23, జనవరి 2013, బుధవారం

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం (Kodangal Assembly Constituency)


2007నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మండలాలు కలవు. ఈ నియోజకవర్గంలోని 5 మండలాలలో 3 మండలాలు వికారాబాదు జిల్లాలో, 2 మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో కలవు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు అన్ని మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేవి.  ఈ అసెంబ్లీ నియోజక వర్గం మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. పునర్విభజనకు పూర్వం అసంపూర్తిగా ఉన్న మద్దూరు మండలం ప్రస్తుతం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరగా, ఇదివరకు ఈ నియోజకవర్గంలో ఉన్న దామరగిద్ద మండలం కొత్తగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రావులపల్లి గురునాథ్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 5 సార్లు విజయం సాధించారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రిపదవిని పొందిన ఏకైక వ్యక్తి అచ్యుతరెడ్డి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులు
మహబూబ్ నగర్ జిల్లాలో వాయువ్యాన ఉన్న ఈ నియోజకవర్గానికి తూర్పున రంగారెడ్డి జిల్లాకు చెందిన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, ఉత్తరాన రంగారెడ్డి జిల్లాకే చెందిన తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా, వాయువ్యాన మరియు దక్షిణాన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది.

ఎన్నికైన శాసనసభ్యులు
సం. గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 వీరాస్వామి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక -
అనంతరెడ్డి కాంగ్రెస్ పార్టీ బి.జాన్ గోపాల్ ఆర్.పి.ఐ
1957 కె. అచ్యుతరెడ్డి కాంగ్రెస్ పార్టీ విఠల్‌ రావు పి.డి.ఎఫ్
1962 రుక్మారెడ్డి స్వతంత్ర పార్టీ కె. అచ్యుతరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1967 కె. అచ్యుతరెడ్డి కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి ఇండిపెండెంట్
1972 నందారం వెంకటయ్య స్వతంత్ర అభ్యర్థి కె.ఎస్.రెడ్డి ఇండిపెండెంట్
1978 ఆర్.గుర్నాథరెడ్డి ఇండిపెండెంట్ పులి వీరన్న కాంగ్రెస్ పార్టీ
1983 ఆర్.గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నందారం వెంకటయ్య ఇండిపెండెంట్
1985 నందారం వెంకటయ్య తెలుగుదేశం పార్టీ రావులపల్లి గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 ఆర్.గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రతన్‌లాల్ లాహోటి తెలుగుదేశం పార్టీ
1994 నందారం వెంకటయ్య తెలుగుదేశం పార్టీ ఆర్.గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1996 నందారం సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ ఆర్.గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 ఆర్.గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డి.శారద తెలుగుదేశం పార్టీ
2004 ఆర్.గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.అనురాధ తెలుగుదేశం పార్టీ
2009 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆర్.గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆర్.గురునాథ్ రెడ్డి తెరాస
2018 పట్నం నరేందర్ రెడ్డి తెరాసకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ


వివిధ పార్టీల పరిస్థితి
ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ఆధిపత్యం వహిస్తున్నది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీ కూడ ఈ నియోజకవర్గంలో ఉనికిని చూపుతోంది. ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికలలో 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ కూడా 4 సార్లు విజయం సాధించింది. 1985 తరువాత విజయం సాధించిన అభ్యర్థులకు పోలైన ఓట్లలో 50% మించి ఓట్లు రావడం విశేషం. దీనికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో మూడో పార్టీ బలంగా లేకపోవడం. ఈ నియోకవర్గం నుంచి గురునాథ్ రెడ్డి అత్యధికంగా ఐదు సార్లు విజయం సాధించారు. మొదటిసారి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలవగా ఆ తరువాత 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం తెలుగుదేశం ఫార్టీకి చెందిన యువనాయకుడు రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

1999 ఎన్నికలు
1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.గురునాథ్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన డి.శారదపై 13702 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గురునాథ్ రెడ్డికి 59624 ఓట్లు రాగా, శారద 45922 ఓట్లు సాధించింది.
2004 ఎన్నికలు
2004 శాసనసభ ఎన్నికలలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన ఎన్.ఎం.అనురాధపై 5965 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. గురునాథ్ రెడ్డి 61452 ఓట్లు సాధించగా, అరుణకు 55487 ఓట్లు లభించాయి

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు ఆర్.గురునాథ్ రెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ అయిన రేవంత్ రెడ్డి పోటీచేశారు. భారతీయ జనతా పార్టీ నుండి అనంతరామచందర్, లోకసత్తా పార్టీ తరఫున ఎస్.జయప్రకాష్, ప్రజారాజ్యంతో పొట్టు పెట్టుకున్న మనపార్టీ తరఫు నుండి సావిత్రి పోటీచేశారు. ప్రధాన పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురునాథరెడ్డిపై 6989 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి, 5 సార్లు ఎమ్మెల్యే అయిన రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 14457 ఓట్ల మెజారిటితో విజయం సాధించి వరసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున పట్నం నరేందర్ రెడ్డి, భాజపా తరఫున నాగూరావు నామాజీ, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుముల రేవంత్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన పట్నం నరేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుముల రేవంత్ రెడ్డి పై 9319 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గపు ప్రముఖులు
  • ఆర్.గురునాథ్ రెడ్డి: మహబూబ్ నగర్ జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతలలో ఒకడైన రావులపల్లి గురునాథ్ రెడ్డి మొత్తం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మద్యలో రెండు సార్లు తెలుగుదేశం పార్టీకి చెందిన నందారం వెంకటయ్య చేతిలో పరాజయం పొందిననూ నియోజకవర్గంలో పట్టు కోల్పోలేడు. ఇతని కుమారుడు ముద్దయ్య దేశ్‌ముఖ్ కొడంగల్ మండల అద్యక్షుడిగా పనిచేశాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీ చేసిననూ  తెలుగుదేశం అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో సుమారు ఏడువేల ఓట్ల తేడాతో పరాజయం పొంది హాట్రిక్ అవకాశం కోల్పోయారు.
  • నందారం వెంకటయ్య: ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందిన నందారం వెంకటయ్య 1972లో స్వతంత్ర అభ్యర్థిగాను, 1985 మరియు 1994లలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనారు. 
  • రేవంత్ రెడ్డి: కోడంగల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు తెదేపా తరఫున విజయం సాధించిన రేవంత్ రెడ్డి 2017 అక్టోబరులో తెదేపాకు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.


హోం,
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,   కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం,  మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం,  తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాలు, 


Tags:Kodangal Assembly Constituency information in Telugu, Vikarabad Dist Assembly Constituencies in Telugu, Mahabubnagar Dist Assembly Constituencies in Telugu, Kodangal, Kosgi, Doulthabad, Damargidda, Maddur Mandals

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక