28, జనవరి 2013, సోమవారం

ఎన్.రాజేశ్వర్ రెడ్డి (N.Rajeshwar Reddy)

 
(1956 - 2011)
నిర్వహించిన పదవులుశాసనసభ్యుడు, భాజపా జిల్లా అధ్యక్షుడు
నియోజకవర్గంమహబూబ్‌నగర్
జన్మించిన తేదిడిసెంబరు 25, 1956
మరణించిన తేదిఅక్టోబరు 30, 2011
ఎన్.రాజేశ్వర్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను డిసెంబరు 25, 1956న జన్మించారు. బెంగళూరులో బి.ఇ (మెకానికల్) విధ్యను పూర్తిచేశారు. 1991 నుంచి భారతీయ జనతాపార్టీలో ఉంటూ ప్రముఖ పదవులను అలంకరించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పదవులు చేపట్టినారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు జిల్లాలో ఎడ్లబండ్ల యాత్ర చేసి రైతుల మన్ననలు అందుకున్నారు. 1996లో పశుగ్రాసం కోసం కాడెడ్ల ప్రదర్శన చేయగా, 2003లో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రాయచూరు సరిహద్దు నుంచి నల్గొండ జిల్లా సరిహద్దు వరకు 200 కిమీ పైగా పాదయాత్ర చేశారు. 1995లో భాజపా తరఫున శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 1997-2003 కాలంలో పాలమూరు జిల్లా భాజపా అధ్యక్షులుగా వ్యవహరించారు. 2003-08 కాలంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 2005లో భాజపా తరఫున మహబూబ్ నగర్ పురపాలక సంఘం కౌన్సిలర్‌గా (పద్మావతి కాలని నుంచి) ఎన్నికైనారు. అప్పుడు చైర్మెన్ అభ్యర్థిగా విజయం సాధించిననూ పురపాలక సంఘంలో భాజపాకు తగినన్ని స్థానాలు లభించకపోవడంతో కేవలం కౌన్సిలర్‌గానే కొనసాగినారు. 2009 శాసనసభ ఎన్నికల ముందు భాజపాకు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరిననూ శాసనసభ ఎన్నికలలో టికెట్టు లభించలేదు. స్వంతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మేల్యేగా ఎన్నికైనారు. ఈ ఎన్నికలలో సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఇబ్రహీంఖాన్‌పై 5137 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజేశ్వర్ రెడ్డి అక్టోబరు 30, 2011న మరణించారు.

రాజేశ్వర్ రెడ్డి తండ్రి ఎన్.పి.సుబ్బారెడ్డి 1991లో మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి భాజపా తరఫున పోటీచేశారు..


విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రాజకీయ నాయకులు, మహబూబ్‌నగర్ మండలము, మహబూబ్‌నగర్ పట్టణము, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం13వ శాసనసభ సభ్యులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక