
జనాభా53454 (2011)
60303 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకొల్లాపూర్
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలుపానగల్ కోట,
ముఖ్య పంటలువరి
మండల ప్రముఖులు
పాన్‌గల్ వనపర్తి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము వనపర్తి రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 22 రెవెన్యూ గ్రామాలు, 28 గ్రామపంచాయతీలు కలవు. భాషాప్రయుక్త రాష్ట్రాలకు వేదికగా నిలిచిన మాధవరావుపల్లి ఈ మండలములోనిదే. రాజకీయ నాయకులు విష్ణువర్థన్ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్ ఈ మండలమునకు చెందినవారు. మండల కేంద్రంలో ప్రాచీనమైన కోట ఉంది.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున వనపర్తి, గోపాలపేట్ మండలములు, తూర్పున కోడేరు మండలము, దక్షిణమున వీపనగండ్ల మండలము, పశ్చిమాన పెబ్బేరు మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 53454. ఇందులో పురుషులు 27448, మహిళలు 26006. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60303. ఇందులో పురుషులు 31034, మహిళలు 29269. జనాభాలో ఇది జిల్లాలో 27వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
ప్రధాన రహదారిపై లేకుండుటచే మండలానికి సరైన రవాణా సౌకర్యాలు లేవు. అయిననూ కొల్లాపుర్, వనపర్తి, పెబ్బేరుల నుంచి రహదారి సౌకర్యం ఉంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలో
పానగల్ మండల స్థానం (ఆకుపచ్చ రంగు)
రాజకీయాలు:
ఈ మండలము కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.పి.వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. 2014లో పాన్‌గల్ ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన వెంకటేశ్ నాయుడు ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 46 ప్రాథమిక పాఠశాలలు (3 ప్రభుత్వ, 39 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 12 ప్రాథమికోన్నత పాఠశాలలు (6 మండల పరిషత్తు, 6 ప్రైవేట్), 11 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 10 జడ్పీ, 11 ప్రైవేట్), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 28103 హెక్టార్లలో 32% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 8% భూభాగంలో అడవులున్నాయి. మండలంలో పండించే ప్రధాన పంట వరి. మొక్కజొన్న, వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 481 మిమీ. మండలంలో సుమారు 7800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.



హోం,
విభాగాలు:
వనపర్తి జిల్లా మండలాలు,  పానగల్ మండలము, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక