22, జనవరి 2013, మంగళవారం

కొల్లాపూర్ మండలం (Kollapur Mandal)

జిల్లా మహబూబ్ నగర్
రెవెన్యూ డివిజన్ నాగర్ కర్నూల్
జనాభా64186 (2001)
67722 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకొల్లాపూర్
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలుసింగోటం,
ముఖ్య పంటలువేరుశనగ
మండల ప్రముఖులుకె.మధుసూధన్ రావు, రామేశ్వర్ రావు జూపల్లి
కొల్లాపూర్ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము నాగర్ కర్నూల్ రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు, 15 గ్రామపంచాయతీలున్నాయి. జిల్లాలోనే మామిడితోటలకు కొల్లాపూర్ ప్రసిద్ధి చెందింది. సింగోటంలో ప్రసిద్ధమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, సోమశిలలో చాళుక్యుల కాలం నాటి ఆలయాలున్నాయి. స్వాతంత్ర్యానికి ముందు ఈ ప్రాంతం సురభి పాలకుల కేంద్రంగా ఉండేది. కొల్లాపూర్, పెంట్లవల్లి కేంద్రంగా సురభి సంస్థానాధీశులు శతాబ్దాల పాటు పాలన చేశారు. 2012లో మండల కేంద్రం కొల్లాపూర్ పురపాలక సంఘంగా ప్రకటించబడింది. మండలంలో 51% భూభాగంలో అడవులున్నాయి. ఇవి నల్లమల అడవులలో భాగము. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 67722. ప్రముఖ కవి వాజపాయ యాజుల రామసుబ్బరాట్కవి, ఎమ్మెల్యేగా పనిచేసిన కె.మధుసూధనరావు , శాస్త్రవేత్త వలిపె రాంగోపాలరావు, మై హోం గ్రూపు పారిశ్రామికవేత్త రామేశ్వర్ రావు జూపల్లి ఈ మండలమునకు చెందినవారు.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున కోడేరు, పెద్దకొత్తపల్లి, లింగాల మండలములు, తూర్పున అమ్రాబాదు మండలము, పశ్చిమాన వీపనగండ్ల మండలము, దక్షిణమున కృష్ణానది దానికి ఆవల కర్నూలు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 64186. ఇందులో పురుషులు 32988, మహిళలు 31198.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 67722. ఇందులో పురుషులు 34868, మహిళలు 32854. జనాభాలో ఇది జిల్లాలో 16వ స్థానంలో ఉంది.
కొల్లాపూర్ నియోజకవర్గంలో
కొల్లాపూర్ మండల స్థానం (పసుపు రంగు)

రాజకీయాలు:
ఈ మండలము కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గము, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాణి ఎన్నికయ్యారు.1994లో కొల్లాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మధుసూధన్ రావు ఈ మండలమునకు చెందినవారు. 2014లో కొల్లాపూర్ ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన చిన్న నిరంజన్ రావు ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 50 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 39 మండల పరిషత్తు, 2 ప్రైవేట్ ఎయిడెడ్, 8 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 18 ప్రాథమికోన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 9 మండల పరిషత్తు, 7 ప్రైవేట్), 21 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 12 జడ్పీ, 2 ప్రైవేట్ ఎయిడెడ్, 6 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 6 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 4 ప్రైవేట్) ఉన్నవి.
కొల్లాపూర్ ప్యాలెస్

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 56602హెక్టార్లలో 21% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 51% భూభాగంలో అడవులున్నాయి. ఇవి నల్లమల అడవులలో భాగము. మండలంలో పండించే ప్రధాన పంట వేరుశనగ. మొక్కజొన్న, వరి, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 674 మిమీ. మండలంలో సుమారు 3500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 1944: కొల్లాపూర్ సంస్థానం రాజుగా వెంకట జగన్నాథరావు పట్టాభిషిక్తులయ్యారు. 
  • 2011, ఆగస్టు 24: కొల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీని నగర పంచాయతీగా అప్ గ్రేడ్ చేశారు. (ఉత్తర్వు సంఖ్య 358)
  •  2013, నవంబరు 13: కొల్లాపూర్‌కు చెందిన శాస్త్రవేత్త వలిపె రాంగోపాలరావుకు ఇన్ఫోసిస్ అవార్డు లభించింది.
  • 2014, జూన్ 2: ఈ మండలం తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది.
  • 2014, జూలై 4: కొల్లాపూర్ ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన చిన్న నిరంజన్ రావు ఎన్నికయ్యారు. 
  • 2016, అక్టోబరు 11: ఈ మండలం కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూల్ జిల్లాలో భాగమైంది.
ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ



విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  కొల్లాపూర్ మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

Tags:Kollapur Mandal in Telugu, Kollapur Mandal Essay in Telugu, Kollapur Mandal information in Telugu, Kollapur History in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక