11, ఆగస్టు 2021, బుధవారం

గెల్లు శ్రీనివాస్ (Gellu rinivas)

గెల్లు శ్రీనివాస్

(Gellu Srinivas)

:








కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హమ్మత్ నగర్ కు చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడు. 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషించాడు. 2000-05 కాలంలో అఖల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 నుంచి తెరాసలో చురుకుగా పాల్గొంటున్నారు. 2006-07లో హైదరాబాదు విశ్వవిద్యాలయం అధ్యక్షుడీగా పనిచేశారు. మలివిడత తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు. 2017 నూంచ్చి తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2021 హుజురాబాదు ఉప ఎన్నికలలో తెరాస తరఫున పోటీచేస్తున్నారు.
తండ్రి గెల్లు మల్లయ్య కొండపాక ఎంపీటీసిగా పనిచేశారు. తల్లి హిమ్మత్ నగర్ సర్పంచిగా ఎన్నికయ్యారు.
 

 
 




హోం
విభాగాలు: కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు,


 = = = = =


7, ఆగస్టు 2021, శనివారం

నీరజ్ చోప్రా (Neeraj Chopra)

నీరజ్ చోప్రా (eeraj Chopra)
జననం
డిసెంబరు 24, 1997
రంగం
జావెలిన్ త్రో క్రీడాకారుడు
అవార్డులు
అర్జున అవార్డు
పతకాలు
ఒలింపిక్ స్వర్ణం (2020)
జావెలిన్ త్రో క్రీడాకారుడు, 2020 టోక్యో ఒలింపిక్ క్రీడలలో స్వర్ణపతక విజేత అయిన నీరజ్ చోప్రా డిసెంబరు 24, 1997న హర్యాన్లోని పానిపట్టు జిల్లా ఖండేరా గ్రామంలో జన్మించాడు. అర్మీలో చేరి సుబేదార్ వృత్తి చేపట్టి విశిష్ట సేవా మెడల్ కూడా పొందినాడు
జావెలిన్ త్రోలో అనేక జాతీయ అంతర్జాతీయ పతకాలు సాధించాడు. 2017లో భువనేశ్వర్ ఆసియా చాంప్ లో స్వర్ణం, 2018 గౌహతి దక్షిణాసియా క్రీడలలో స్వర్ణం, 2018 జకర్తా ఆసియా క్రీడలలో స్వర్ణం, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణం సాధించాడు. 2018లో అర్జున అవార్డు పొందాడు. ఆగస్టు 7, 2021న టోక్యో ఒల్పింపిక్ క్రీడలలో 87.88 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం సాధించాడు.

టోక్యో ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం సాధించి ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో భారతీయుడిగా (అభినవ్ బింద్రా తర్వాత) అవతరించాడు.
 
ఇవి కూడా చూడండి: 
*ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన క్రీడాకారులు,
*భారత ప్రముఖ క్రీడాకారులు,
*హర్యానా క్రీడాకారులు,


హోం
విభాగాలు:ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన క్రీడాకారులు, భారత ప్రముఖ క్రీడాకారులు, హర్యానా క్రీడాకారులు,


 = = = = =


2, ఆగస్టు 2021, సోమవారం

దుద్యాల మండలం (Dudyal Mandal) :

దుద్యాల మండలం
ఏర్పాటు
జూలై 2021లో ప్రాథమిక ప్రకటన
గ్రామాల సంఖ్య

జనాభా

రెవెన్యూ డివిజన్
తాండూర్
అసెంబ్లీ నియోజకవర్గం
కోడంగల్
లోక్‌సభ నియోజకవర్గం
మహబూబ్‌నగర్
వికారాబాదు జిల్లాలో కొత్తగా దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన దుద్యాల మండలాన్ని తాండూరు డివిజన్‌లో కలిపారు. జూలై 2021లో మండల ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక ప్రకటన వెలువడింది. ఆ తర్వాత అభిప్రాయాలు స్వీక్రించి దానికనుగుణంగా మండలాన్ని ప్రారంభించారు.

గతంలో కోస్గి మండలంలో ఉండి జిల్లాల పునర్విభజనలో కోస్గి మండలంలోకి వెళ్ళిన హకీంపేట, పోలెపల్లి గ్రామాలు కూడా మళ్ళీ వికారాబాదు జిల్లాలోకి చేరాయి.

12 గ్రామాలతో దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో బొంరాస్‌పేట మండలంలోని దుద్యాల, లగచెర్ల, ఈర్లపల్లి, గౌరారం, చిల్‌ముల్‌మైలారం, మాచన్‌పల్లి, నాస్కంపల్లి, హంసాన్‌పల్లి, దౌల్తాబాద్‌ మండలంలోని కుదురుమల్ల, కొడంగల్‌ మండలంలోని ఆలేడు, కోస్గి మండలంలోని హకీంపేట, పోలేపల్లి గ్రామాలు ఉన్నాయి.
 
ఇవి కూడా చూడండి:

 

 



 హోం
విభాగాలు: వికారాబాదు జిల్లా మండలాలు,


 = = = = =
ఆధారాలు:
  • ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 307 తేది 28-07-2021

30, జులై 2021, శుక్రవారం

మీరాబాయి చాను (Mirabai Chanu)

మీరాబాయి చాను
జననం
ఆగస్టు 8, 1994
స్వస్థలం
న్ంగ్‌పొక్ కచింగ్ (మణిపూర్)
రంగం
వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి
గుర్తింపులు
పద్మశ్రీ, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న
వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా పేరుపొందిన మీరాబాయిచాను ఆగస్టు 8, 1994న ఇంఫాల్ సమీపంలోని న్ంగ్‌పొక్ కచింగ్ (మణిపూర్)లో జన్మించింది. చిన్న వయస్స్సులోనే వెయిట్‌లిఫ్టింగ్‌లో ప్రతిభ చూపిన మీరాబాయి చాను 2016లో రియో ఒలింపిక్స్‌లో పాల్గొంది. 2017లో అమెరికాలో జరిగిన ప్రపంచ చాంప్ పోటీలలో స్వర్ణం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించింది. జాతీయస్థాయిలో, ఆసియా చాంప్‌లలో, కామన్వెల్త్ క్రీడలలో కూడా పలు పతకాలు సాధించింది.
 
ఇవి కూడా చూడండి:
ఒలింపిక్ పతకం సాధించిన భారతీయులు, 
మణిపూర్ ప్రముఖులు, 
భారతదేశ ప్రముఖ మహిళలు, 
రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పూరస్కార గ్రహీతలు, 


హోం
విభాగాలు:ఒలింపిక్ పతకం సాధించిన భారతీయులు, మణిపూర్ ప్రముఖులు, భారతదేశ ప్రముఖ మహిళలు, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న పూరస్కార గ్రహీతలు,


 = = = = =


22, జులై 2021, గురువారం

తెలుగు వికీపీడియాలో ప్రజాస్వామ్యం ఎంత?

(గమనిక: తెలుగు భాషాభిమానులు ఈ పోస్టు గురించి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయండి. తెలుగు వికీపీడియా గురించి వాస్తవాలు తెలుగు ప్రజానీకానికి తెలియజేయండి)
తెలుగు వికీపీడియాలో ప్రజాస్వామ్యం ఎంత?
ప్రజాస్వామ్యం శాతం
0%
ఉన్నదేంటి
నియంత లక్షణాలు
ఎప్పటినుంచి ఇలా జరుగుతోంది
ఇటీవలి కాలంలోనే
అందరి దిద్దుబాట్లకు అనుమతి ఎందుకు లేదు
నిర్వహణ చేతకాక
నియంత లక్షణాల వల్ల ఫలితం
తెవికీకి తీరని నష్టం
తెలుగు వికీపీడీయా అనగానే అందరికీ స్పురించేది ఎవరైనా దిద్దుబాట్లు చేసి సమాచారాన్ని చేర్చే విజ్ఞానసర్వస్వం అనీ,. కాని వాస్తవంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. తెవికీ మొదటి పేజీలోనే ఎవరైనా దిద్దుబాట్లు చేసుకోవచ్చని రాశారు. ఈ ప్రజాస్వామ్య స్పూర్తి మొదటిపేజీకే పరిమితం. చాలా పేజీలు ఎలాంటి దిద్దుబాట్లు చేయకుండా తాళం విధించారు. కొత్తవారు ఏదేని దిద్దుబాట్లు చేసిననూ వెంటనే వారిపై, ఆ పేజీలపై నిరోధం విధించడం సర్వసాధారణమైపోయింది.
ప్రజాస్వామ్య లక్షణాలతో కొనసాగించాల్సిన తెవికీని కొందరు నిర్వాహకులు పూర్తిగా నియంత లక్షణాలతో మార్చివేశారు. ఒకరిద్దరు నిర్వ్హకులు ఇలా నియంత లక్షణాలను కల్గియున్ననూ మిగితా నిర్వాహకులు ఏమయ్యారనేది అంతుచిక్కని ప్రశ్న. భాషాభిమానులు ఈ విషయంపై చాలారోజుల నుంచి ప్రశ్నిస్తున్ననూ అసలు మిగితా నిర్వాహకులు బతికే ఉన్నారా అనేది తెలియడం లేదు. నిర్వహణ చేతకానిచో పదవులు వదిలివేయడం ఉత్తమం.

నియంత లక్షణాలతో తెవికీని ఛిన్నాభిన్నం చేసిన నిర్వాహకులు నిర్వాహక, అధికార పదవులను వదిలేసి కొత్తవారికి ఇమ్మంటున్ననూ నోరుమెదపటం లేదు పైగా తెవికీ పదవులలో నాట్యం చేస్తున్నారు. ఇప్పటికే కొందరి నియంత లక్షణాలతో తెవికీకి చాలా నష్టం జరిగింది. ఈ నష్టం ఇప్పట్లో పూడ్చలేనిది. అయినా కొందరికి చీమ కుట్టీనట్లయినా కావడం లేదు.

కొన్నేళ్ళ క్రితం వైజాసత్య, చంద్రకాంతరావు, కాసుబాబుల కృషితో ఎంతో అభివృద్ధిచెందిన తెలుగు వికీపీడియా ఈ మధ్య కొందరి దారుణమైన నియంత లక్షణాలతో విసిగీ విసిగీ చివరికి చచ్చిపోయింది. వికీపీడియాకు మళ్ళీ జీవం పోసి పూర్వవైభవం తీసుకువస్తానని చంద్రకాంతరావు చేసిన ప్రతిపాదనకు ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీనితో తెలుగు ప్రజానీకానికి తీరని నష్టం జరిగింది..
 
తెవికీ అనేది ఎవరి అబ్బసొత్తు కానేకాదు. ఇది అందరిదీ. దిద్దుబాట్లలో కూడా అందరికీ అవకాశం కల్పించాలి. కాకుంటే పూర్తిగా ఛిన్నాభిన్నం కాకుండా నిర్వహణ బాగుంటే చాలు. కాని నిర్వహణ చేతకాక రాసినది తొలగించడం, పేజీలకు తాళాలు విధించడం, సభ్యులపై, ఐపి అడ్రస్ లపై నిరోధాలు విధించడం మాత్రం పూర్తిగా తప్పుడు చర్య మరియు ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి వ్యతిరేకం మరియు నిర్వాహక హోదాను దుర్వినియోగపర్చినట్లుగా చెప్పవచ్చు. 

ప్రజాస్వామ్య స్పూర్తితో అందరికీ అవకాశం కల్పిస్తూ విజ్ఞానసర్వస్వాన్ని అభివృద్ధి పరుస్తూ అందరి నుంచి ప్రశంసలు పొందాల్సి ఉండగా, దీనికి పూర్తి భిన్నంగా నిర్వహణ చేతకాక అనామకులచే బండబూతులు తిన్న నిర్వాహకులున్నారు. పిరికిపందులు అనీ, నాపై నిరోధం విధించి ఏం పీకినట్లు అనీ తిట్లు తిన్న నిర్వాహకూలకు ఇప్పటికీ మళ్ళీ అవే చేష్టలతో ఊగుతున్నారు. తిట్లు తినడం నిర్వాహకులకు అంతిష్టమా?
 
ఇవి కూడా చూడండి:
 


హోం
విభాగాలు: తెలుగు వికీపీడియా,


 = = = = =


చరిత్రలో ఈ రోజు ఏప్రిల్ 17 (April 17)

తెలుగు వికీపీడియా చచ్చిపోయిన తర్వాత అంతర్జాలంలో మిలిగిన ఏకైక విజ్ఞాన సర్వస్వం ఇది ఒక్కటే. దీన్ని ఆదరించండి, దీని గురించి ప్రచారం చేయండి, ఇంకనూ అభివృద్ధికై తోడ్పడండి. cckraopedia.blogspot.com
చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 17
  • తెలుగు నాటకరంగ దినోత్సవం.
  • ప్రపంచ హీమోఫీలియో దినం.
  • 326: అలెగ్జాండర్ ది గ్రేట్ మరణం
  • 1790: బెంజిమిన్ ఫ్రాంక్లిన్ మరణం
  • 1915: తొలి మహిళా ప్రధానమంత్రి సిరిమావొ బండారు నాయకె జననం
  • 1925: బహుభాషావేత్త, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు బిరుదురాజు రామరాజు మరణం.
  • 1942: ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జీన్ పెర్రిన్ జననం
  • 1946: సిరియా స్వాతంత్ర్యం పొందింది
  • 1961: బిలియర్డ్స్, స్నూకర్ క్రీడాకారుడు గీత్ సేథి జననం
  • 1972: తెలుగు సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ జననం
  • 1972: శ్రీలంకకు చెందిన క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జననం
  • 1975: రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపలి రాధాకృష్ణన్ మరణం
  • 1978: మిస్ యూనివర్స్ కిరీటం పొందిన భారతీయురాలు లారా దత్తా జననం.
  • 2004: ప్రముఖ సినీనటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణం
  • 2013: కర్ణాటక గవర్నరుగా పనిచేసిన వి.ఎస్.రమాదేవి జననం .
  • 2018: ప్రముఖ పాత్రికేయుడు ఆర్.షెణాయ్ మరణం.

 

ఇవి కూడా చూడండి:

 

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

20, జులై 2021, మంగళవారం

బక్కని నరసింహులు (Bakkani Narasimhulu)

బక్కని నరసింహులు 
(Bakkani Narasimhulu)
స్వస్థలం
లింగారెడ్డిగూడ
రంగం
రాజకీయాలు
పదవులు
ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు,
నియోజకవర్గం
షాద్‌నగర్ అ/ని
బక్కని నరసింహులు మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 1983లో తెలుగుదేశం పార్ట్ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి 1994లో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి పి.శంకర్రావుపై భారీ మెజారిటీతో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు. 1999లో సీట్ల సర్దుబాటులో ఈ స్థానం భాజపాకు వెళ్ళడంతో పోటీచేసే అవకాశం రాలేదు. 2004లో రెండోసారి పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు ఈయన ఎస్సీ, ఎస్టీ కమిటి రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటి సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ తెలుగుదేశంప్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ తెరాసలో చేరడంతో జూలై 19, 2021న బక్కని నరసింహులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనారు.
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకులు, పాలమూరు జిల్లా రాజకీయ నాయకులు,


 = = = = =


యడ్లపాటి వెంకట్రావు (Yadlapati Venkatarao)

తెలుగు వికీపీడియా చచ్చిపోయిన తర్వాత అంతర్జాలంలో మిగిలిన ఏకైక తెలుగు విజ్ఞాన సర్వస్వం ఇది ఒక్కటే. దీన్ని ఆదరించండి, దీని గురించి ప్రచారం చేయండి, మరింత అభివృద్ధికి తోడ్పడండి.
జననం
డిసెంబరు 16, 1919
స్వస్థలం
అమృతలూరు మండలం బోడపాడు
జిల్లా
గుంటూరు జిల్లా
రంగం
రాజకీయాలు
పదవులు
రాష్ట్రమంత్రి, జడ్పీ చైర్మెన్,
స్వీయ చరిత్ర
నా జీవన గమనం
గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన యడ్లపాటి వెంకట్రావు డిసెంబరు 16, 1919న గుంటూరు జిల్లా అమృతలూరు మండలం బోడపాడులో జన్మించారు. చెన్నైలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టి ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. 
 
1962లో వేమూరు నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. 1967లో కూడా వేమూరు నుంచి ఇండిపెండెంటుగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సన్నపనేని వెంకట్రావుపై విజయం సాధించారు. 1978లో వేమూరు నుంచి జనతాపార్టీ తరఫున ఎన్నికై 1978-80 కాలంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.
 
 1978లో సంగం డెయిరీ వ్యవస్థాపక చైర్మెన్ గా, 1981లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. 1983లో వేమూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి తెలుగుదేశం ఫార్టీ అభ్యర్థి నాదెండ్ల భాస్కరరావు చేతిలో ఓడిపోయారు. 1995-98 కాలంలో జిల్లా పరిషత్తు చైర్మెన్ గా పనిచేశారు. 1998లో జడ్పీ చైర్మెన్ పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 
 
ప్రముఖ రైతు నాయకుడు ఎన్.జి.రంగా ముఖ్యఅనుచరుడిగా రాణించారు. వెంకట్రావు తన స్వీయ జీవిత చరిత్రను 'నా జీవన గమనం' పేరుతో గ్రంధస్తం చేసారు.
 


హోం
విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, అమృతలూరు మండలం,


 = = = = =


18, జులై 2021, ఆదివారం

మొవ్వ మండలం (Movva Mandal)

తెలుగు వికీపీడియా చచ్చిపోయిన తర్వాత అంతర్జాలంలో మిగిలిన ఏకైక విజ్ఞాన సర్వస్వం cckraopedia (తెలుగు విజ్ఞాన సర్వస్వం) మాత్రమే.
 
జిల్లాకృష్ణా జిల్లా
జనాభా53054
రెవెన్యూ డివిజన్మచిలీపట్నం
రెవెన్యూ గ్రామాల సంఖ్య
17
పిన్‌కోడ్521135
మొవ్వ కృష్ణా జిల్లాకు చెందిన మండలము. వేణుగోపాలస్వామిపై పదాలు పలికిన క్షేత్రయ్య, త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జాస్తి చలమేశ్వర్, గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, ప్రముఖ వైద్యుడు కాకర్ల సుబ్బారావు ఈ మండలమునకు చెందినవారు. సిద్ధేంద్రయోగిచే కూచిపూడి నాట్యం పుట్టిన కూచిపూడి గ్రామం ఈ మండలంలోనే ఉంది. ఐనంపూడి సమీపంలో చమురు నిక్షేపాలున్నాయి. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామపంచాయతీలు కలవు. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు మొవ్వ తాలుకాలోనివే. ఈ మండలం బందరు రెవెన్యూ డివిజన్ లో, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో బాగంగా ఉంది. 
 
జనాభా:
1981 లెక్కల ప్రకారం 51302. ఇందులో పురుషులు 25695, మహిళలు 25607. జనసాంద్రత 356. 2011 లెక్కల ప్రకారము మండల జనాభా 53054. ఇందులో పురుషులు 26219, మహిళలు 26835. 
 

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
అవురుపూడి, అయ్యంకి, బార్లపూడి, భట్లపెనుమర్రు, చినముత్తేవి, గుడపాడు, కాజ, కోసూరు, కూచిపూడి, మొవ్వ, నిడుమోలు, పలంకిపాడు, పెదముత్తేవి, పెదపూడి, పెడసనగల్లు, వేములమాడ, యద్దనపూడి

ప్రముఖ గ్రామాలు
 
అయ్యంకి (Ayyanki):
అయ్యంకి కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య ఈ గ్రామానికి చెందినవారు.  
 
భట్లపెనుమర్రు (Bhatlapenumarru):
భట్లపెనుమర్రు కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ఈ గ్రామానికి చెందినవారు. గ్రామంలో అంగడాల సురేష్ పింగళి స్వచ్ఛంద సేవా సంస్థ పేరున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 

ఐనంపూడి (Inampudi):
ఐనంపూడి కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. ఐనంపూడి సమీపంలో ఆయిల్ నిక్షేపాలున్నాయి.

కూచిపూడి (Kuchipudi):
కూచిపూడి కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. సిద్దేంద్రయోగి నాట్యకళారీతులతో ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. గ్రామం పేరుతో ఇక్కడి నాట్యరీతి కూచిపూడి నాట్యంగా ప్రసిద్ధి చెందింది. కూచిపూడి గ్రామం అసలుపేరు కుశీలపురం. తర్వాత కుచీలపురిగా మారి అనంతరం కూచిపూడి అయినట్లు తెలుస్తుంది. గోల్కొండ నవాబు తానీషా ఈ గ్రామాన్ని కూచిపూడి భాగవతులకు అగ్రహారంగా ఇచ్చాడు.

మొవ్వ (Movva):
మొవ్వ కృష్ణా జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామం వరదయ్య వల్ల ప్రసిద్ధి చెందింది. గ్రామంలో 2 ప్రముఖ ఆలయాలు కలవు. భీమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయం ప్రధానమైనవి. ఈ రెండు ఆలయాలు మౌద్గల్యమునిచే ప్రతిష్టించబడినట్లు పౌరాణికుల కథనం. ఈ ఆలయాలలో భీమేశ్వరాలయం కంటే వరదయ్య ద్వారా వేణుగోపాలస్వామికి అధిక ప్రాధాన్యం లభించింది. వరదయ్య రోజూ పశువులను అడవులకు తీసుకెళ్ళేవాడు. ఒకనాడు మౌద్గల్యముని కనిపించాడు. ఆ ముని వర్దయ్యలో దాగియున్న శక్తిని గమనించాడు. వరదయ్య వేణుగోపాలస్వామి మీద పద్యాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగాడు. అందుచే అతనికి క్షేత్రయ్య పేరు కూడా ఉంది. అతను పలికిన పదాలే క్షేత్రయ్య పదాలుగా ప్రసిద్ధి చెందాయి. క్షేత్రయ్య వల్ల వేణుగోపాలస్వామికి, మొవ్వ గ్రామానికి కూడా ప్రాధాన్యం లభించింది.

పెద ముత్తేవి (Peda Muttevi):
పెద ముత్తేవి కృష్ణా జిల్లా మొవ్వ మండలమునకు చెందిన గ్రామము. పెదముక్తేవిలో వైష్ణవపీఠం ఉంది. ఇది వైష్ణవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో ప్రధాన ఆలయం లక్ష్మీపతి (విష్ణువు) ఆలయం. 1620లో ఏర్పడిన ఈ ఆలయం స్వయంభువుగా పరిగణిస్తారు. గౌహతి మరియు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ గ్రామనికి చెందినవారు.




ఇవి కూడా చూడండి:

\






విభాగాలు: కృష్ణా జిల్లా మండలాలు, , 


 = = = = =


17, జులై 2021, శనివారం

చిలుముల విఠల్‌ రెడ్డి (Chilumula Vithal Reddy)

చిలుముల విఠల్‌ రెడ్డి
రంగం
పోరాటయోధుడు, రాజకీయాలు
పదవులు
5 సార్లు ఎమ్మెల్యే, సిపిఐ పక్ష నాయకుడు, సర్పంచి,
నియోజకవర్గం
నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
మరణం
అక్టోబరు 19,  2012
చిలుముల విఠల్‌ రెడ్డి మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రమునకు చెందిన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. కమ్యూనిజం పట్ల ఆకర్షితుడై  కమ్యూనిస్టు పార్టీలో చేరి నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ నాయకుడైన విఠల్ రెడ్డి సిపీసి శాసనసభ పక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఎన్టీ రామారావుతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. విఠల్ రెడ్డిని అప్పట్లో ఎన్టీఆర్ బావగా అభివర్ణించేవారు.

1957లో మొదటిసారి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1956-62 వరకు కౌడిపల్లి సర్పంచ్‌గా కొనసాగారు. 1962లో మొదటిసారి సీపీఐ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1978లో మరియు 1985, 89, 94ల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 సునీతా లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓటమి తరువాత వయోభారం, అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన అక్టోబరు 19 2012 న మెదక్ జిల్లా నర్సాపూర్‌లో తుదిశ్వాస విడిచారు.
 
 


హోం
విభాగాలు: మెదక్ జిల్లా ప్రముఖులు, కౌడీపల్లి మండలం,


 = = = = =


15, జులై 2021, గురువారం

తెలుగు వికీపీడియా నిర్వాహకులను పిరికి పందులని ఎందుకంటారు?

(గమనిక: తెలుగు భాషాభిమానులు ఈ పోస్టు గురించి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయండి. తెలుగు వికీపీడియా గురించి వాస్తవాలు తెలుగు ప్రజానీకానికి తెలియజేయండి)
తెవికీ నిర్వాహకులు - 
పిరికి పందులు
కారణం
పిరికి చర్యలు
తిట్టినవారు
తెలుగు భాషాభిమానులు
తిట్లుతిన్న దినం
జూలై 2021
తర్వాతి పరిస్థితి
తిట్లు తిన్ననూ నిర్వాహకులలో ఎలాంటి మార్పు లేదు
మార్పు వస్తుందా?
తిట్లు తినడం అలవాటైపోయింది. వీరికి రోజూ తిట్టిననూ ఫలితం ఉండకపోవచ్చు!
ఇటీవలి కాలంలో తెలుగు వికీపీడియా నిర్వాహకులను పిరికిపందులు అనడం సర్వ సాధారణమైంది. ముఖ్యంగా అనామకులు, భాషాభిమానులు ఈ మాటను తరుచుగా ఉపయోగిస్తున్నారు. ఇదేపదం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

పిరికిపందులు పదాన్ని ఉపయోగించడానికి ప్రధాన కారణం తెవికీ నిర్వాహకులు ధైర్ఘ్యంగా చర్చకు చర్చ సమాధానం ఇవ్వకుండా రాసినదాన్ని తుడిచివేయడం మరియు సభ్యులపై, ఐపి అడ్రస్ లపై నిరోధం విధించి పిరికితనం ప్రదర్శించడమే. ప్రజాస్వామ్య పద్దతిపై నడవాల్సిన తెవికీని కొందరు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నియంత లక్షణాలతో నడపడం దారుణమైన విషయంగా చెప్పవచ్చు. కాబట్టే అనామకులచే ఇలాంటి తిట్లు తినడం ఒక విధంగా సరైనదేనని చెప్పవచ్చు! తిట్లు తినడం నిర్వాహకుల స్వయం కృతాపరాధం.

ఒకప్పుడు ప్రజాస్వామ్య లక్షణాలతో పాఠకులను ఆకట్టుకున్న తెవికీ, ప్రస్తుతం పూర్తిగా నియంత లక్షణాలతో నిండిపోయింది. నిర్వాహక, అధికార పదవులను వీడమన్నా అస్సలు వినడం లేదు. అనవసరంగా తెవికీలో ఉండి తెవికీని పూర్తిగా నాశనం చేస్తున్నారు.

జూన్ 20న తెవికీ చచ్చిపోయిన తర్వాత అంతర్జాలంలో మిగిలిన ఏకైక నాణ్యమైన విజ్ఞాన సర్వస్వం "సిసికెరావు పీడియా" మాత్రమే. ఇటీవల కాలంలో దీనికి పాఠకాదరణ కూడా బాగా పెరిగింది. లేని వ్యాసాలు తెవికీ నుంచి కాపీ చేసుకొని నాణ్యత మెరుగుపరిస్తే చాలు తెవికీ లేని లోటు పూర్తిగా పూడ్చినట్టవుతుందని భాషాభిమానులు చెబుతున్నారు. ప్రస్తుత తెవికీలో ఎలాగూ నాణ్యమైన మరియు తాజాకరణ సమాచారం ఉన్న వ్యాసాలు అస్సలు లేవు. ఇప్పటి నిర్వహణ చూస్తే తెవికీ బాగుపడే అవకాశమూ లేదు. కాబట్టి భవిష్యత్తులో తెలుగు పాఠకులకు అందుబాటులో ఉండేది సిసికెరావ్ పీడియా మాత్రమే.
 
ఇవి కూడా చూడండి:
  • తెలుగు వికీపీడియా ఎందుకు చచ్చిపోయింది?
  • తెలుగు వికీపీడియాలో పొరపాట్లు, (గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరినట్లు)
  • తెలుగు వికీపీడియాలో ఏమి జరుగుతోంది,
  • చచ్చిపోయిన తెలుగు వికీపీడియా,
  • తెవికీ నిర్వాహకులను వెధవ నిర్వాహకులుగా ఎందుకు పిలుస్తారు?
  • తెలుగు వికీపీడియా భవిష్యత్తు ఉందా?
  • తెలుగు వికీపీడియాలో ఇటీవలి పరిణామాలు,
  • తెలుగు వికీపీడియా పేరుకే అందరిదా?
  • తెలుగు వికీపీడియాలో అంతర్గత విబేధాలు,
  • తెలుగు వికీపీడియాలో ప్రజాస్వామ్యం నేతిబీరకాయ చందం, 
  • తెవికీని వెధవ వికీపీడియాగా ఎందుకు పిలుస్తారు?
  • నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు చివరిదశలో ఓటింగులో పాల్గొన్న ఆ ఆడాళ్ళు ఎవరు? ఎక్కడివారు? 
  • తెవికీ గ్రామ వ్యాసాలలోని సమాచారం నవ్వడానికే పనికి వస్తుంది!
  • తెవికీ చచ్చిపోయిన తర్వాత అంతర్జాలంలో మిగిలిన ఏకైక నాణ్యమైన విజ్ఞాన సర్వస్వం ఏది?
  • వేలమందితో సాధ్యం కాని విజ్ఞాన సర్వస్వం ఒకేఒక్కడి వల్ల ఎలా సాధ్యమైంది? (https://cckraopedia.blogspot.com/) ఇదే బ్లాగు
 


హోం
విభాగాలు: తెలుగు వికీపీడియా,


 = = = = =


10, జులై 2021, శనివారం

తెలుగు వికీపీడియాను వెధవ వికీపీడియాగా ఎందుకు పిలుస్తారు ?

వెధవ వికీపీడియా
ప్రారంభం
21-07-2021 (జూన్ 20న తెలుగు వికీపీడియా మరణం)
ప్రారంభకుడు
ఒక వెధవ
కారణం
తెవికీకై కృషి చేస్తున్నవారిని వేధించడం


తెలుగు వారికి ఒక బృహత్తర విజ్ఞాన సర్వస్వం రూపొందించాలనే లక్ష్యంతో 2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా మధ్యలో కొంతకాలం పాఠకులను చక్కగా ఆకట్టుకుంది. వైజాసత్య, చంద్రకాంతరావు, కాసుబాబు తదితర వికిపీడియన్లు అప్పట్లో తెవికీకై బాగా కృషిచేశారు. ఆ తర్వాత కొందరు తెవికీ అభివృద్ధి చెందడాన్ని సహించలేక, తెవికీ నుంచి వెళ్ళిపోయినవారు మళ్ళీ పునరాగమనం పేరిట చేరి బాగా అభివృధి చెందుతున్న తెవికీని ఛిన్నాభిన్నం చేయడం మొదలెట్టారు. 
 
ఒక వెధవ నిర్వహకుడు ముందుగా తెవికీకై బాగా కృషిచేస్తున్న సభ్యులపై వేటు వేసి బయటకు పంపాడు.  JVRKPRASAD రైల్వె వ్యాసాలపై విశేష కృషి చేశారు. అలాంటి పెద్దమనిషిపై అకారణంగా తీవ్రాతితీవ్రంగా వేధించి, ఇతర సీనియర్ సభ్యులను, నిర్వహకులను రెచ్చగొట్టి JVRKPRASAD  నిర్వాహక హోదాను రద్దుపర్చి తెవికీ నుంచి వెళ్ళగొట్టాడు ఒక తెవికీ ద్రోహి నిర్వాహకుడు. YVSREDDY వందలాది మంచి వ్యాసాలను రచించిననూ ఏ వ్యాసం కూడా తెవికీ ఉంచడానికి కూడా ఒప్పుకోలేడు. తెవికీ అనేది ఏ ఒక్కడి అబ్బ సొత్తు కాదనే విషయం కూడా ఆ వెధవ నిర్వాహకుడికి తెలియదేమో! కాకుంటే తెవికీని ఛిన్నాభిన్నం చేయడమే లక్ష్యమేమో!
 
పనికిమాలిన పాలసీలు చేసి సభ్యుల విలువైన సమయన్ని వృధాచేసే చదువరి సభ్యులు రచించిన మంచి వ్యాసాలపై వేటు వేయడమెందుకు? కావాలంటే ఆయన చేసిన పనికిమాలిన పాలసిలను రద్దు చెసుకుంటే తెవికీ బాగుపడుతుంది. చదువరి తెవికీని ఎంతగా నష్టపరుస్తున్ననూ మిగితా నిర్వాహకులు అస్సలు నోరు మెదపడం లేదు. భయమా? దొంగచాటు సహకారమా? వారిదీ అదే లక్ష్యమా? అనేది సందేహాస్పదంగా ఉంది. దీనితో తెది జూన్ 20, 2021న తెవికీ చచ్చిపోయినట్లుగా తెలుగు భాషాభిమానులచే ప్రకటించబడింది. 
 
చదువరి, పవన్ లు తెవికీ నుంచి వెళ్ళిపోయెవరకు తెవికీ మళ్ళీ బతికి బయట పడటం కష్టమే. వారిద్దరూ పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోతె చంద్రకాంతరావు బాధ్యత తీసుకొని మళ్ళీ పూర్వవైభవం తీసూ వస్తానన్ననూ వారిద్దరికి మాత్రం తెవికీని బతికించాలనే ఉద్దేశ్యమె లేదు. కేవలం పదవులపై ధ్యాస, డబ్బుపై ధ్యాస మాత్రమే తప్ప తెలుగు పాఠకులపై ఏ మాత్రం ప్రేమ లేదని స్పష్టంగా తెలుస్తోంది.
 
తెవికీ చరిత్రలొనే అత్యంత ప్రముఖ వికీపీడియన్‌గా తెలుగు భాషాభిమానులచే పేరుపొందిన సి.చంద్రకాంతరావుపై అకారణంగా నిరోధం విధించడం వెధన నిర్వాహకుడి అత్యంత వెధవపని. చదువరిపైనే ఒక అనామకుడు నిర్వాహక, అధిక్ర పదవులు తొలిగించాలనే ప్రతిపాదన చేయడం తెవికీ చరిత్రలోనే గొప్పతనంగా చెప్పవచ్చు. ఆ కొపంతో భాషాభిమానులపై పగపట్టడం దారుణం.
 
భాషాభిమానులు తెవికీ లోపాలను చెబుతున్నారని రచ్చబండ లాంటి పేజిలపై తాళం విధించడం, భాషాభిమానుల సభ్యపేజీలను తొలగించడం, వారి చర్చా పేజీలను కూడా తొలగించడం పూర్తిగా వెధవ పనులే. చర్చకు చర్చ సమాధానం కూడా ఇచ్చే దశలో లేని నిర్వాహకులు అనామక సభ్యులచే పిరికి పందులు ల్ంటి తిట్లు తిన్ననూ బుద్ధి రాలేదు. ప్రస్తుతం ఒక్క నిర్వాహకుడికి కొంతవరకు తప్ప మిగితా నిర్వాహకులకు ఏమీ రాదు. అనవసరంగా పదవులను పట్టుకొని వేలాడుతున్నారు. నిర్వహణ అంటే ఏమిటో కూడా తెలియదు. కనీసం తెలుసుకొవాలనే ఉత్సాహం కూడా లేదు. ఏమైనా చెబితే నిరోధమే మరియు సమాచారం తొలగించడం. ప్రజాస్వామ్య పద్దతులపై  నడవాల్సిన తెవికీని పూర్తిగా నియంత లక్షణాలతో మార్చివేశారు. ఇప్పడు తెవికీ నిర్వహకులు చేసేదంతా వెధవ పనులే తప్ప ఒక్క మంచి కూడా చేయడం లేదు. అందుకే ప్రస్తుత తెవికీకి వెధవ వికీపీడీయాగా పిల్వడం జరుగుతోంది

ప్రస్తుత తెవికీలో ప్రజాస్వామ్య లక్షణాలు ఏమీలేవు. కేవలం ఎవరైనా దిద్దుబాట్లు చేసుకోవచ్చని మొదటి పేజీలో ఉంది తప్ప, అన్ని పేజీలకు తాళాలే మరియు రాసిననీ సమాచారం తొలగించడం, సభ్యులపై నిరోధాలు విధించడమే.
 
తెలుగు వికీపీడియా వెధవ వికీగా మారడానికి కారకులు వెధవ పనులు చేసేవారితో పాటు వెధ్వ పనులు చేసేవారిని నివారించలేని ఇతర నిర్వాహకులు కూడా బాధ్యులుగా పరిగణించబడతారు.

గమనిక: తెలుగు వికీపీడియా ఎప్పుడో చచ్చిపోయింది. ఇపుడున్నది వెధవ వికీపీడీయా మాత్రమే. దీనికే తిట్ల వికీపీడియా అని మారుపేరు.


ఇవి కూడా చూడండి:
  • తెలుగు వికీపీడియా ఎందుకు చచ్చిపోయింది?
  • తెలుగు వికీపీడియాలో పొరపాట్లు, (గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరినట్లు)
  • తెలుగు వికీపీడియాలో ఏమి జరుగుతోంది,
  • చచ్చిపోయిన తెలుగు వికీపీడియా,
  • తెవికీ నిర్వాహకులను వెధవ నిర్వాహకులుగా ఎందుకు పిలుస్తారు?
  • తెలుగు వికీపీడియా భవిష్యత్తు ఉందా?
  • తెలుగు వికీపీడియాలో ఇటీవలి పరిణామాలు,
  • తెలుగు వికీపీడియా పేరుకే అందరిదా?
  • తెలుగు వికీపీడియాలో అంతర్గత విబేధాలు,
  • తెలుగు వికీపీడియాలో ప్రజాస్వామ్యం నేతిబీరకాయ చందం, 
  • తెవికీని వెధవ వికీపీడియాగా ఎందుకు పిలుస్తారు?
  • నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు చివరిదశలో ఓటింగులో పాల్గొన్న ఆ ఆడాళ్ళు ఎవరు? ఎక్కడివారు? 
  • తెవికీ గ్రామ వ్యాసాలలోని సమాచారం నవ్వడానికే పనికి వస్తుంది!
  • తెవికీ చచ్చిపోయిన తర్వాత అంతర్జాలంలో మిగిలిన ఏకైక నాణ్యమైన విజ్ఞాన సర్వస్వం ఏది?
  • వేలమందితో సాధ్యం కాని విజ్ఞాన సర్వస్వం ఒకేఒక్కడి వల్ల ఎలా సాధ్యమైంది? (https://cckraopedia.blogspot.com/)


హోం
విభాగాలు: తెలుగు వికీపీడియా


 = = = = =


7, జులై 2021, బుధవారం

రేనాటి చోళులు (Renati Chola):

రేనాటి చోళులు 
(Renati Chola):
పాలనాకాలం
క్రీ.శ. 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం
పాలనా ప్రాంతం
ఇప్పటి కడప, కర్నూలు, చిత్తూరు, నల్గొండ,
రాజధాని
పెద్దచిప్పాలి
అధికార భాష
తెలుగు
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేనాటి చోళులకు విశేషమైన స్థానం కలదు. .రేనాడు అని వ్యవహరింపబడిన ఇప్పటి కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు జిల్లలోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలు)తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడా పిలుస్తారు. క్రీ.శ. 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు చోళవంశానికి చెందిన ఒక శాఖ ఈ ప్రాంతంలో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశంలుగా ఏర్పడ్డారు. 7వ శతాబ్దంలో పర్యటించిన హ్యూయాన్‌త్సాంగ్ ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. మొదట 7,000 గ్రామాల పరిమితి గల దేశం 16వ శతాబ్దినాటికి ఉదయగిరి పెనుగొండ దుర్గాల మధ్య అధిక భాగం ఆక్రమించి ఉంది.

ఈ వంశీయులు వేయించిన శాసనాలు తెలుగుభాషలో నున్నవి. మొట్ట మొదట తెలుగుభాషలో శాసనాలు వేయించిన కీర్తి రేనాటిచోళులకే దక్కింది.వీరి శాసనాలలో ఆంధ్రభాష స్థానమాక్రమించి, ప్రాకృత ప్రభావితమై, తెలుగు భాష ప్రాథమిక దశను సూచించింది. ప్రాకృత పదాలతో కలిసియున్న తెలుగు పదాలు, వింతవింత రూపాలతో కనిపించి, ఆంధ్రభాషా వికాసంను పరిణామంను సూచించును. వీరి శాసనాలలో ధనంజయుని కలమళ్ళ శాసనం మొదటి తెలుగు శాసనంగా (క్రీ.శ.) పరిగణించబడుతుంది.

వీరి మొదటి నివాసమగు చోళవాడి తెలంగాణలోని నేటి నల్గొండ, మహబూబునగరు ప్రాంతమని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. రేనాడు ఏడువేల దేశం.అనగా ఏడువేల గ్రామాలున్న దేశం.రేనాటిని పాలించిరి గావున వీరు రేనాటి చోళులు అయ్యారు. వీరి శాసనాల ప్రకారం వీరు కరికాల చోడుని సంతతివారని, సూర్యవంశీయులని, కాశ్యప గోత్రీయులని తెలిస్తుంది. కడప మండలము పాలించినవారు రేనాటి చోడులు. కాలక్రమానన వీరు పాకనాడను ఆక్రమించి చిన్న చిన్న కుటుంబాలుగా చీలి, రాజ్యాలను స్థాపించి పాలించారు. వీరిలో రేనాడు, పాత్తపినాడు, కొణిదెన, నెల్లూరు ప్రాంతాలను పాలించిన చోడవంశీయులు ప్రసిద్ధులు.

పుణ్యకుమారుని తిప్పలూరు శాసనం ప్రకారము వీరి రాజధాని కమలాపురం తాలూకాలోని పెదచెప్పలి. ఇచట ప్రాచీనకాలపు కోట చిహ్నాలు, తామ్రశాసనాలు, శిలాశాసనాలు లభ్యమైనాయి..

రేనాటి చోళులు మొదట పల్లవరాజులకడ సామంతులుగా ఉండి స్వతంత్రులయ్యారు. శాసనాలను బట్టి కరికాలుని వంశంలో నందివర్మ (క్రీ.శ.550), అతని కుమారులు సింహవిష్ణు, సుందరనంద, ధనంజయవర్మ (క్రీ.శ.575), కడపటివానికి మహేంద్రవిక్రమ (క్రీ.శ.600), వానికి గుణముదిత, పుణ్యకుమార అను ఇద్దరు కొడుకులు పుట్టారు. పుణ్యకుమారుడు (క్రీ.శ.625) హిరణ్యరాష్ట్రం ఏలాడు. అతని తర్వాత కొడుకు విక్రమాదిత్య (క్రీ.శ.650), శక్తికుమారుడు (క్రీ.శ. 675), రెండవ విక్రమాదిత్యుడు (క్రీ.శ.700), సత్యాదిత్యుడు, విజయాదిత్యుడు (క్రీ.శ.750) పాలించారు. క్రీ.శ.800లో శ్రీకంఠుడు రాజ్యం చేశాడు. దీనినిబట్టి రేనాటి చోళులు క్రీ.శ.550 నుండి క్రీ.శ. 850 వరకు సుమారు 3 శతాబ్దాలు రాజ్యం చేశారని తెలుస్తుంది..
నందలూరులొ రేనాటి చోళులు నిర్మించిన ఆలయం
పరిపాలనా విధానం
రేనాటి చోడులు స్వతంత్రముగ కడప, చిత్తూరు మండలములను పాలించినను కొంతకాలము, విష్ణుకుండినులు కు, పల్లవులుకు చాళుక్యులుకు సామంతులుగా వ్యవహరించిరి. వీరి కాలమున ఆంధ్రదేశము సుభిక్షముగా నుండెను.వీరు సూర్యరాధాధికులు.చోడమహారాజు ఆజ్ఞగైకొని, సూర్యగ్రహణ నిమిత్తమున సూర్యునికి దేవాలయమును నిర్మించి, దేవ భోగారము కొంతభూమిని, ఒక గానుగును దానమిచ్చినట్లు చిలంకూరు శాసనమువలన తెలియుచున్నది.

వీరి కాలమున భూమిని న్రితుడ్లలూను, మఱుతుడ్లలోను కొలిచెడివారు.ప్రతీ వైశాఖ పున్నమిరోజు పండుగలు జరుపెడివారు.దేశము మండలములగను, విషయములుగను, గ్రామములగ విభజింపబడెను.గ్రామములందు రట్టొడ్లు లేదా రాట్టులు, లేక రెడ్లు ప్రాముఖ్యము వహించుచుండిరి.వీరు రైతులనందు పన్నును వసూలు చెసి రాజుకు ఇచ్చుచుండి.

ఆ కాలమున శాసనములను విశ్వబ్రాహ్మణులు అనగా పంచాజ్ఞము వారిలో నొకరగు కమ్మరులు వ్రాయుచుండిరి. శాసనలేఖకుడిని శిల్పి అనిఅనెడివారు.బ్రాహ్మణులకుగాని దేవాలయములకుగాని ఇచ్చిన భూమిని పన్నశ అని పిలుచుచుండిరి.వీరి యుద్ధములలో ఒకరి నొకరు కత్తులతో పొడుచుకొని మరణించిన సంఘటనలు ఎక్కువుగా జరిగినట్లు శాసనములు తెలుపుచున్నవి. కొన్ని చోట్ల పురుషులకు కుళ్ళమ్మ అని పిలుచుచుండిరి. సేనాపతిని చమూపతి అనేవారు. రాజు దైవాంశసంభూతుడని అప్పటి ప్రజల విశ్వాసము. చమూపతి, ధనాధ్యక్షుడు, మహామంత్రి, అమాత్యుడు మున్నగు వారు రాజ్యమునకు అధికారులు. ముఖ్యమైన ఉద్యోగులకు దుగరాజు అను బిరుదు గలదు. క్రింది ఉద్యోగులలో పేరుల చివర 'కాలు' అను పదము ఉంది. రేవణకాలు, పుద్దనకాలు, ఎడ్లకాలు, చేలకాలు, తరట్లకాలు ఉదాహరణలు.

స్త్రీలు కరాభరణములు, ముక్కరలు, కొప్పులకు పూలు, కంకణములు ధరించుచుండిరి.వివాహములు సాధారణముగా నాలుగు రోజులు జరుగు చుండెను.ప్రజలలో వినోద ప్రదర్శనలను ప్రోత్సహించు వారుండిరి.ఆకలమున వాడుకలో నున్న కోడి పందెములు, మేషమహిషయుద్ధములు, పండుగలు, ఏరువాకపున్నమువంటి పండుగలు ప్రజావినోదముల్గా పరిగణింపబడుచుండెను.

కరికాలుని సంతతికిచెందిన వీరు కావేరీ తీరమునగల చోళవంశమువారు. ధనంజయవర్మకు పూర్వమే వీరు తెలుగు దేశానికి వలస వచ్చిఉంటారు. కమలాపురం తాలూకాలో కలమళ్ళ గ్రామంలో ధనంజయవర్మ వేయించిన శిలాశాసనం వారి వంశపువారికే మొదటిదిగాక తెలుగు భాషకే మొదటి వాక్యరచనయై ఉంది. పగిలిఉన్న శిలాభాగములో "ఎరికల్ ముతురాజు ధనుంజయుడు రేణాండు ఏళన్" అనే వాక్య భాగము పూర్తి అర్థమిస్తున్నది. ‘ఎరికల్ ముతురాజు’ అనేది ఒక బిరుదు. లిపిని బట్టి శాసనము ఆరవ శతాబ్దము రెండవ సగము నాటిదని చెప్పుదురు.

రేనాటి చోళులు కాలమున తటాకములు నిర్మింపబడి కాలువులు త్రవ్వింపబడినవి.చెరువులు, కాలువలు త్రవ్వుట హిందూమత సంప్రదాయము ప్రకారము సప్తసంతాన ప్రతిష్ఠలలో చేరునని వీరు అభిప్రాయము.రాజులు వ్యవసాయాభివృద్ధికి కృషిచేయుచుండిరి.దేవభోగములకు బ్రాహ్మణులకు ఇచ్చిన భూమిపై పన్ను ఉండేదికాదు.

వీరి కాలమున వైదికమతము వృద్ధిచెందినట్లు తెలియుచున్నది. యజ్ఞయాగాదులకు ప్రాముఖ్య ఇచ్చినట్లు ఉంది. ఈ కాలమున శైవ మతము ఆంధ్రదేశమున వ్యాపించింది. సూర్యారాధన ఆనాడు విశేషవ్యాప్తిలోనుండెను.గ్రామాధికారులగు రెడ్లు దేవాలయములను నిర్మించెడివారు.

జైనబుద్ధ మతములనాదరించు ప్రజలు, ఆమత సన్యాసుల ప్రవర్తనలననుసరించు చుండిరి.జైన మతముందేర్పడిన కాపాలిక జైన విభాగమున జైనపాలికుల మధుమాంస భక్షణము, కాపాలిక స్త్రీలతో వ్యవహారము, ప్రజలలో సంచలనము బయలు దేరినది.వజ్రయాన బౌద్ధమత విభాగము వలన, బౌద్ధ సన్యాసుల యొక్కయు, సన్యాసినుల యొక్కయు అవధులు లేని ప్రవర్తన ప్రజలలో అసహ్యము కలిగించి వైదిక మతము వైపు వారి మనస్సులను మరల్చినవి.ఇది శైవ విజృంభణకు దోహదమైనది.

రేనాటి చోళులు పాలించిన కాలమున ఆంధ్ర వాజ్మయము ఆరంభదశలో నుండెను. తెలుగు పద్యములను పోలిన పద్యములు వీరి శాసనములందు కనిపించినను అవి గణ యతి ప్రాస నియమరహితముగ నున్నవి.ఇవి గద్యమయములు.ఇందు వృత్తగంధివాక్యము లున్నవి.

ఈకాలపు శాసనములందు ఫలశ్రుతి ఒకేవిధముగా ఉంది. దానమును కాచినవారికి అశ్వమేధ యాగము ఫలమును, వక్రము చేసినవారికి వారణాసిలో బ్రాహ్మణులను, కపిలగోవులను చంపిన పాపము కలుగునని చెప్పిరి.ఫలశృతి అనంతరము ఆజ్ఞప్తి కర్తృ లేఖకుల పేళ్ళు శాసనమున చేర్చబడెను.

ప్రొద్దుటూరి దగ్గర పెన్నానది ఒడ్డున రామేశ్వరాలయమును "పోర్ముఖరామ" అను బిరుదు గల పుణ్యకుమారుడు కట్టించాడు. 
 
 
 



హోం
విభాగాలు:తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర,


 = = = = =


5, జులై 2021, సోమవారం

పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami):

పుష్కర్ సింగ్ ధామి
జననం
సెప్టెంబరు 16, 1975
రంగం
రాజకీయాలు
పదవులు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి


ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన పుష్కర్ సింగ్ ధామి సెప్టెంబరు 16, 1975న పిరోరాగఢ్‌లో జన్మించారు. లక్నో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి అ తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. 2002-06 కాలంలో భాజపా రాష్ట్ర యువమోర్చ్చా అధ్యక్షుడిగా పనిచేశారు. ఖటీమా నుంచి 2 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. త్రివేంద్రసిం రావత్ పై అసమ్మతితో జూల్య్ 3, 2021న ఉత్తరాఖండ్ ముఖ్య్మంత్రిగా పదవి పొందారు. ఉత్తరాఖండ్‌కు ఈయనే అత్యంత పిన్న వయ్స్కుడైన ముఖ్యమంత్రి.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు, భాజపా ప్రముఖులు,భాజపా ప్రముఖులు,


 = = = = =


22, జూన్ 2021, మంగళవారం

చచ్చిపోయిన తెలుగు వికీపీడియా (Telugu Wikipedia expired)

ప్రారంభం
డిసెంబరు 10, 2003
ప్రారంభకుడు
వెన్న నాగార్జున
వ్యాసాల సంఖ్య
69,600+
అంతం
జూన్ 20, 2021
జనవరి 15, 2001న మొదటగా ఆంగ్లభాషలో వికీపీడియా అంతర్జాల విజ్ఞానసర్వస్వంను జిమ్మీవేల్స్, లారీసాంగర్ ఆరంభించిన పిదప పలు ఇతర భాషలలో కూడా వికీపీడియాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా వెన్న నాగార్జున కృషితో డిసెంబరు 10, 2003న తెలుగు వికీపీడియా (తెవికీ) ఆవిర్భవించింది. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే వికీపీడియా. అక్టోబరు 2020 నాటికి తెలుగు వికీపీడియాలో 69,600 వ్యాసాలు, 13,400 ఫోటోలు ఉన్నాయి. 2007-2009 కాలంలో తెలుగు వికీపీడియా బాగా అభివృద్ధి చెందింది. నాణ్యమైన వ్యాసాలు వెలువడే ఆ కాలంలో ఆదరణ కూడా  చక్కగా ఉండేది. కాని క్రమక్రమంగా కొందరు సభ్యుల ధోరణి ఏకపక్షంగా మారడం, తమ వాదనే నెగ్గాలనే వాదనకు పట్టుపడటం, నాణ్యతను దిగజార్చడం, వాసికి కాకుండా రాసికే ప్రాధాన్యత ఇవ్వడం, చర్చలలో హుందాతనం కోల్పోవడం, తిట్లు - వెక్కిరింపులు - హేళనగా మాట్లాడటం తదితర అసహజ చర్యల వల్ల తెవికీ దిగజారుడు మొదలైంది. దీనికి తోడు వ్యాసాల నాణ్యత కూడా దిగజారడంతో క్రమక్రమంగా తెవికీ ప్రభ దిగజారి 2020 నాటికి ఆదరణ కోల్పోయింది. నిర్వహణ లోపం వల్ల తెలుగు వికీపీడియా జూన్ 20, 2021న చచ్చిపోయింది.

తెలుగు వికీపీడియా చరిత్ర:
తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టిన ఘనత అప్పట్లో (2003లో) బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జునకు దక్కుతుంది. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం అంతర్జాలంలో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామనే దానికి సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించడంతో తెవికీ డిసెంబరు 10, 2003న ఆవిర్భవించింది.

2003 డిసెంబరులో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. నాగార్జున తెలుగు సమాచార సమూహములలో ప్రచారం చేయడం ప్రారంభించగా, ఆయన ప్రయత్నం మూలంగా క్రమక్రమంగా సభ్యులు చేరడం ఆరంభించారు. రావు వేమూరి, మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతను నిర్వహిస్తున్న కట్టామూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. ఆ తరువాత చావాకిరణ్‌, వైజాసత్య, మాకినేని ప్రదీపు మొదలైన వారి విశేష కృషితో మరింత ముందుకు సాగింది. 2005లో జూలైలో వైజాసత్య కృషితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల గురించిన సమాచారం తెలుగులో అంతర్జాలంలో చదువుకొనగలిగిన అవకాశం పాఠకులకు కలిగింది. 2005 సెప్టెంబరులో విశేషవ్యాసం, మీకు తెలుసా, చరిత్రలో ఈ రోజు శీర్షికలు ప్రారంభమైనాయి. ప్రదీప్ కృషితో ప్రతి మండల వ్యాసంలో పట్లు చేర్చబడ్డాయి.

ఆ తరువాత వీవెన్ కృషితో తెవికీ రూపురేఖలు సుందరంగా తయారైంది. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన కాజా సుధాకరబాబు (కాసుబాబు), చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైన వారికృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలయ్యాయి. బ్లాగేశ్వరుడు, విశ్వనాధ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో కృషి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. చంద్రకాంతరావు కృషి ఆర్థికశాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. టి.సుజాత నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషి చేశారు. చిట్కాలను, ప్రకటనలపై దేవా, ఇస్లాము వివరాలపై అహ్మద్ నిసార్ కృషి చేశారు. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక అక్టోబరులో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమైంది. కాసుబాబు ఈ శీర్షికలను దాదాపు ఐదేళ్లు ఒక్కడే నిర్వహించడం విశేషం. వీటిని కొంత కాలం చంద్రకాంతరావు, అర్జునలు కొనసాగించగా 2013 నుండి కె.వెంకటరమణ, రవిచంద్ర నిర్వహిస్తున్నారు. రైల్వే వ్యాసాలపై జి.వి.ఆర్.కె.ప్రసాద్, శాస్త్ర-సాంకేతికాలపై వై.వి.ఎస్.రెడ్డి కృషి కూడా మెచ్చుకోతగింది. కాని తెవికీలో బాగా కృషి చేస్తున్న వీరిపై ఓర్వలేని చదువరి బలవంతంగా రచనలు ఆపివేయించి తన వెధవ తనాన్ని చాటిచెప్పాడు.

తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో తెవికీ వార్త జూలై 1, 2010న ప్రారంభమైంది కాని 8 సంచికలు తరువాత ఆగిపోయింది. 2011 లో వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. 
 
2013 అక్టోబరు 22న సి.చంద్రకాంతరావుచే తెవికీ నిర్వహణ బ్లాగు ప్రారంభమైంది. కొత్తవారికే కాకుండా తెవికీ నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని తెల్పుట ఈ బ్లాగు ప్రారంభించుట ప్రధాన ఉద్దేశ్య్ం (తెవికీ లింకు). 2013 నవంబరులో గ్రామ వ్యాసాలలో గణాంకాలు చేర్చే పని ప్రారంభమైంది. అదే సం.లో తెవికీ ప్రారంభమై పదేళ్ళు పూర్తయిన సందర్భంగా పదిమందికి "కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం" ప్రధానం చేయబడింది. నూనె వ్యాసాలపై పాలగిరి రాసిన విశేష వ్యాసాలు పాఠకాదరణ పొందాయి.
 
2015లో తిరుపతిలో జరిగిన 11వ వార్షికోత్సవానికి సంబంధించిన నిధుల వినియోగంపై సభ్యుల మధ్య వాదవివాదాలు జరిగాయి. 2015 ప్రాంతంలో కొందరు సభ్యులు దిద్దుబాట్లు పెంచుకోవాలనే మోజుతో గ్రామవ్యాసాలపై దండెత్తుతూ ఖాళీవిభాగాలు చేర్చడం, అవనసర మార్పులు చేయడం, బాటుతో చేర్చాల్సిన మార్పులు, చేర్పులు మానవీయంగా చేయడం, నాణ్యతకు కాకుండా కేవలం దిద్దుబాట్ల సంఖ్యకే ప్రాధాన్యత ఇవ్వడంతో తెవికీ నాణ్యత ఈ కాలంలో దారుణంగా పడిపోయింది. తెవికీలో లక్షల దిద్దుబాట్లు చేసినవారు కూడా ఎలాంటి నాణ్యమైన దిద్దుబాట్లకు ప్రాధాన్యత ఇవ్వలేరు. ఈ విషయంపై చంద్రకాంతరావు పలుమార్లు తీసిన చర్చలు కూడా అసంపూర్తిగా మిగిలాయి. ఒకానొక దశలో చర్చతీసిన సభ్యుడిపై మరియు నాణ్యతకు వ్యతిరేకంగానే దాడులు జరిగాయి. ఒక సభ్యుడైతే ఇప్పటికే కేవలం తన రికార్డులకై మాత్రమే తెవికీని సాధనంగా ఉపయోస్తున్నాడు.

ఇదే కాలంలో వ్యాసాల సంఖ్య వేగంగా పెంచే ఉద్దేశ్యంతో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వ్యాస సమాచారంలో చాలా పొరపాట్లు ఉండిపోయాయి. ఆ పొరపాటు ఇంకనూ సరిదిద్దడం జరగలేదు. దేశాల, నగరాల వ్యాసాలలో అధ్యక్షుల/ప్రధానమంత్రుల, మేయర్ల పేర్లు అవసరం లేదని, చురుకైన సభ్యుల కొరత కారణంగా వాటిని తాజాకరణ చేసేంత శక్తిసామర్థ్యాలు తెవికీకి లేవని చంద్రకాంతరావు చెప్పిన విషయాలు ఇప్పడు నిజమౌతున్నాయి. ఇప్పటికీ చాలా వ్యాసాలలో పాత సమాచారమే మిగిలిపోయింది. మరణించిన వ్యక్తులను కూడా జీవించినవారుగా, పదవులలో ఉన్నవారుగా తెవికీ వ్యాసాలు చెబుతున్నాయి. (2015లోనే తెవికీలోని తప్పులపై చంద్రకాంతరావు రచ్చబండలో పెట్టిన చెప్పుకోండి చూద్దాం క్విజ్ చూడండి).

2019 నుంచి తెవికీలో మరో సమస్య మొదలైంది. ప్రధాన సభ్యుల మధ్యన గ్రూపిజం ఉన్నట్లుగా చర్చల ద్వారా వ్యక్తమౌతోంది. దానికి అసలైన కారణాలు ఏమిటో చాలా సభ్యులకు తెలయకపోయిననూ ఆధిపత్య ధోరణి ప్రధాన కారణంగా చర్చలలో వ్యక్తమైంది.

2020లో చిన్న వ్యాసాలను పెద్ద వ్యాసాలుగా చేసే పనిలో నాణ్యత దిగజారి పాఠకులకు శ్రమగా మిగిలింది. ఇటీవలి కాలంలో అర్జునరావు మరియు వెంకటరమణ తెవికీలో చేస్తున కృషి ప్రశంసనీయం. తెవికీలోని లోపాలను బయటపెడుతూ చంద్రకాంతరావు తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మషేష్ కుమార్ కూడా 2020లో తెవికీలో చురుకుగా ఉంటూ తెవికీ లోటుపాట్లను సున్నితంగా బహిర్గతం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు అనవసర ప్రతిపాదనలు చేయడం, చాలా చర్చలకు సరైన ఫలితాన్ని ప్రకటించక నియమాలను ఉల్లంఘించడం జరుగుతోంది. పనికిమాలిన పాలసీలు చేసి సభ్యుల సమయాన్ని వృధాచేశారు. ఆ పాలసీలను తర్వాత ఏ మాత్రం పట్టించుకోలేరు.

ఒకానొకప్పుడు స్వర్ణయుగంగా భాసిల్లిన తెలుగు వికీపీడియా పాఠకుల అభిప్రాయాలకు విరుద్ధంగా కొందరు ప్రవర్తించడంతో నాణ్యత ప్రాధాన్యత ఇచ్చే పలువులు చురుకుదనం తగ్గించడంతో ప్రస్తుత కాలంలో తెవికీ కళ పూర్తిగా తప్పి వెధవ వికీపీడీయాగా మారింది. దినదినానికి ఊబిలో కూరుకుపోతోందన్న భావన కూడా పలు సార్లు తెవికీ చర్చలలో వ్యక్తమైంది. ప్రస్తుతం మాత్రం పూర్తిగా చచ్చిపోయింది. దశాబ్దం క్రితం పలు తెవికీ ప్రముఖుల కృషి ఫలితం నిష్ఫలమైనట్లే. ఇదే విషయాన్ని కొన్నాళ్ళక్రితమే చంద్రకాంతరావు బహిర్గతం చెశారు. ఇప్పుడు అదే నిజమైంది.

ప్రస్తుతం గ్రామ వ్యాసాలలో ఉన్న మెజారిటీ సమాచారం పూర్తిగా తప్పుగా ఉంది. ఈ తప్పులను ఉంచడం సరికాదనీ, వ్యాస పరిమాణం తగ్గిననూ నాణ్యమైన మరియు పొరపాటు లేని సమాచారం మాత్రమే ఉంచడం సమంజసమని చంద్రకాంతరావు చెప్పిననూ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. తెవికీ పొరపాట్లు ఎన్నో జరుగుతున్ననూ పట్టించుకోవడం లేదు పైగా పొరపాట్లు తీసిన సభ్యుడిపైనే ఎదురుదాడికి దిగి తిట్లపురాణం అందుకోవడం తెవికీ నిర్వాహకుని దిగజారుడు తనానికి ప్రబల నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదే విషయాన్ని కొన్నాళ్ళక్రితమే చంద్రకాంతరావు బహిర్గతం చెశారు. చదువరి మరియు పవన్ సంతోష్‌ల వల్లనే తెవికీకి ఈదుర్గతి పట్టిందని స్పష్టంగా తెలుస్తుంది.

వేలాదిమంది కృషి ఫలితంగా తయారైన తెలుగు వికీపీడియా కంటే ఒక్కరు మాత్రమే నిర్వహించే బ్లాగులు, యూట్యూబ్‌ల కంటే సరాసరి వ్యాస వీక్షణలు తక్కువగా ఉండుటకు ప్రధాన కారణం పాఠకాదరణ లేకపోవడమే. యాధృచ్ఛికంగా వచ్చే పాఠకులే కాని రిపీటెడ్ వ్యూవర్ల సంఖ్య స్వల్పంగా ఉంది. తెవికీ గ్రాంటుల ద్వారా ఎన్నో సమావేశాలు, శిక్షణలు, వర్క్‌షాపులు చేసిన పిదప కూడా వీక్షకులు పెరగడంలేదు. ప్రతి వ్యక్తి చేతిలో ఇప్పుడు అంతర్జాలంతో కూడిన సాఫ్ట్ ఫోన్ ఉన్ననూ దశాబ్దం క్రితం నాటితో పోలిస్తే వీక్షణల సంఖ్య బాగా తగ్గిపోయింది. గూగుల్ సెర్చ్‌లో మరియు గూగుల్ మ్యాప్స్‌లోవికీపీడియాకు ప్రాధాన్యత ఉండిననూ పాఠకుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని వ్యాసాలే ప్రధాన కారణంగా సభ్యుల చర్చల ద్వారా తెలుస్తుంది. 
 
తెవికీ తరఫున శిక్షణకై గ్రాంటు తీసుకున్న సభ్యులు ఆ డబ్బు ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. ఆ లెక్కలను బహిర్గతపర్చాలి. లేనిచో నిధులు దుర్వినియోగం చేసినట్లుగా పరిగణించి రికవరి చేయించాలి.

జూన్ 2021లో తెవికీ చరిత్రలోనే ఎప్పుడు జరగనంత నిర్వహణ పొరపాట్లు జరిగాయి. చిన్న నిర్వహణను కూడా తట్టుకోలేక అనామక సభ్యుల చేత బండబూతులు తిన్ననూ నిర్వాహక హోదాను పట్టుకు వేలాడుతున్నారు. ఒక నిర్వాహకుడైతే కేవలం తన రికార్డులు కోసం అంటే స్వార్థప్రయోజనాలకోసం మాత్రమే తెవికీని సాధనంగా ఉపయోగిస్తున్నాడు. తెవికీలో నిర్వహణ పూర్తిగా నిరాదరణకు గురైంది. దీనితో తేది 20-06-2021న ఆదివారం నాడు తెలుగు భాషాభిమానులు తవికీ (తెలుగు వికీపీడియా) చచ్చిపోయిందని హైదరాబాదులో జరిగిన తెలుగు భాషాభిమానుల సమావేశంలో ప్రకటించారు..


చచ్చిపోయిన తెవికీని మళ్ళీ పట్టాలెక్కించడానికి ప్రముఖ వికీపీడియాన్, తెవికీ త్రిమూర్తులలో ఒకరైన చంద్రకాంతరావు పునరుజ్జీవ ప్రతిపాదన చేసిననూ తెవికీని దారుణంగా దెబ్బతీసిన నిర్వాహకులు తమ పదవులు వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో తెలుగు ప్రజానీకానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.

సంవత్సరాల నుంచి తెలుగు పాఠకులకు ప్రయోజనకరంగ ఉన్న వికీపీడియా ఇక చరిత్రకే పరిమితం కానుంది. ఇన్నేళ్ళ సభ్యుల కృషి కూడా సమాధికే పరిమితమైపోవడం విచారకరం. దీన్ని తాజాకరణతో పాటు మళ్ళీ పూర్వ వైభవానికి చంద్రకాంతరావు ప్రతిపాదించిన పునరుజ్జీవ ప్రతిపాదన సాధ్యమైతే తప్ప భవిష్యత్తులొ తెవికీ కనిపించదు. తెవికీ సర్వనాశనానికి కారకులైన నిర్వాహకులు తమ పదవులకు రాజీనామా సమర్పిస్తె తప్ప ఇది సాధ్యం కాదు. నిర్వహణ చేతకాక తెవికీ మరణానికి కారకులైనవారు పదవులు పట్టుకొని వేలాడటం దారుణమైన విషయం.

చిన్న సమస్యను పరిష్కరించలేని తెవికీ నిర్వాహకులు అనామకుల చేత పిరికి పందులు అంటూ తిట్లు తిన్ననూ బుద్ధి రాలెదు. పదవులను పట్టుకొని నాట్యం చేస్తూ తెలుగు వికీపీడియాని పూర్తిగా చంపివేశారు.

ఇన్నేళ్ళ నుంచి పలువురు తెవికీ ఇన్నేళ్ళ నుంచి పలువురు తెవికీ యోధుల మూలంగా అభివృద్ధిచెందిన తెవికీని దారుణంగా హతమార్చిననూ వీరిపై ఇతర నిర్వాహకులు ఎందుకు మిన్నకుండిపొయారన్నది అంతుచిక్కని ప్రశ్న. తెవికీ నాశమౌతున్ననూ చూస్తూ ఊరుకోవడం మిగితా నిర్వాహకుల చేతగాని తనమా? అసలు వారు బతికే ఉన్నారా? బతికి ఉంటె నైతిక బాధ్యత వహించి నిర్వాహక హోదాలను వెంటనే త్యజించాలి. నిర్వాహకులుగా ఉంటూ తెవికీని నాశనం చేసే కంటే వెళ్ళిపోవడమే అత్యుత్తమం...
 
Telugu Wikipedia
 

తెవికీ సర్వనాశనాకికి కారకులందరూ తెలంగాణ ద్రోహులే. ఇదివరకు తెలంగాణకు చెందిన ప్రతి మండల వ్యాసంలో చరిత్రలో భాగంగా సి.చంద్రకాంతరావు సకలజనుల సమ్మె సమచారం చేరిస్తే నిష్కారణంగా తెలంగాణ ద్రోహులు తొలగించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తెలంగాణ వ్యాసాలపై, తెలంగాణ నిర్వాహకులపై మొదట చర్యలు తీసుకొని ఆ తర్వాత తెవికీని హతమార్చారు. ఇకపై తెవికీలో తెలంగాణ వ్యాస సమాచారం మారుమ్రోగిపోవాలి (తెవికీని బతికిస్తే!). (జై తెలంగాణ, జైజై తెలంగాణ).



 
(ఇంకా ఉంది)
 
తెలుగు భాషాభిమానుల దృష్టిలో::
 
  • తెవికీ త్రిమూర్తులు: వైజాసత్య, చంద్రకాంతరావు, కాసుబాబు.
  • తెవికీ రాక్షసులు: చదువరి, పవన్ సంతోష్.
  • తెవికీ స్వార్థపరుడు: ప్రణయ్‌రాజ్ వంగరి,
  • తెవికీ బచ్చాగాడు (పిల్లోడు) : యర్రా రామారావు,
  • తెవికీ హంతకులు: చదువరి, పవన్ సంతోష్
  •  
 
 
ఇవి కూడా చూడండి:
 


హోం
విభాగాలు: తెలుగు వికీపీడియా,


 = = = = =


Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక