28, జనవరి 2013, సోమవారం

నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం (Nagarkurnool Loksabha Constituency)

నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం
(గులాబి రంగులో ఉన్నది)
తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007 నాటి నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది. పునర్విభజన ప్రకారము ఈ నియోజకవర్గంలో కొత్తగా వనపర్తి, గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్లు వచ్చిచేరాయి. పునర్విభజనకు పూర్వమున్న జడ్చర్ల, షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లు మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి మరియు పరిగి అసెంబ్లీ సెగ్మెంటు చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గానికి తరలించబడింది.
1967 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 12 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, తెలుగుదేశం పార్టీ 4 సార్లు, టీపీఎస్ ఒక సారి విజయం సాధించాయి. మందజగన్నాథం ఇక్కడినుంచి 4 సార్లు విజయం సాధించడమె కాకుండా 1999,04, 09లలో వరస విజయాలు సాధించి హాట్రిక్ నమోదుచేశారు.మల్లు అనంతరాములు, మల్లురవి సోదరులు మరియు భీష్మదేవ్ లు రెండేసిసార్లు గెలుపొందినారు. ప్రస్తుతం తెరాసకు చెందిన పి.రాములు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అభ్యర్థులు:

 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ















1967 జె.బి.ముత్యాలరావు కాంగ్రెస్ పార్టీ

1971 ఎం.భీష్మదేవ్ టీపీఎస్

1977 ఎం.భీష్మదేవ్ కాంగ్రెస్ పార్టీ

1980 మల్లు అనంతరాములు కాంగ్రెస్ పార్టీ

1984 వి.తులసిరాం తెలుగుదేశం పార్టి

1989 మల్లు అనంతరాములు కాంగ్రెస్ పార్టీ

1991 మల్లురవి కాంగ్రెస్ పార్టీ

1996 మంద జగన్నాథం తెలుగుదేశం పార్టి

1998 మల్లురవి కాంగ్రెస్ పార్టీ

1999 మంద జగన్నాథం తెలుగుదేశం పార్టి

2004 మంద జగన్నాథం తెలుగుదేశం పార్టి

2009 మంద జగన్నాథం కాంగ్రెస్ పార్టీ

2014 నంది ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ

2019 పి.రాములు తెరాస



2004లో వివిధ అభ్యర్థులకు
పోలైన ఓట్లు
2004 ఎన్నికలు:
2004లో జరిగిన లోకసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి మంద జగన్నాథం తన సమీప ప్రత్యర్థి ఇండెపెండెంట్ అభ్యర్థి అయిన కె.ఎస్.రత్నంపై 99650 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. మంద జగన్నాథంకు 405,046 ఓట్లు రాగా, రత్నంకు 305,396 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంద జగన్నాథ్ తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గువ్వల బాలరాజ్‌పై 47,767 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. జగన్నాథంకు 422745 ఓట్లు రాగా, బాలరాజ్‌కు 374978 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ 3వ స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి టి.రత్నాకర్ 4వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 9 అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఒక నామినేషన్ తిరస్కరించబడింది. ఇద్దరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 6 అభ్యర్థులు మిగిలారు. తెలంగాణలోనే అతి తక్కువ అభ్యర్థులు పోటీ పోటీ చేసిన లొకసభ నియోజకవర్గం ఇదే.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నంది ఎల్లయ్య తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన మందా జగన్నాథంపై 17800 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన పోతుగంటి రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లురవిపై 1,89,748 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెరాస అభ్యర్థికి 4,99,672 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3,09,924 ఓట్లు లభించాయి. భారతీయ జనతాపార్టీకి చెందిన బంగారుశృతి 1,29,021 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా నియోజకవర్గాలు, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం, తెలంగాణ లోకసభ నియోజకవర్గాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక