23, జనవరి 2013, బుధవారం

నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం (Narayanapet Assembly Constituency)

నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం
మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ అసెంబ్లీ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినది. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు కలవు. మక్తల్ నియోజకవర్గం నుంచి నారాయణపేట మండలం, కొడంగల్ నియోజకవర్గం నుంచి దామరగిద్ద మండలం, రద్దయిన అమరచింత నియోజకవర్గం నుంచి ధన్వాడ మండలం, మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి కోయిలకొండ మండలాలు కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటుచేశారు. దీనితో డివిజన్ కేంద్రమైననూ ఈ పేరుతో నియోజకవర్గం లేని లోటు తీరింది.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులు
మహబూబ్ నగర్ జిల్లా వాయువ్యాన ఉన్న ఈ నియోజకవర్గానికి ఉత్తరాన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఈశాన్య వైపున మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆగ్నేయాన దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి. దక్షిణమున మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం ఉంది.

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఎల్కోటి ఎల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ సూగప్ప కాంగ్రెస్ పార్టీ
2014 రాజేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శివకుమార్ రెడ్డి తెరాస
2018 రాజేందర్ రెడ్డి తెరాస కె.శివకుమార్ రెడ్ BLFP

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో అన్ని పార్టీల కంటె ముందుగా భాజపా తన అభ్యర్థిని ప్రకటించింది. 2004 ఎన్నికలలో మక్తల్ నియోజకవర్గం నుండి భాజపా తరఫున పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయిన నారాయణపేట పట్టణ నివాసి అయిన నాగూరావు నామాజీని తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సుగూరప్ప పోటీలో ఉండగా, తెలుగుదేశం పార్టీ నుండి ఎల్లారెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున సాయిబాబా పోటీ చేశారు. ప్రధాన పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్, భాజపాల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూగప్పపై 12126 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి శివకుమార్ రెడ్డిపై 2170 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున ఎస్.రాజేందర్ రెడ్డి, భాజపా తరఫున కె.రతంగ్ పాండురెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన వామనగిరి కృష్ణ పోటీచేశారు. తెరాసకు చెందిన ఎస్.రాజేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి BLFP పార్టీకి చెందిన కె.శివకుమార్ రెడ్డి పై 15187 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గపు ప్రముఖులు
  • నాగూరావు నామాజీ: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ భాజపా నాయకుడైన నాగూరావు నామాజీ నారాయణపేట పట్టణానికి చెందినవారు. పార్టీపరంగా గతంలో రాష్ట్ర స్థాయి పదవులు కూడా నిర్వహించారు. ప్రస్తుతం భాజపా తెలంగాణా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. నామాజీ 2004లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం నర్సిరెడ్డి చేతిలో కేవలం 2356 ఓట్ల స్వల్పతేడాతో పరాజయం పొందినారు. నామాజీ భార్య గతంలో నారాయణపేట పురపాలకసంఘం చైర్మెన్‌గా పనిచేసింది. 2009 ఎన్నికలలో భాజపా అభ్యర్థిగా పోటీ చేసి మూడవస్థానం పొందినారు.
  • రెడ్డిగారి రవీంద్రరెడ్డి: ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌గా ఉన్న రెడ్డిగారి రవీంద్రరెడ్డి కోయిలకొండ మండలానికి చెందినవారు. గతంలో సర్పంచు పదవిని నిర్వహించారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం,  నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక