24, జనవరి 2013, గురువారం

లింగాల మండలము (Lingal Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ నాగర్ కర్నూల్
జనాభా28874 (2001)
35449 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంఅచ్చంపేట
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులు
లింగాల నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఇది నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు, 13 గ్రామపంచాయతీలు కలవు. మండల జనాభా కోడ్ 0050. మండలంలో 60% భూభాగం అటవీ ప్రాంతంగా ఉంది. ఇది నల్లమల అడవులలో భాగము. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35449.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున టెల్కపల్లి, బల్మూరు మండలములు, తూర్పున బల్మూరు, అమ్రాబాదు మండలములు, దక్షిణాన అమ్రారబాదు, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలములు, పశ్చిమాన పెద్దకొత్తపల్లి, టెల్కపల్లి మండలములు సరిహద్దులుగాఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 28874. ఇందులో పురుషులు 15104, మహిళలు 13770. ఎస్సీల సంఖ్య 3936, ఎస్టీల సంఖ్య 8093. అక్షరాస్యత శాతం 35.82%. స్త్రీపురుష నిష్పత్తి 910. జనసాంద్రత 162/చకిమీ.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 35449. ఇందులో పురుషులు 18238, మహిళలు 17211. జనాభాలో ఇది జిల్లాలో 63వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
అచ్చంపేట నుంచి నాగర్ కర్నూల్ (వయా తెల్కపల్లి) నుంచి రహదారి సౌకర్యం ఉంది. లింగాల నుంచి కొల్లాపూర్ కు కూడా రహదారి ఉంది.

చరిత్ర:
పూర్వం ఇది కందూరు చోళుల అధీనంలో ఉండేది. మండలకేంద్రంలో కందూరు చోళరాజు నిర్మించిన శ్రీకోదండరామస్వామి ఆలయం ఉంది. నిజాంల కాలంలో లింగాలలో జైలు ఉండేది. కరుడుకట్టిన నేరగాళ్ళకు లింగాల జైలుకు పంపేవారు.ఈ కారణంచే గ్రామాన్ని కొందరు "దొంగల లింగాల"గా అభివర్ణిస్తారు.

అచ్చంపేట నియోజకవర్గంలో
లింగాల మండల స్థానం (ఎరుపు రంగు)
రాజకీయాలు:
లింగాల మండలము అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2006లో జడ్పీటీసిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వి.సరస్వతమ్మ, మండల అధ్యక్షులుగా సి.జగపతి రావు ఎన్నికయ్యారు. 2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 13 గ్రామపంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 10, తెలుగుదేశం పార్టీ 2 పంచాయతీలలో విజయం సాధించాయి. 2014లో ఎంపిపిగా తెరాస పార్టీకి చెందిన మంజుల ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
మండలంలో 2008-09 నాటికి 23 ప్రాథమిక పాఠశాలలు (5 ప్రభుత్వ, 16 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 13 ప్రాథమికోన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 9 మం.ప, 2 ప్రవేట్), 5 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 2 జిల్లా పరిషత్తు, ఒకటి ప్రైవేట్) ఉన్నవి.

అధ్యాత్మికం:
లింగాలలో కోదండరామస్వామి ఆలయం ఉంది. 1168లో కందూరు చోళుల కాలంలో ఠాణా అనే రాజు నిర్మించినట్లు తెలుస్తుంది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. వరి, జొన్నలు, ప్రత్తి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 651 మిమీ. మండలంలో సుమారు 1000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2014, జూలై 4: ఎంపిపిగా తెరాస పార్టీకి చెందిన మంజుల ఎన్నికయ్యారు.

లింగాల మండలంలోని గ్రామపంచాయతీలు
1.అంబడిపల్లి6.చిన్నంపల్లి11.వల్లభాపూర్
2.అప్పాయిపల్లి7.జీలుగుపల్లి12.సాయింపేట్
3.అవుసలికుంట8.ధారారం13.సూరాపుర్
4.కొత్తకుంటపల్లి9.రాయవరం
5.కోమటికుంట10.లింగాల్


విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  లింగాల మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక